Unstoppable 2: నటసింహం నందమూరి బాలయ్య ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క హోస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీ షోతో బాలకృష్ణ హోస్ట్ గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. మొదటి సీజన్ కి ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మాత్రమే వచ్చారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, మంచు ఫ్యామిలీ, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన, రవితేజ, గోపీచంద్ మలినేని ఇంకా పలువురు. అయితే సెకండ్ సీజన్ కి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు పొలిటికల్ నేతలు కూడా వస్తున్నారు.
రాజకీయంగా చూసుకుంటే టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి రావటం జరిగింది. ఇంకా కుర్ర హీరోలు కూడా ఈసారి సెకండ్ సీజన్ లో వచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ షోలోకి రాబోతున్నట్లు సరికొత్త వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆహా టీం ప్రభాస్ తో సంప్రదించినట్లు ఓకే చెప్పినట్లు సమాచారం. ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు అతని బెస్ట్ ఫ్రెండ్ మరో హీరో గోపీచంద్ కూడా “అన్ స్టాపబుల్ 2″షోకి బాలకృష్ణతో వేదిక పంచుకోనున్నట్లు త్వరలో ఈ ఎపిసోడ్ షూట్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు ఈ సెకండ్ సీజన్ చివరిలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సెకండ్ సీజన్ కి పొలిటికల్ టచ్ షో నిర్వాహకులు ఇవ్వడంతో మొదటి సీజన్ కంటే మంచి క్రేజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సీజన్ చివరికి వస్తూ ఉండటంతో టాప్ మోస్ట్ సెలబ్రిటీలను అన్ స్టాపబుల్ టీం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.