Paluke Bangaramayenaa November 4 episode 65: ఏంటి ఆఫీసర్ నేనెందుకు వస్తాను ఆ గదిలోకి మీరు వెళ్లి ఎంక్వైరీ చేసుకోండి అని వైజయంతి అంటుంది. మీరెందుకు మేడం రాను అంటున్నారు మీ ఇంట్లో మేము చెక్ చేస్తున్నాం కాబట్టి మీ విలువైన వస్తువు లేకపోతే తర్వాత మా మీద అంటారు రండి మేడం అని అభిషేక్ అంటాడు. నేను అలా ఏమీ అనను మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది వెళ్లి చెక్ చేసుకోండి అని వైజయంతి అంటుంది. రండి మేడం మీరు అని అభిషేక్ వైజయంతిని తీసుకెళ్తాడు. కట్ చేస్తే, యశోద నాకు ఒక కాఫీ పెట్టి తీసుకురా అని అభిషేక్ వాళ్ళ బామ్మ అంటుంది. అలాగే అత్తయ్య అని యశోద అంటుంది. ఒరేయ్ రవీంద్ర నీకు సిగ్గు అనేది లేదారా తిని కూర్చోకపోతే ఏదైనా పని చేయొచ్చు కదా అని అభిషేక్ వాళ్ళ బామ్మ అంటుంది. పని చేయాలని ఉంటుంది బామ్మ కాని మనకెందుకులే అని ఊరుకుంటాను అని రవీంద్ర అంటాడు. ఇంతలో చందన వచ్చి అమ్మ ఈ చీరలు ఎలా ఉన్నాయి మా ఫ్రెండ్ పెళ్లికనీ 50 వేలు పెట్టి కొన్నాను నీ కొడుక్కి చెప్పు మురళి దగ్గర అప్పు పెట్టాను అది కట్టమని అని చందన అంటుంది. 50 వేలు పెట్టి కొన్నావా ఇప్పుడు ఏం అవసరమే అంత డబ్బు పెట్టుకున్నావు అని వాళ్ళ అమ్మ అంటుంది.

మా ఫ్రెండ్ పెళ్లిలో నేను చాలా అందంగా కనిపించాలి కదా అని చందన అంటుంది. దీనికి అస్సలు చెప్పలేకపోతున్నాను అని యశోద అనుకుంటుంది. వీళ్ళ ఆస్తి ఏదో మొత్తం తగలేసినట్టు చిరాకు పడుతున్నారు ఏంటి మీరు లోపలికి వస్తారా లేదా అని చందన కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మేడం జ్యూస్ తాగండి అని కాంతా బాయ్ అంటుంది. ఇప్పుడే వద్దులే కాంత, అబ్బాయి అవును ఈమధ్య సినిమాలేవి రిలీజ్ కావట్లేదా వెళ్లలేదు అని ఝాన్సీ అంటుంది. అయ్యాయమ్మా కానీ బాగోలేదని నేనే వెళ్లట్లేదు పొద్దటి నుంచి సార్ నన్ను ఫోన్ చేసి ఝాన్సీ ఎలా ఉందని అడుగుతున్నారు మీరు జ్యూస్ తాగండి అమ్మ అని కాంతా బాయ్ అంటుంది. ఆయన ఏదో నామీద కేరింగ్ ఉన్నట్టు అంటాడు కానీ ఏది ఇంతవరకు నాకు ఫోన్ కూడా చేయలేదు నీకు చేస్తే సరిపోతుందా అని ఝాన్సీ అంటుంది. సార్ కి మీ మీద చాలా ప్రేమ ఉంది మేడం మీ మధ్యకి ఎవరు రాకముందే మీరే బయటపడండి లేదంటే సారు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారేమో అని కాంతా బాయ్ అంటుంది. కట్ చేస్తే, అభిషేక్ వాళ్లు సుగుణ రూమంతా చెక్ చేస్తూ ఉంటారు. వాళ్లు అలా చెక్ చేస్తున్నప్పుడు సుగుణ ఫోను కనపడుతుంది అది చూసి స్వర బాధపడుతుంది. ఏంటి స్వర ఆ ఫోను చూస్తూ అలా ఏడుస్తున్నావు ఊరుకో అని అభిషేక్ అంటాడు.

లేదు సార్ ఇందులో మా అమ్మ ఫోటో ఉంది అది చూడగానే నాకు అమ్మ గుర్తుకు వచ్చింది అని స్వర అంటుంది. చూడు స్వర ఎమోషనల్ అయిపోకు సాక్షాదారాల కోసం ఇల్లంతా వెతుకు అప్పుడు మీ అమ్మని చంపిన వాడు ఎవరో తెలుస్తుంది అని అభిషేక్ అంటాడు. మళ్లీ వాళ్ళు రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటారు. అభిషేక్ కి ఒక డ్రాయింగ్ దొరుకుతుంది. ఇది నేను ఒకటవ తరగతిలో ఉన్నప్పుడు వేసిన డ్రాయింగ్ సార్ మా అమ్మ దీన్ని ఇన్ని రోజులు జాగ్రత్తగా దాచిపెట్టుకుందా అని స్వర ఏడవడం మొదలు పెడుతుంది. అభిషేక్ ఫోన్ తీసుకొని ఏంటి మేడం ఈ ఫోన్లో వీడియోను ఎందుకు డిలీట్ చేశారు అని అభిషేక్ వైజయంతిని అడుగుతాడు. ఏంటి ఆఫీసర్ నేనెందుకు డిలీట్ చేస్తాను నాకేం అవసరం అని వైజయంతి గట్టిగా సమాధానం చెప్తుంది. ఇంతలో కళ్యాణి వదిన అనుకుంటూ ఇంట్లోకి వస్తుంది. వెళ్లండి మేడం మీ కోసమే వచ్చినట్టుంది వెళ్లి మాట్లాడండి అని అభిషేక్ అంటాడు. ఏంటి వదిన నాయుడు గారిని పోలీసులు అరెస్టు చేశారా అని కళ్యాణి అంటుంది.

కళ్యాణి గారు నాయుడు గారే హత్య చేశారని బలంగా నమ్ముతున్నట్టున్నారే మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు మేడం అని అభిషేక్ కళ్యాణిని అడుగుతాడు. అంటే బాబు టీవీలోనూ న్యూస్ లోనూ అన్నయ్య హత్య చేసినట్టు మాట్లాడుతున్నారు కదా అందుకే అలా అన్నాను అని కళ్యాణి అంటుంది. కళ్యాణి నాతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చావా అదేంటో చెప్పు అని వైజయంతి అంటుంది. ఏమీ లేదు వదినగారు చిన్న పని ఉండి ఇటు వచ్చాను అలాగే మిమ్మల్ని కోడల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చాను అని కళ్యాణి అంటుంది. అవునా అయితే ఇక బయలుదేరు అని వైజయంతి అంటుంది.

సరే బాబు వెళ్ళొస్తాను అంటూ కళ్యాణి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి మేడం ఫోన్లో వీడియో ని ఎందుకు డిలీట్ చేశారు అని అభిషేక్ మళ్లీ అంటాడు. ఏంటి ఆఫీసర్ చిన్న మెదడు కానీ చిట్లి పోయిందా ఏంటి మీరు మాట్లాడే దానికి ఆ ఫోన్ కి నాకు ఏమైనా సంబంధం ఉందా అని కళ్యాణి అంటుంది. చూడండి మేడం ఇంట్లో ఉన్నది మీరు ముగ్గురే నాయుడు గారు ఎలాగు సుగుణ ఫోను తీసుకోరు స్వర ఏమో వాళ్ళ అమ్మ ఫోనే ముట్టలేదు మీరు తప్ప ఇంకెవరున్నారండి అని అభిషేక్ అంటాడు. చూడు ఆఫీసర్ చచ్చిపోయిన ఆవిడే డిలీట్ చేసిందని మీరు ఎందుకు అనుకోరు ఆ కోణంలో ఆలోచించండి అని కోపంగా వైజయంతి వెళ్ళిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది