33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Pakka Commercial Trailer: `పక్కా కమర్షియల్‌` ట్రైలర్‌.. విల‌న్‌గా అద‌ర‌గొట్టేసిన గోపీచంద్‌!

Share

Pakka Commercial Trailer: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, రాశి ఖన్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్ల‌పై అల్లు అరవింద్‌, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ త‌దిత‌రులు ఇందులో ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు.

కొద్ది రోజుల క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన‌ మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఇందులో గోపీచంద్‌, రాశీ ఖ‌న్నాలు లాయ్య‌ర్స్‌గా అల‌రించ‌బోతున్నారు. ఎలాంటి తప్పు చేసినవాడికైనా కోర్టులో శిక్ష పడకుండా చేసే వ్య‌క్తిగా గోపీచంద్ క‌నిపిస్తే.. న్యాయాన్ని కాపాడుకోవడానికి క‌న్న కొడుకుతోనే పోరాటానికి దిగే తండ్రిగా స‌త్య‌రాజ్ న‌టించారు.

తండ్రీ, కొడుకుల‌ మ‌ధ్య సాగే ఆస‌క్తిక‌ర పోరునే ఈ చిత్రంలోనే మారుతి చూపించ‌బోతున్నాడు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా దేనికీ కొదవ లేకుండా సినిమాను రూపొందించార‌ని ట్రైలర్ బ‌ట్టీ అర్థ‌మైంది. అలాగే మారుతీ మార్క్ ఎంటర్టైన్మెంట్ ట్రైల‌ర్‌లో స్ప‌ష్టంగా క‌నిపించింది. `మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్` అని చెబుతూ గోపీచంద్ అద‌ర‌గొట్టేశాడు.

ఇక రాశీ ఖ‌న్నా రోల్ పూర్తి ఫ‌న్ వేలో సాగితే.. రావు రమేష్ పాత్ర సర్ప్రైజింగ్ గా ఉండ‌బోతోంది. మొత్తానికి అద్భుతంగా ఉన్న తాజా ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను అందుకుని గోపీచంద్ హిట్ కొడ‌తాడో..లేదో.. తెలియాలంటే జూలై 1వ తేదీ వ‌ర‌కు ఆగాల్సిందే.


Share

Related posts

“సలార్” లో ప్రభాస్ పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..!!

sekhar

ఇంత కష్టపడ్డా కూడా థమన్ కి ఆ క్రేజ్ రావడం లేదే ..?

GRK

Chiranjeevi: చిరంజీవి సినిమాలో ఛాన్స్ అందుకున్న బిగ్ బాస్ 5 లేడీ కంటేస్తంట్..!!

sekhar