The Jengaburu Curse: ప్రస్తుతం ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్ లు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో చాలామంది ఓటీటీనీ టార్గెట్ చేసుకొని వెబ్ సిరీస్ లు అనేకమైనవి చిత్రీకరిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఓటీటీల ద్వారా గుర్తింపు సంపాదించుకొని సినిమా రంగంలో కూడా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల “ద జెంగబూరు కర్స్” అనే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆగస్టు 9వ తారీకు నుంచి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటన చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. “జాతి రత్నాలు” ఫేమ్ ఫరియా అబ్దుల్లా “ద జెంగబూరు కర్స్” లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక స్టోరీ విషయానికొస్తే ఒడిస్సా రాష్ట్రంలో గిరిజనులు ఉండే ప్రాంతంలో కొన్ని వేల ఖరీదు చేసే మైనింగ్ కి సంబంధించి ఆస్తి బయటపడటంతో.. అక్కడి ప్రజలను భయంకరంగా చంపేస్తారు. ఒక అంతు చిక్కని వ్యాధి సోకిందని.. నమ్మించి గిరిజన ప్రాంతాల నుండి ప్రజలు వెళ్లిపోయేలా చేయటం ట్రైలర్ లో కనిపిస్తుంది.

ఇక అదే ప్రాంతంలో ప్రియా (ఫరీయా అబ్దుల్లా) కనిపించకుండా పోయిన తన తండ్రిని వెతుకుతూ ఉంటది. ఈ క్రమంలో గిరిజనులు ఉండే ఆ చిన్న ఊరిలో జరుగుతున్న అన్యాయం ఇంకా జరుగుతున్న మైనింగ్ వ్యాపారాలు గురించి ఆమె తెలుసుకుని.. అన్యాయానికి గురవుతున్న ఆదివాసీలను ఎలా కాపాడింది అనేది ఈ వెబ్ సిరీస్ స్టొరీ. హైదరాబాద్ వాసి అయిన ఫరీయా అబ్దుల్లా “జాతి రత్నాలు” సినిమాతో.. మంచి పేరు సంపాదించింది. అందం, అభినయం ఉన్నాగాని.. “జాతి రత్నాలు” తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ..
మెయిన్ హీరోయిన్ కంటే స్పెషల్ రోల్స్ లో కనిపించింది. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో చిందలేసిన ఈ పొడుగు కాళ్ళ సుందరికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటువంటి పరిస్థితులలో ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో “ద జెంగబూరు కర్స్” అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఫస్ట్ టైం ఇండియాలోనే క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో.. ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఓటీటీ సంస్థ సోని లివ్ లో ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో “ద జెంగబూరు కర్స్” కి సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. అద్భుతమైన లొకేషన్ లలో.. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. మరి ఈ వెబ్ సిరీస్ ద్వారానైనా ఫరియా అబ్దుల్లా.. క్లిక్ అవుతుందో లేదో చూడాలి.