Pallakilo Pellikuthuru: మరో 3రోజులలో ముగినున్న పల్లకిలో పెళ్లికూతురు సీరియల్..
తారలు : శ్రావణ్ కుమార్, అదితి త్రిపాఠి, మంజుల పరిటాల, దేవగుడి శ్రీ ప్రశాంతి, విజయ కుమారి, తిరుపతి ప్రకాష్, సుష్మా కిరణ్, కిరణ్మయి ప్రజాపత్, రాఘవ పి వెంకట్, ప్రదీప్ కొండిపర్తి, గ్రీష్మ, లక్ష్మణ్ ఈశ్వర్ రాజు ఈ సీరియల్ విజయవంతమైన బెంగాలీ డైలీ సోప్ ‘ఖుర్కుటో’ (2020) యొక్క తెలుగు రీమేక్‌గా ప్రసారం చేయబడుతోంది, ఇది తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగినట్లుగా మార్చారు. ఇది ప్రధాన జంట, రెండు విభిన్న ప్రపంచాల నుండి వచ్చిన ఇద్దరు విభిన్న వ్యక్తుల వివాహం,రెండు కుటుంబాల మధ్య జరిగే రొమాంటిక్ కామెడీ సీరియల్. ఈ సీరియల్ TRP రేటింగ్ విషయం కి వస్తే మొదటిలో కాస్త ఎక్కువ గా వున్నా తరువాత 2.6పడిపోయింది ఇప్పడు మళ్ళీ 3.8 రేటింగ్ తో ముందు కి వెళ్తుంది.

Krishna Mukunda Murari: మురారి పుట్టినరోజు వేడుకల్లో భవాని.. ముకుంద సైకో ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుందా.?
ఇప్పుడు ఈ సీరియల్ హైలెట్స్ చూదాం :-
అభిరామ్ మరియు శశికళ ఇద్దరూ వ్యక్తుల మధ్య జరిగే కుటుంబ కథా సీరియల్ పెద్ద కుటుంబంలో పుట్టిన వాడు మరియు ఉమ్మడి కుటుంబంలో పెరుగుతున్న వాడు పెద్దమ్మ,పెద్ద నాన్న, అమ్మా,నాన్న పిన్ని బాబాయ్ అన్నా,వదిన ఇలా అందరి మధ్య అభిరామ్ కుటుంబం అంటే ఎంతో గౌరవంతో ఉంటాడు. ఇక శశికళ చాలా డబ్బున్న డాక్టర్ కూతురు చిన్నతనంలోనే తన తల్లి శశికళ నుండి దూరం అవుతుంది. శశికళ మేనత్త మరియు నాన్న వీరిద్దరి మధ్యలో పెరుగుతుంది శశికళకు కుటుంబం ఫ్యామిలీస్ వాల్యూస్ ఇట్లాంటివి మీద మంచి ఆలోచన ఉండదు.

Nuvvu Nenu Prema: ప్రాణాలతో బయటపడిన పద్మావతి. కృష్ణ నిజస్వరూపం విక్కీకి తెలిసిపోయిందా..
ఉమ్మడికుటుంబం అంటే ఒక నెగిటివ్ ఆలోచనలోనే ఉంటుంది. అనుకోకుండా శశికళని అభిరామ్ ఒక నైట్ పార్టీ జరుగుతుండగా చూస్తాడు. చూసిన వెంటనే అభి శశి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది ఆ పార్టీలో శశి ఉమ్మడి కుటుంబం,రిలేషన్స్ ఫ్యామిలీస్ ఇట్లాంటి వాటి మీద నెగిటివ్గా మాట్లాడటం అభి వింటాడు. కొన్ని అనుకోని కారణాలతో అభి ఫ్యామిలీలో శృతి అభి చెల్లెలు పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లి తనకు ఇష్టం లేక తను ప్రేమించిన వ్యక్తితో అభి చెల్లెలు శృతి ఇంట్లో నుండి నైట్ చెప్పకుండా వెళ్ళిపోతుంది.

అలా శృతి ఇంట్లో నుంచి వెళ్లడం ఆరోజు శృతికియాక్సిడెంట్ జరగటం అక్కడ వున్నా శశిరేఖ నాన్న చూసి శృతిని కాపాడి హాస్పటల్లో జాయిన్ చేస్తాడు ఇక్కడే శృతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. దీంతో శృతి వాళ్ళ ఇంటికి వెళ్లడానికి భయపడుతుంది శృతిని కన్విన్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీ తో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ శృతి వాళ్ళ నాన్న శేఖర్ కు అభి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చూస్తాడు అభి ఫ్యామిలీ అంతా తనకు బాగా నచ్చుతుంది ఈ రోజుల్లో కూడా ఇంత ఉమ్మడి కుటుంబం ఇంత కలిసి ఉండడం ఇవన్నీ తనకు బాగా నచ్చుతాయి శృతి వాళ్ళ నాన్నగారిని కన్విన్స్ చేసి శృతి ఎందుకు అలా చేసింది శృతి ప్రేమించిన అబ్బాయిని శేఖర్ తీసుకొచ్చి వాళ్ళ పెళ్లి చేయమని శృతి వాళ్ళ ఫాదర్ కు రిక్వెస్ట్ చేస్తాడు దీంతో రెండు కుటుంబాలు కలిసిపోతారు.ఇక్కడే శేఖర్ కి తన కూతురైన శశికళను అభిరామ్ ఫ్యామిలీకి ఎలాగైనా పరిచయం చేయాలని ఆ ఫ్యామిలీలోకి శశికళను కలపాలని
నిర్ణయించుకుంటాడు.

Intinti Gruhalakshmi: దివ్య ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందరి ముందు చెప్పిన విక్రమ్..
శశికళను అభిరామ్ ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు శేఖర్ కానీ, శశికళకు ఆ ఫ్యామిలీ మాత్రం అస్సలు నచ్చదు ఎందుకంటే తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. కాబట్టి అభిరామ్ కి బెస్ట్ సైంటిస్ట్ అవార్డు వస్తుంది ఆ ఫంక్షన్ లో అభిరామ్ కు శశికి పెళ్లి అని అందరి ముందు అనౌన్స్ చేస్తారు శశికళ బిహేవియర్ అభికి అసలు నచ్చదు. కానీ అందరూ కలిసి పెళ్లి చేసుకోమని ఒప్పిస్తారు. కొన్ని కండిషన్స్ పెట్టి శశి ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది. అభి కూడా ఆ కండిషన్ కి ఓకే చెప్పి శశిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు మొత్తానికి శేఖర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.ఇద్దరి మధ్య ఎలాగైనా మంచి వాతావరణం రావాలని ఇద్దరు స్నేహంగా ఉండడం కోసం శశిని అభి వాని ఇంట్లోకి పంపిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి అభి శశిని ఇష్టపడుతూ ఉంటాడు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా కామెడీగా ఈ సీరియల్ మొదటి నుంచి ఉంటుంది.అభి చెల్లెలు సింధు శశి కి మంచి ఫ్రెండ్ అవుతుంది. రోజు పార్టీలని ఫ్రెండ్స్ అని ఒకరికి ఒకరు చాలా స్నేహంగా ఉంటూ ఉంటారు.

ఈ సంవత్సరం వంటలక్క సీరియల్ కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ సెలక్షన్ ఇదే | Best of Telugu Serials in 2022: Karthika Deepam Top 10 Episodes
ఒకరోజు శశి సింధుని కలవడానికి వెళ్ళినప్పుడు సింధుని ఒకరు కిడ్నాప్ చేస్తారు అప్పుడు అభికి ఫోన్ చేసి సింధు కిడ్నాప్ అయిన విషయం శశి చెప్తుంది అప్పుడుఅభియే సింధును కాపాడుతాడు. దీంతో అభి శశి మీద కోపంతో నా చెల్లెలు ఇలా కిడ్నాప్ అవ్వడానికి కారణం నువ్వే అని శశిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతాడు ఈ ఎపిసోడ్ అంతా చాలా ఎమోషనల్ గా ఉంటుంది.
ఇక అభి ఆఫీసులో పనిచేసే వైశాలి కూడా,అభి ని ఇష్టపడుతూ ఉంటుంది అభి నుండి శశిని దూరం చేసి తాను పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. అభి, శశి లకు కుటుంబ సభ్యులు ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయిస్తారు.

ఎంగేజ్మెంట్ కి వైశాలి కూడా వస్తుంది. శశితో వైశాలి మంచిగా ఉంటూ శశిని దెబ్బ కొట్టి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ అభి,శశి ఎంగేజ్మెంట్ ఎట్టకేలకు జరుగుతుంది. శశి తన కండిషన్ అభి ఇద్దరు ఒకరికొకరు కండిషన్స్ పెట్టుకొని ఎంగేజ్మెంట్చేసుకుంటారు. వాళ్ళు పెట్టుకున్న కండిషన్స్ గురించి ఇంట్లో వాళ్లకు కూడా అందరికీ తెలుసు, కానీ అందరూ అభి,శశి మెల్లగా స్నేహం చేసి ఇష్టపడతారు అని అనుకుంటారు.

Devatha: దేవత సీరియల్ కథ ఇదే.!? పార్ట్ -2 కూడా ఉందా.!?
ఝాన్సీ భర్త వికాస్ కు దూరంగా ఉంటుంది అభి ఇంట్లోనే ఉంటుంది అభి కి తన అత్త ఝాన్సీ అంటే చాలా ఇష్టం.
శశి వాళ్ళ అమ్మ కొంతకాలంగా శశికి దూరంగా ఉంటుంది తరువాత శశి దగ్గరకు వచ్చి వాళ్లతో కలిసి ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ శశి మాత్రం చిన్నతనంలోనే తన కెరీర్ తాను చూసుకుని నన్ను చిన్నప్పుడే వదిలేసిన తల్లి అంటే శశికి కోపంకానీ శశి కోపం పోగొట్టి తనకి దగ్గర అవ్వాలని తన వైపు తిప్పుకోవాలనిచాలా ట్రై చేస్తూ ఉంటుంది శశి వాళ్ళ అమ్మ సుభాషిని.
ఇక శశికి జాయింట్ ఫ్యామిలీ అంటే నెగిటివ్ ఇంప్రెషన్ మెల్లిగా పోతూ ఉంటుంది అది వాళ్ళ ఫ్యామిలీతో స్నేహంగా ఉండడం మొదలు పెడుతుంది ఇక అభివాళ్ళ కుటుంబం కూడా శశిని తన సొంత మనిషిలా చూసుకుంటూ ఉంటారు.

శశి తల్లి సుభాషిని కి అభి వాళ్ళ ఫ్యామిలీ నచ్చదు దీంతోశశి నీ అభికి ఇవ్వడం తనకి ఇష్టం ఉండదు ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి అని సుభాషిణి అనుకుంటుంది. అభి వాళ్ళ ఆఫీసులో పనిచేసే వైశాలీతో స్నేహాన్ని ఏర్పరచుకుంటుంది ఇద్దరు కలిసి శశి, అభి లను విడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. శశి మాత్రం అభి వాళ్ళ ఫ్యామిలీ కోసం తన తల్లితో గొడవ పడుతూ ఉంటుంది.
అభి వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు ఆ ఫంక్షన్ లో శశి వాళ్ళ అమ్మ ఇచ్చిన చీర కట్టుకుని అందరిని షాక్ గురిచేస్తుంది కానీ తను ఆ చీర కట్టుకోవడానికి ఒక కారణం ఉంటుంది అభి వాళ్ళ అమ్మగారు ఒక చీర తీసుకొచ్చి ఇచ్చి ఈ చీర కట్టుకుంటే అబీతో నీకు పెళ్లి
మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టే అని చెప్తుంది కట్టుకోకపోతే వాళ్ల దృష్టిలో నేను అభి ని పూర్తిగా ఇష్టపడుతున్నట్టు అని అనుకోమ్ టారుఅని ఆ చీర కట్టుకోవడం మానేసి వాళ్ళ అమ్మ ఇచ్చిన చీర కట్టుకుంటుంది. దీంతో సుభాషిని తన కూతురు తన వైపు తిరిగిందని ఇక మెల్లిగా మారుతుందని భ్రమలో ఉంటుంది.

Malli Nindu Jabili మే 10: మాలిని పద్మవ్యూహంలో చిక్కిన మల్లి అరవింద్…మల్లి తాళిని సొంతం చేసుకున్న మాలిని…మల్లి నిండు జాబిలి సీరియల్ లో సూపర్ ట్విస్ట్!
అభి ఇంట్లో శశి నీ సొంత మనిషిలా చూసుకుంటారు అభి శశి ల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ప్రేక్షకులు చాలా అలరిస్తాయి
అభి ఆఫీసులో వైశాలి శశి తల్లి సుభాషిని కలిసి అభి, శశి లను విడగొట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడు అల్లా సుభాషిని మంచిగా నటిస్తూ శశి పెళ్లి ఆపాలని చూస్తుంది. దీనికోసం సుభాషిని కావాలని శేఖర్ లాయర్ తో గుమ్మక్కఅయి, శేఖర్ ఆస్తి మొత్తం అభి వాళ్ళ పెద్ద నాన్న అడిగినట్టుగాచెప్పి ఒక పార్టీలో అందరి ముందు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని అవమానిస్తుంది.ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నారు అన్నట్టుగా అక్కడ సిచువేషన్ క్రియేట్ చేస్తుంది దీంతో వాళ్ళ పెద్ద నాన్న అవమానించారని ఇక నేను శశిని పెళ్లి చేసుకోవడం జరగదని చెప్పి అభి తన ఫ్యామిలీతో సహా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతాడు.

తర్వాత శశి వాళ్ళ నాన్న శేఖర్ అభి వాళ్ళ ఇంటికి వచ్చి జరిగినది చెప్పి తన భార్య సుభాషిని కావాలని ఈ సంబంధాన్ని చెడగొట్టాలని ఇలా చేసిందని చెప్పి క్షమించమని అభి ఫ్యామిలీ మొత్తాన్ని అడుగుతాడు దీంతో అవి వాళ్ళ ఫ్యామిలీ శేఖర్ ని క్షమిస్తారు పెళ్లికి అందరూ మళ్లీ ఒప్పుకుంటారు. కానీ అభి మాత్రం శశి మీద కోపంగానే ఉంటాడు కొన్ని రోజులకి తన మీద కోపం పోయి శశి తో అభి కూడా పెళ్లి ఒప్పుకుంటారు.

శశి అభి కలసి ఆఫీస్ పని మీద ఒక పార్టీకి వెళ్తారు ఆ పార్టీలో శశి ఫ్రెండ్ అభిని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతాడు శశి అభి గురించి అందరూ అలా మాట్లాడటం చూసి తట్టుకోలేక అవి చాలా గొప్పవాడని మంచి అవార్డు వచ్చిందని తన ఫ్యామిలీ గురించి తన గురించి గొప్పగా మాట్లాడుతుంది దీంతో అభి శశి మీద ఉన్న కోపం అంతా పోయి తనకి చాలా దగ్గర అవ్వాలని చూస్తుంటాడు.
శశి వాళ్ళ కుటుంబం అభి వాళ్ళ కుటుంబం అందరూ కలిసి వాళ్ళ పెళ్లి ని ఒక పల్లెటూరిలో అభి వాళ్ళ బామ్మ గారి ఊర్లో చేయాలని నిర్ణయిస్తారు కానీ అందుకు అభి, శశి,ఇద్దరు ఒప్పుకోరు. తర్వాత వాళ్ళ నాన్న కుటుంబ సభ్యులు అందరూ కలిసి అభిని మరియు శశి లను ఆ పెళ్ళికి పల్లెటూర్లో చేసుకోవడానికి ఒప్పిస్తారు.

Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్లిన దయానంద్ కుటుంబం..
శశి, అభి ఇద్దరు కూడా తమ కండిషన్స్ ని గుర్తు పెట్టుకొని (ఒక సంవత్సరం కలిసి ఉండాలి తరువాత విడాకులు తీసుకోవచ్చు అన్న కండిషన్) పెళ్లి చేసుకోవడానికి ఫ్యామిలీతో కలిసి విలేజ్ కి వెళ్తారు. అక్కడ అభి బామ్మ గారితో శశికి కొన్ని గొడవలు జరుగుతాయి సాంప్రదాయం పద్ధతులు అంటూ బామ్మ గారు శశిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మెల్లిగా శశి కూడా బామ్మ గారికి అలవాటు పడిపోతుంది ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా విలేజ్లో అందరి కుటుంబ సభ్యుల మధ్య జరుగుతుంది.
పెళ్లి తర్వాత అందరూ విలేజ్ లోనే బామ్మగారి దగ్గరే ఉంటారు శశికి కుటుంబం బాధ్యతలు వంట పెద్దవాళ్ల మీద గౌరవం ఇలాంటివన్నీ నేర్చుకుంటూ చిన్న చిన్న గొడవలు పడుతూ మళ్లీ కలిసిపోతూ ఉంటుంది
పెళ్లయ్యాక కూడా అభి, శశి వారి అగ్రిమెంట్ ని గుర్తు చేసుకుంటూ కలిసి ఉండకుండా గొడవ ఆడుకుంటూ ఉంటారు కానీ కుటుంబ సభ్యులందరికీ అభి మరియు శశి ఎప్పటికైనా కలుస్తారు ఈ అగ్రిమెంట్ ని రద్దు చేసుకుంటారు అని నమ్మకంతో ఉంటారు. ఇంకో మూడు రోజుల్లో ఈ సీరియల్ ఎలా ముగిస్తారో శశిని అభినిఎలా కలుపుతారో చూడాలి..