Paluke Bangaramayenaa అక్టోబర్ 2: పలుకే బంగారమయేనా సీరియల్ స్టార్ మాలో సెప్టెంబర్ 21 నుండి ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఈ సీరియల్ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ప్రోమోస్ వస్తున్నాయి. సంధ్య రామ చంద్రన్ అనే తమిళ నటి ఇందులో స్వరాగిణి అనే ప్రధాన పాత్రని పోషిస్తోంది. ఇందులో కథానాయికకు నత్తి ఉండగా.. ఏమాత్రం ఇష్టపడని తండ్రి. అయినా న్యాయం వైపు నిలబడే కూతురు.. తన జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ఎలా ఎదుర్కొనబోతుందనేదీ సీరియల్. ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. అంతకు మించి ఎన్నో ఆశలను కూడా నేర్పిస్తుంది. మరి ఈ సంధ్య రామ చంద్రన్ గురించి తెలుసు కుందాం.

చెన్నైకి చెందిన సంధ్యా రామచంద్రన్ ప్రధానంగా తమిళ, తెలుగు టెలివిజన్ సీరియళ్లల నటి. ‘గోకులతిల్ సీతై’ సీరియల్ తో నట జీవితాన్ని ప్రారంభించిన సంధ్య అక్కడ ఇనియా అనే పాత్రను పోషించింది.ఆమె తన రెండవ తమిళ సీరియల్ దైవం తంత పూవేలో తార పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది.

సంధ్య మోడల్ గా కెరీర్ ప్రారంభించి పలు మోడలింగ్ ప్రాజెక్టులు చేసింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఇవాలిన్ వంటి ప్రఖ్యాత బ్రాండ్లకు ఆమె మద్దతు ఇచ్చారు. ఆమె 2019 లో ఎ గైడ్ టు గ్రోసరీ షాపింగ్ అనే టీవీ మినీ సిరీస్ ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించింది. సంధ్య 2022 లో తమిళ సీరియల్ తవమై తవమిరుందు లో చక్కగా నటించింది .

సంధ్యా రామచంద్రన్ వయసు 25 సంవత్సరాలు (2023 నాటికి). ఆమె శారీరక స్థితి గురించి మాట్లాడుకుందాం. ఆమె ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, బరువు సుమారు 55 కిలోలు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.డ్యాన్స్, రీడింగ్, మోడలింగ్ ఆమెకు ఇష్టమైన హాబీలు. ఆమె జూలై 9 న కేరళ లో జన్మించింది కానీ తమిళనాడులోని చెన్నైలో పెరిగింది.

సంధ్య రామచంద్రన్ టెలివిజన్ సీరియల్ నటి అవకముందు ఆల్బమ్ పాటలలో నటించింది. యోగిబాబు నటించిన సెలూన్ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించింది. జీ తమిళ్ లో ప్రసారమైన తవమై తవమిరుందు (2022) సిరీస్ ద్వారా సంధ్య తన మొదటి విజయాన్ని అందుకుంది. రాజా రాణి సీరియల్ ఫేమ్ బ్రిట్టో మనోతో ఈమె కు జులై 9 న ఈ సంవత్సరమే (2023)వివాహం అయింది. సంధ్య కి ఫిట్ నెస్ అంటే ఇష్టం. అందుకోసం ఆమె జిమ్ లో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతుంది.

ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 130 వేల మంది ఫాలోవర్లు (ఫిబ్రవరి 2023 నాటికి) ఉన్నారు.
అందానికి అందం, నటన కు నటన ఉన్న ఈమె త్వరలో తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చు కోవాలని ఆశిద్దాం.