Adipurush OTT release: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన భారీ మైథాలజికల్ మూవీ “ఆదిపురుష్” ఈ ఏడాది జూన్ 16వ తారీకు విడుదల కావడం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఫస్ట్ టైం ప్రభాస్ తెలుగు వారితో కాకుండా బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తో పనిచేయగా ఆశించిన రీతిలో ఫలితం రాబట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అసలు ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఫలితం అట్టర్ ఫ్లాప్ కావటంతో.. అభిమానులకు నిరాశ మిగిల్చింది. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
ఇదిలా ఉంటే థియేటర్లో విడుదలై రెండు నెలలు కాకముందే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడం జరిగింది. ఒకటి కాదు రెండు ఓటిటి లలో.. అమెజాన్ ప్రైమ్ అదేవిధంగా నెట్ ఫ్లిక్స్ లో “ఆదిపురుష్” స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో బొక్క బోర్ల పడిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆశించిన రీతిలో వ్యూస్ రాబడుతుందో లేదో చూడాలి. “ఆదిపురుష్” వాస్తవానికి ఈ ఏడాది జనవరి నెలలో విడుదల కావాల్సింది.

అయితే ఈ సినిమా టీజర్ గత ఏడాది అక్టోబర్ నెలలో విడుదల కాగా.. విజువల్ ఎఫెక్ట్స్ అభిమానుల నుండి నిరాశ కలిగించేలా ఉండటంతో సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఏకంగా చిన్న పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ మాదిరిగా.. “ఆదిపురుష్” ఫస్ట్ టీజర్ ఉండటంతో చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సినిమా యూనిట్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొత్తం మార్చేసి జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ఆ తర్వాత.. విఎఫ్ఎక్స్ వర్క్ మార్చడం జరిగింది. అయినా గాని సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.