Chhatriwali Review (ఛత్రివాలి రివ్యూ) : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ‘ఛత్రివాలి’. సంప్రదాయ కుటుంబంలో ఉంటూ.. కండోమ్ టెస్టర్‌గా ఎందుకు పని చేసింది. ఆన్లైన్ వేదికగా శృంగార పాఠాలు చెప్పడం. కుటుంబీకుల నుంచి ఎదురయ్యే సమస్యలు. తదితర కోణంలో సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ఓటీటీ వేదికగా జీ5లో విడుదలైంది. అయితే సినిమా ఎలా ఉంది.? సినిమా స్టోరీ ఎలా ఉంది? తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రకుల్ ప్రీత్ సింగ్, ప్రాచీ షా పాండ్య యాక్టింగ్. ఎమోషనల్ సీన్స్.
సినిమా: ఛత్రివాలి
నటీనటులు: రకుల్ ప్రీత్ సింగ్, సుమిత్ వ్యాస్, సతీష్ కౌశిక్, డాలీ అహ్లు వాలియా, రాజేష్ తైలాంగ్, ప్రాచీ షా పాండ్య, రాకేష్ బేడీ, తదితరులు.
కథ: సంచిత్ గుప్తా, ప్రియదర్శి శ్రీవాత్సవ
నిర్మాత: రోనీ స్క్రూవాలా
దర్శకత్వం: తేజాస్ ప్రభ విజయ్ దేవోస్కర్
ఓటీటీ: జీ5
విడుదల తేదీ: జనవరి 20, 2023
న్యూస్ ఆర్బిట్ రేటింగ్: 3/5
సినిమా స్టోరీ..
‘ఛత్రివాలి’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ ‘సాన్యా ధింగ్రా’. కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ అయిన సాన్యా ధింగ్రా ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ కండోమ్ కంపెనీలో టెస్టర్‌గా (కండోమ్ క్వాలిటీ మేనేజర్) పని చేసే అవకాశం వస్తుంది. మొదట్లో ఆ ఉద్యోగానికి ‘నో’ అని చెప్పినా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగం జాయిన్ అవుతుంది. లైఫ్‌లో సెటిల్ అయిందనుకున్న తరుణంలో రిషి కార్ల (సుమిత్ వ్యాస్)ను పెళ్లి చేసుకుంది. అయితే రిషికార్లకు తాను కండోమ్ కంపెనీలో టెస్టర్‌గా పని చేసుకున్నా అనే విషయాన్ని సాన్యా ధింగ్రా చెప్పదు. ఆమె ఉద్యోగం గురించి తెలిసి రిషి కార్ల ఎలా స్పందిస్తాడు? సంప్రదాయాలకు విలువిచ్చే రిషి అన్నయ్య రాజన్ (రాజేష్ తైలాంగ్) ఏమన్నాడు? కండోమ్ కంపెనీలో పని చేసే సాన్య.. పిల్లలకు శృంగార పాఠాలు ఎందుకు చెప్పడం ప్రారంభించింది? కండోమ్ ప్రాధాన్యత సాన్యాకు ఎప్పుడు తెలిసింది? సాన్యను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? చివరకు ఏమైంది? ఇన్ని ప్రశ్నలకు జవాబు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ..
కండోమ్స్ ప్రాధాన్యతపై గతేడాది బాలీవుడ్లో ‘జన్హిత్ మే జారీ’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నుష్రత్ భరూచా లీడ్ యాక్టర్‌గా చేశారు. సేమ్ స్టోరీతో ఇప్పుడు ‘ఛత్రివాలి’ సినిమా రిలీజ్ అయింది. రెండు సినిమాలో తారలు వేర్వేరు కావడం తప్పిస్తే.. రెండు సినిమాల్లో కోర్ పాయింట్ ఒక్కటే అని చెప్పవచ్చు. చాలా వరకు సన్నివేశాలు కూడా ఒకేలా ఉంటాయి. ‘జన్హిత్ మే జారీ’ సినిమాకు మరో వెర్షన్ ‘ఛత్రివాలి’ అన్నట్లుగా ఉంది. సినిమాల పోలికను పక్కన పెడితే.. ఛత్రివాలి సినిమాలో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వచ్చే సన్నివేశాలు.. ఏం జరుగుతుందో చెప్పడం పెద్ద కష్టమైన పని కాదు. ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగానే సినిమాను తీశారు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం మహిళలతోపాటు పురుషులను సైతం ఆలోచింపజేస్తాయి.
Nanpakal Nerathu: నన్పకల్ నేరతు సినిమా రివ్యూ తెలుగులో.. సినిమా హిట్టా.!? ఫ్లాపా.!?
శృంగారంపై, అబార్షన్స్ పై రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రిని, తోడి కోడలుని అడిగే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. అలాగే శృంగారంపై పిల్లలకు అవగాహన ఎందుకు కల్పించరని, పాఠ్య పుస్తకాల్లో పిల్లలకు శృంగార పాఠాలు ఎందుకు భోదించడం లేదని రకుల్ ప్రశ్నించే సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. అలాగే పిల్లలు సైతం రకుల్‌ను శృంగారపరమైన సందేహాలు అడిగే సన్నివేశాలు, సమాజంలో ఎంత మందికి వీటిపై అవగాహన ఉందనే విషయాలపై ఇంట్రెస్ట్ పెంచుతాయి. మొత్తానికి సేఫ్ సెక్స్, కండోమ్ ప్రాధాన్యత గురించి తెలిపే చిత్రమిది. దర్శక నిర్మాత ఆలోచన బాగుందనే చెప్పుకోవచ్చు. శృంగారపరమైన అంశాలు డిస్కస్ చేయడానికి ఇబ్బంది పడే ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనే కాన్సెప్ట్ బాగుంది. కానీ సినిమాలో కొత్తదనం తోడైతే బాగుండేది. రొటిన్ స్టోరీతోనే ‘ఛత్రివాలి’ సినిమా రిలీజ్ అయింది.
ప్లస్ పాయింట్స్:
రకుల్ ప్రీత్ సింగ్, ప్రాచీ షా పాండ్య యాక్టింగ్. ఎమోషనల్ సీన్స్.
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ.
రేటింగ్: 3/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
Mission Majnu Review: సిద్ధార్థ మల్హోత్ర, రష్మిక ‘మిషన్ మజ్ను’ సినిమా రివ్యూ..!!
Kaapa Telugu Movie Review: పృధ్విరాజ్ సుకుమారాన్ “కాపా” తెలుగు మూవీ రివ్యూ..!!