Nithya Menen Kumari Srimathi: మన తెలుగు సినిమాల్లో మలయాళీ నటులు చాలా మందే వచ్చారు ఇప్పటివరకు. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టిన మలయాళ బ్యూటీ నిత్యామీనన్. మొదటి సినిమాతోనే తిరుగులేని పేరును సంపాదించుకుంది మంచి నటి అనే పాపులారిటీ కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. కొన్ని రోజులు సినిమాల్లో రాలేదు. కాస్త డల్ అయినట్లు కనిపించినా.. ‘భీమ్లానాయక్’, ‘తిరు’ సినిమాలతో మళ్లీ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం నిత్యామీనన్ రెండు సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.

నిత్యా కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పేరు చెప్తే తెలుగులో విపరీతమైన క్రేజ్ అందుకే ఎక్కువగా టిక్కెట్లు తెగుతాయి. అయితే ఆమె వరస పెట్టి సినిమాలు చేస్తూ క్రేజ్ క్యాష్ చేసుకోవాలి అనుకోదు. తనకు తగ్గ పాత్ర, అదీ తనకు నచ్చింది అయితేనే ఓకే చెప్తుంది. చాలా సినిమాల్లో తన అద్బుత నటనతో అదరగొట్టింది. ఇప్పుడు నిత్యా ద్రుష్టి వెబ్ సిరీస్ మీదకి పోయిందేమో తాజా గా ఆమె ఓటిటిలోకి డైరక్ట్ ఎంట్రీ ఇస్తోంది. కుమారి శ్రీమతి పేరుతో ఈ వెబ్ సిరీస్ వస్తోంది.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‍కు చెందిన స్వప్న సినిమాస్ ఈ వెబ్ సిరీస్‍ను నిర్మిస్తున్నాయి. గోమతేశ్ ఉపాధ్యేయ దర్శకత్వం వహిస్తున్న ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. కాగా, ‘కుమారి శ్రీమతి’ మోషన్ పోస్టర్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఆ టీజర్ ఎలా ఉందంటే… “అబ్దుల్ కలాం అంట.. రజినీకాంత్ అంట.. ఆ తర్వాత ఈవిడేనంట.. ఉద్యోగం.. సద్యోగం చేయదంట.. బిజినెస్సే చేస్తుందంట.. కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కొస్తుందట. పెళ్లి.. గిళ్లి వద్దంట వదినోయ్. ఇట్టాగే ఉండిపోద్దట” అనే వాయిస్ ఓవర్‌తో కుమారి శ్రీమతి సిరీస్ మోషన్ పోస్టర్ వీడియో మొదలైంది. ‘ఎవరి గురించి వదినా నువ్వు మాట్లాడేది?’ అని మరో మహిళ అడిగితే… ‘ఉందిగా ఆ దేవికమ్మ పెద్ద కూతురు’ అని సమాధానం చెబుతుంది. అప్పుడు అర్థం అవుతుంది. దాంతో ‘ఓహో! శ్రీమతా…’ అని తెలిసినట్టు చెబుతుంది. అవును… ‘కుమారి శ్రీమతి’ అని ఆన్సర్! అప్పుడు నిత్యా మీనన్ ఫేస్ చూపించారు. ఈ వీడియోతో ఈ సిరీస్‍లో నిత్యామీనన్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో మేకర్స్ వెల్లడించారు.

ఈ వెబ్ సిరీస్ లో లేడి ఓరియెంట్ పాత్రను పోషిస్తోంది నిత్యామీనన్. ఈ వెబ్ సిరీస్ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ కు మంచి రెస్పాన్స్ రావడం తో తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 28 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అవసరాల శ్రీనివాస్ ఈ వెబ్ సిరీస్‌కు కథను అందించాడు.