Subscribe for notification

Gopichand-Chiranjeevi: గోపీచంద్‌కు సాయం చేసేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నెల్‌..!

Share

Gopichand-Chiranjeevi: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ త్వ‌ర‌లోనే `పక్కా కమర్షియల్` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. స‌త్య‌రాజ్‌, రావు ర‌మేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్ల‌ పై ఈ మూవీని అల్లు అరవింద్‌, బన్నీ వాసు నిర్మించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పోస్ట‌ర్స్‌, సాంగ్స్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేయ‌గా.. మ‌రింత హైప్‌ను క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఇక‌పోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 26న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా రావాల‌ని మేక‌ర్స్ సంప్ర‌దించ‌గా.. ఆయ‌న వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ట‌. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసి సినిమా హైప్‌ని చిరు మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు.

ఇది ఒక‌ర‌కంగా గోపీచంద్‌కు సాయం చేసిన‌ట్లే అవుతుంది. కాగా, గ‌త కొన్నేళ్ల నుంచీ స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న గోపీచంద్.. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ప‌క్కాగా విజ‌యం సాధించాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. మ‌రి ఆయ‌న ఆశ నెర‌వేరుతుందో లేదో చూడాలి.


Share
kavya N

Recent Posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

1 min ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

29 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

1 hour ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

1 hour ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

2 hours ago