NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించాడు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, ఆస్తులు, అప్పులు, చెల్లించిన పనులు మరియు ఇచ్చిన విరాళాల గురించి ప్రస్తావించాడు.

ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తన పేరు, తన కుటుంబసభ్యుల పేరు మీద రూ. 163 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరిట రూ. 46 కోట్లు విలువ చేసే చర ఆస్తులు, భార్య పేరున రూ. 1 కోటి, ఆయన పిల్లల పేరున రూ. 3.5 కోట్లు ఉన్నాయి. అలాగే జన్వాడ, మంగళగిరి, జూబ్లీహిల్స్‌లో భూముల రూపంలో రూ. 118 కోట్లు విలువ చేసే స్థిర ఆస్తులు ఉన్నాయి.

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లు. తన సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47.07 కోట్లు, జీఎస్టీ రూపంలో మరో రూ.26.84 కోట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చ‌ల్లించారు. అప్పుల విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అక్ష‌రాల రూ.64.26 కోట్లు అప్పులు ఉన్నాయి. అందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17.56 కోట్లు మ‌రియు నిర్మాతలు నవీన్, దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్, వదిన సురేఖ కొణిదెల‌తో స‌హా ప‌లువురు వ్య‌క్తుల నుంచి రూ. 46.70 కోట్లు అప్పు తీసుకున్న‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెల్ల‌డించారు.

ఇక‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ విరాళాలు కూడా భారీగానే ఇచ్చారు. వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాల కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూ.17.15 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో వెల్ల‌డించారు. అంతేకాకుండా ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో త‌న విద్యార్హ‌త గురించి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. తాను 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యానని, నెల్లూరులో త‌న విద్యాభ్యాసం సాగింద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ వివ‌రాలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

కాగా, ఫిల్మ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఏడాది ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు ఉన్నాయి. అయితే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మై రెండేళ్లు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు గ‌త ఏడాది సెట్స్ మీద‌కు వెళ్లాయి. ప‌వ‌న్ పాలిటిక్స్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఆయా సినిమాల షూటింగ్స్ అనుకున్నంత వేగంగా సాగ‌డం లేదు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N