Weekend Movies on OTT: ఈ వీకెండ్‌లో(December 9-December 11) రకరకాల సినిమాలు చూసి బిన్జ్ చేయడానికి OTT లో చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మోస్ట్ అవైటెడ్ మూవీస్ యశోద, డాక్టర్ జి, ఇంకా మరెన్నో ఈ వారమే విడుదలవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యశోద
యశోద ఓటీటీ హక్కులను గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ సినిమాని డిసెంబర్ 9, 2022 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రసారం చేస్తోంది.
OTT ప్లాట్‌ఫారమ్: Amazon Prime Video
రిలీజ్ డేట్: December 9, 2022
డాక్టర్ జి
ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ బాక్సాఫీస్ హిట్ ‘డాక్టర్ జి’ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 11న అంటే ఆదివారం నుంచి ప్రసారం కానుంది. ఈ హిందీ సినిమాలో ఆర్థోపెడిక్స్‌పై ఆసక్తి ఉన్న మేల్ డాక్టర్ గైనకాలజిస్ట్‌గా మారడం, తద్వారా పెద్ద గందరగోళం ఏర్పడటం కథగా సాగుతుంది.
OTT ప్లాట్‌ఫారమ్: Netflix
రిలీజ్ డేట్:December 11, 2022
బ్లర్
తాప్సీ పన్ను ప్రొడ్యూస్ చేసిన తొలి హిందీ సినిమా ‘బ్లర్’ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిసెంబర్ 9 నుంచి ప్రసారమవుతోంది. 2010 స్పానిష్ హర్రర్ మూవీ ‘జూలియస్ ఐస్’కి రీమేక్ ఇది.
OTT ప్లాట్‌ఫారమ్: ZEE5
రిలీజ్ డేట్: December 9,2022
ఫాదు: ఎ లవ్ స్టోరీ
ఇద్దరు ప్రేమికుల కథ అయిన హిందీ ఫిల్మ్ ‘ఫాదు: ఎ లవ్ స్టోరీ’ సోనీ లివ్‌లో డిసెంబర్ 9 నుంచి స్ట్రీమ్ అవుతోంది.
OTT ప్లాట్‌ఫారమ్: SonyLiv
రిలీజ్ డేట్: December 9, 2022
మాచర్ల నియోజకవర్గం
నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం జీ5 లో డిసెంబర్ 9 నుంచి ప్రసారమవుతోంది.
OTT ప్లాట్‌ఫారమ్: ZEE5
రిలీజ్ డేట్: December 9, 2022
ఊర్వశివో రాక్షసివో
అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ మూవీ ఊర్వశివో రాక్షసివో డిసెంబర్ 9న ఆహాలో స్ట్రీమ్ కావడం ప్రారంభించింది.
OTT ప్లాట్‌ఫారమ్: Aaha
రిలీజ్ డేట్: December 9, 2022
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా మూవీ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ మూవీ సోనీ లీవ్‌లో డిసెంబర్ 9 నుంచి స్ట్రీమ్ అవుతోంది.
OTT ప్లాట్‌ఫారమ్: SonyLiv
రిలీజ్ డేట్:December 9, 2022
క్యాట్
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కుట్రలో చిక్కుకున్న అమాయక వ్యక్తి గుర్నామ్ సింగ్ చుట్టూ క్యాట్ సినిమా కథ తిరుగుతుంది. ఈ ఇన్నోసెంట్ ఫెలో పవర్‌ఫుల్ పర్సన్ ఫేస్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇలాంటి కథతో రూపొందిన ఈ హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 9 నుంచి ప్రసారమవుతోంది.
OTT ప్లాట్‌ఫారమ్: Netflix
రిలీజ్ డేట్: December 9, 2022
సెనోరిటా ’89
మెక్సికోలో 1980 నాటి అందాల పోటీలలోని చీకటి కోణాన్ని అన్వేషించే సెనోరిటా 89 మూవీని ఆస్కార్-విజేత నిర్మాతలు పాబ్లో, జువాన్ డి డియోస్ లారైన్‌లు రూపొందించారు. ఈ సినిమా లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో డిసెంబర్ 9 నుంచి స్ట్రీమ్ అవుతోంది.
OTT ప్లాట్‌ఫారమ్: Lionsgate Play
రిలీజ్ డేట్:December 9, 2022