NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Kajal Karthika OTT Release: థియేటర్లలో విడుదలై ఏడాది అనంతరం ఓటీటీలోకి వస్తున్న కాజల్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Kajal Karthika OTT Release: కాజల్ అగర్వాల్.. తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవసరంలేని పేరు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది కాజల్. ఇక కాజల్ హీరోయిన్గా నటించిన తెలుగు హర్రర్ మూవీ ” కాజల్ కార్తీక “. ఈ మూవీ థియేటర్లో విడుదలై ఏడాది అయిపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధపడుతుంది. కాజల్ కార్తీక మూవీ ఏప్రియల్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఐదు కథలతో ఆంథాలజీ గా తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు రెజీనా, రైజా విల్సన్, జనని అయ్యర్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ హారర్ మూవీకి డీకే దర్శకత్వం వహించాడు. కరుంగాపియమ్ పేరుతో తమిళంలో రూపొందిన మూవీను కాజల్ కార్తీక పేరుతో తెలుగులోకి డబ్ చేశారు.

Kajal Karthika OTT Release updates
Kajal Karthika OTT Release updates

కథలో కొత్తదనం లేకపోవడం మరియు హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా డిజాస్టర్ గా మిగిలింది. లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్ లో మొత్తం ఐదు కథలతో ఈ హారర్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు డీకే. ఇక ప్రతి కథను రెజీనా క్యారెక్టర్ ద్వారా పరిచయం అవుతుంటాయి. ఈ సినిమాలోని మొదటి కథ మీరాది (రైజా విల్సన్). లాక్ డౌన్ కారణంగా మీరా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. శక్తి ( కలైయరాసన్) అనే యువకుడు తన ఇంట్లో ఆమెకు ఆస్కారం కల్పిస్తాడు. ఇక శక్తి హంతకుడని తెలియడంతో అతడి అపార్ట్మెంట్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది మీరా. కానీ శక్తి ఆమెను బంధిస్తాడు. మీరాను చంపేయాలనుకుంటాడు కూడా.

ఐదేళ్ల క్రితమే మీరా చనిపోయిందనే నిజం అతడికి తెలుస్తుంది. అసలు ఈ మీరా ఎవరు? అనేది మొదటి కాన్సెప్ట్. ఇక లాక్ డౌన్ టైం లో ఇంట్లో చిక్కుకుపోయిన కాజల్ (జనని అయ్యర్) ఓ యూట్యూబ్ వీడియో చేస్తుంది. ఇక ఆ వీడియోలో ఆమె వెనుక ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆమెని భయపెడతాడు కూడా. అతడు ఎవరు? కాజల్ ఇంట్లోకి అతడు ఎలా వచ్చాడు? అనేది రెండవ కథ. లాక్ డౌన్ టైంలో మందు కోసం ఓ సీక్రెట్ బార్ లో అడుగుపెట్టిన ఇద్దరు స్నేహితులకు బంధాల విలువను ఏలియన్స్ ఎలా గుర్తు చేశారు అనేది మూడవ కథ. శృతి ఓ సింగర్. ఓ సినిమా పాట పాడడం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ అభిమన్య స్టూడియోకు వస్తుంది.

Kajal Karthika OTT Release updates
Kajal Karthika OTT Release updates

ఆ స్టూడియోలో ఈమెకి వింత మనుషులు కనిపిస్తారు. ఇక సిద్ధార్థ్ అభిమన్యు అప్పటికే చనిపోయాడని నిజం తెలుస్తుంది. అనంతరం ఏం జరుగుతుంది అనేది నాలుగవ కథ. కార్తీక (కాజల్ అగర్వాల్) భర్త ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు. కూతురు తో కలిసి పల్లెటూరులో ఉంటుంది కార్తీక. ఆ ఊరిలో వరుసుగా చిన్నపిల్లలు మాయమవుతూ ఉంటారు. కొందరు పెద్దలు హత్యలకు గురవుతారు. ఆ మర్డర్స్కు కార్తీక్ అనే కారణమని నింద మోపుతారు. అనంతరం ఏం జరిగింది? అనే కథ నే 5వ కథ. ఇలా ఈ ఐదు కథలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ లోకి రానున్నాయి.‌

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella