Paluke Bangaramayenaa October 17 ఎపిసోడ్ 49: స్వర ఆ లెటర్ తీసి చదవడం మొదలు పెడుతుంది నాన్న అమ్మ ఇంకో బిడ్డను కందాము అంటే నాకు ఒక బిడ్డ చాలు 100 మందితో సమానమని అన్నావు అదే నువ్వు చేసిన పెద్ద తప్పుగా మిగిలిపోతుంది నాన్న నేను మీకు దూరమైపోతున్నాను చిన్నప్పటినుంచి ఆడపిల్లని మీరు గారాబంగా పెంచుతారు కానీ ఎంతవరకు మాకు పెళ్లయ్యేంతవరకే కానీ ఆ తరువాత మేము మీకు కంటి చూపు మేరల్లో కూడా కనిపించను నాన్న తొందరపడి తెలిసి తెలియని వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని అనుకున్నాను కానీ పెళ్లయిన తర్వాతే చంటి మంచివాడు కాదు రాక్షసుడు అని తెలిసింది

మాటలతో రోజును చిత్రహింస పెడుతున్నాడు చంటికి తోడు వాళ్ళ అమ్మ కూడా నన్ను బాధలు పెడుతుంది నా మీద వాళ్ళకి అనుమానం నాన్న ఒక విషయం మీకు చెప్పాలి నా పేరు నా ఉన్న స్థలం వాళ్లకు దక్కకూడదు ఆ స్థలం కోట్ల రూపాయల విలువ చేస్తుందని చంటి ఆయన పేరు మీద రాయమని ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను రాయలేదు నేను ఉన్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండు నాన్న ఈ లెటర్ మీకు చేరే సరికి వీళ్ళ చేతిలో నేను చనిపోయి ఉంటాను అని హిందూ లెటర్లో రాసి ది. ఆ లెటర్ చదవగానే విశ్వం అయ్యో ఇందు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తాడు. మీరు బాధపడకండి బాబాయ్ గారు ఈ లెటర్ నా దగ్గరే పెట్టుకుంటాను ఇంకా కొన్ని బలమైన సాక్షాలు దొరకగానే వాడిని జైలు పాలు చేద్దాము వాడిని ఉరికంభం ఎక్కిద్దాం నేను వెళ్ళొస్తాను బాబాయి అని స్వర అంటుంది.

కట్ చేస్తే జయంతి విశాల్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటో దిన ఇలా వచ్చావ్ మా కోడలు పిల్ల ఎలా ఉంది అని కళ్యాణి అంటుంది. మీరు చేసుకోబోయే కోడలా చంపేసిన కోడలా అని జయంతి అంటుంది. ఆ మాట వినగానే కళ్యాణి మౌనంగా ఉండిపోతుంది. ఎంత బాగా ప్లాన్ చేసి మినిస్టర్ గారి కూతుర్నే పెళ్లి చేసుకుందామని అనుకుంటారు నచ్చకపోతే విడాకులు ఇచ్చేయాలి కానీ అమ్మాయిని అన్యాయంగా ఎందుకు చంపేశారు చంపేస్తే చంపేశారు కేసు వాదించడానికి వచ్చినా లాయర్లను కూడా చంపేశారట ఆ మాట వినగానే నాకు గుండెలు బద్దలయ్యేలా అనిపించింది ఇక నాయుడికి తెలిస్తే ఏంటి పరిస్థితి అని జయంతి అంటుంది. వదిన ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో నాకొడుకుని కాపాడు అని కళ్యాణి అంటుంది.

చేతు నీ కాళ్ళని నేను ఎందుకు అనుకోవాలి కళ్యాణి అని జయంతి అంటుంది. వదిన నా కొడుకుని కాపాడు నీ కాళ్లు పట్టుకొని అడుగుతున్నాను నువ్వు ఏం చెప్తే అదే అని కళ్యాణి అంటుంది. సరే కళ్యాణి నువ్వు ఇంతలా బ్రతిమిలాడుతున్నావ్ కాబట్టి ఒప్పుకుంటున్నాను పెళ్లయ్యాక తోక జాడించారనుకో మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని జయంతి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే స్వర ఇంటికి వచ్చి అమ్మ నీతో మాట్లాడాలి ఒకసారి గదిలోకి రా అని అంటుంది స్వర. ఏం మాట్లాడాలి విశాల్ తో పెళ్లి ఇష్టం లేదు నేను చేసుకుని అని మాత్రం చెప్పకు అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ నీకు ఒక నిజం చెప్పాలి నువ్వు ముందు గదిలోకి రా అని స్వర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇందు వల్ల నాన్న వైన్స్ లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు.

పక్కనే విశాల్ కూడా మందు తాగుతూ ఉంటాడు మందు తాగుతున్న విశాల్ న్ని ఇందు వల్ల నాన్న చూసి ఒరేయ్ నువ్వారా నీకు చావు మూడింది రా లాయర్ ఝాన్సీ సాక్షాలతో సహా రేపు కోట్లు సబ్మిట్ చేస్తుంది రా నిన్ను ఊరుకంభం వెతికిస్తుంది రా నీ చావు చూడడానికే నేను ఇంకా బ్రతికున్నాను రా ఝాన్సీ తల్లి నిన్ను వదిలిపెట్టదు రా అనుకుంటూ వెళ్లిపోతాడు.ముసలోడు ఇంతలా అంటున్నాడు అంటే నిజంగానే ఆ ఝాన్సీ దగ్గర ఏవో బలమైన ఆధారాలు ఉండే ఉంటాయి అవేంటో తెలుసుకోవాలి ఆ ఝాన్సీ ఎవరో కూడా తెలుసుకోవాలి అని విశాల్ అనుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది