Netflix Movies: ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో ఉన్న టాప్ టెన్ సినిమాలు ఏమిటో చూద్దాం.
1. జవాన్: కింగ్ షారుక్ ఖాన్ , నాయన తార నటించిన యా క్షన్ థ్రిల్లర్ సినిమా. గుండు తో ఉన్న షారుక్ పాత్రదారి ఒక మెట్రో ట్రైన్ ను హైజాక్ చేసి 40 వేల కోట్లు డిమాండ్ చేస్తాడు. హైజాకర్ ను పట్టుకోడానికి నర్మద పాత్ర లో నయనతార వస్తుంది. హైజాకర్ తప్పించు కుంటాడు. ఆ డబ్బు ని పేదల ఖాతాల్లోకి జమ చేస్తాడు. ఆ హైజాకర్ ఒక సంచలనం గా మారతాడు. ఒక జైలు లో జైలర్ కూడా హైజాకర్ లనీ ఉంటాడు. తర్వాత ఏమైంది అని తెలియాలంటే సినిమా చూడాలి. అట్లీ దర్శకత్వం చేసిన ఈ సినిమాని గౌరీ ఖాన్ నిర్మించారు. ఇది సూపర్ డూపర్ హిట్ అని తెలిసిందే.

2. జవాన్ తెలుగు 3. జవాన్ తమిళ్ : జవాన్ హిందీ తరువాత అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తూ జవాన్ తెలుగు తమిళ్ వెర్షన్ లు టాప్ 2 టాప్ 3 స్థానాలలో ఉన్నాయి

4. డ్రీం గర్ల్ 2: ఆయుష్మాన్ ఖురానా , అనన్యా పాండే ఈ సినిమా కి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇది డ్రీం గర్ల్ కి కొనసాగింపు. కానీ కదా అంట బాలేదని టాక్ . కొన్ని పాత్రలను వేస్ట్ చేశారని అంటున్నారు. ఈ సినిమా కి మొదటి వారం 67 కోట్ల కలెక్షన్ వచ్చింది. రెండో వారం 28 కోట్లు వచ్చింది. అనన్య పాండే నటించిన మొదటి 100 కోట్ల సినిమా ఇది. కొన్ని హాస్య సన్నివేశాలున్నాయి. మొత్తానికి సినిమా ని ఒకసారి చూడొచ్చు. డ్రీం గర్ల్ 2019 లో విడులై వరల్డ్ వైడ్ గా 200 కోట్లు సంపాదించింది.

5. చంద్రముఖి హిందీ: రాఘవ లారెన్స్ , కంగనా రనౌత్, రావు రమేష్, వడి వేలు నటించిన సినిమా ఇది. ప్ వాసు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా 28 సెప్టెంబరు 23 లో వచ్చింది. కధ లోకి వెళ్తే రంగనాయకి (రాధిక) కుటుంబం చాలా పెద్దది. వారి కుటుంబానికి సమస్యలు ఉంటాయి. కుటుంబం అంతా వెళ్లి వారి కుల దైవం గుడిలో పూజ చేస్తే సమస్యలు తొలగిపోతాయని ఒక స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. దీంతో అందర్నీ తీసుకెళ్లడం సమస్య అవుతుంది. ప్రేమించి లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. తర్వాత ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
6. మినియన్స్: ది రైజ్ ఆఫ్ గ్రూ – ఈ సినిమా కి imdb 6. రేటింగ్ ఉంది. “మినియన్స్: ది రైజ్ ఆఫ్ గ్రూ” 1976 లో జరుగుతుంది. యానిమేటెడ్ జీవాలున్న ఈ తాజా సినిమా కధ గ్రూకు సంబందించిన ఒక మూల కథ. ఇది కైల్ బాల్డా, బ్రాడ్ అబెల్సన్ మరియు జొనాథన్ డెల్ వాల్ దర్శకత్వం వహించిన చిత్రం “మినియన్స్: ది రైజ్ ఆఫ్ గ్రూ”, దీనిలో ఎపికెన్ జీవులు మళ్ళీ తమ నాయకుడు గ్రూకు సహాయపడ్డానికి ప్రయత్నిస్తాయి గ్రూ ఒక పిల్లవాడు ఈ సినిమా 1970 ల కార్టూన్.

7. ఇరైవన్ సినిమా జయం రవి, నయనతార నటించిన సినిమా. ఇది ఒక విసుగు తెప్పించే సీరియల్ కిల్లర్ స్టోరీ. భయంకర హత్యలకు కారణమైన నేరస్థుడిని పట్టుకోడానికి చేసే ప్రయత్నం. దురదృష్టవశాత్తు, హంతకుడు బ్రహ్మ (రాహుల్ బోస్) ను పట్టుకోవడంలో వారు విజయం సాధించినప్పటికీ, ఆండ్రూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతాడు. అయితే, ఈ బాధాకరమైన సంఘటన అర్జున్ ను పోలీసు శాఖకు రాజీనామా చేయమని ప్రేరేపిస్తుంది. తర్వాత కదా సినిమా లో చూడండి.
8. ఓ ఎం జీ 2: అక్షయ కుమార్, పంకజ్ త్రిపాఠి , యామీ గౌతమ్ నటించించిన సినిమా ఇది. అమిత్ రాయి దర్శకుడు. శివ భక్తుడైన కాంతి శరన్ ఒక పూజ సామగ్రి అమ్మే దుకాణం నడుపుతుంటాడు. అతని కొడుకు వివేక్ స్కూల్ టాయిలెట్ లో హస్త ప్రయోగం చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ అవమానం తో ఊరు వదిలి వెళ్లాలని అనుకుంటాడు. తర్వాత కద ఏమిటి తెలుసు కోవాలంటే సినిమా చూడాలి. సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకత ను ను చెప్పాలని చేసిన ప్రయత్నం . ఆగస్ట్ 23 లో విడుదలైన ఈ సినిమా 221 కోట్లు వసూల్ చేసింది.

9. వింగ్ వుమన్ రాత్రంతా రోలర్ స్కేట్లపై నృత్యం చేస్తూ, ఒకరిద్దరు ఫ్రెండ్స్ తో సరదాగా గడిపి, అలెక్స్ (అడెల్ ఎక్సార్కోపౌలోస్) తన అద్దె ఇంటికి తిరిగి వచ్చి, తన స్నేహితురాలు కరోల్ పక్కకు జేరుతుంది. అలెక్స్ ముఖంలోకి ఒక్క చూపు చూసిన కరోల్ ఆమె కు తగిలిన దెబ్బలు చూస్తుంది. ఏమైంది అని అడుగుతుంది అదేమీ గొప్ప విషయం కాదులే అంటుంది ఆలిస్ టాటా ఏమి జరిగింది అనేది సినిమా కధ . ఈ సినిమా కి ఇండీబీ రేటింగ్ 5. 9 గ వచ్చింది. నవంబర్ ఒకటి 2023 లో రిలీజ్ అయింది.
10. ఇరైవన్(Hindi) ఇప్పుడు మీరు ఏ సినిమా ముందు చూడాలో నిర్ణ ఇంచు కొండి.