Pawan Kalyan Arjun: సీనియర్ హీరో నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ తన సొంత బ్యానర్ లో కూతురిని లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో విశ్వక్ సేన్ నీ హీరోగా తన సొంత బ్యానర్ లో కూతురు హీరోయిన్ గా అర్జున్ తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో అర్జున్ ఆహ్వానం మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావటం జరిగింది. రామానాయుడు స్టూడియోలో తాను నిర్మించబోయే దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై.. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ పై క్లాప్ కొట్టారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇండస్ట్రీలో అర్జున్ తో పవన్ కళ్యాణ్ కి ఎప్పటినుండో మంచి స్నేహం ఉంది. ఈ సందర్భంగా పవన్.. అర్జున్ సొంత బ్యానర్ లో కూతురినీ లాంచ్ చేస్తూ ఉండటంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు అయ్యి.. పాల్గొనడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్.. ఈ కార్యక్రమానికి హాజరైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరోలలో ఒకరు విశ్వక్ సేన్. “ఫలక్ నామాదాస్” వంటి సూపర్ హిట్ మూవీతో యూత్ లో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న.. విశ్వక్ ఇటీవలే “అశోకవనంలో అర్జున కళ్యాణం” వంటి క్లాస్ ఎంటర్టైనర్ సినిమాతో సరికొత్త హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. కెరియర్ పరంగా అద్భుతంగా.. రాణిస్తున్న విశ్వక్ సేన్ లేటెస్ట్ గా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. గతంలోనే అర్జున్ పలు చిత్రాలను తెరకెక్కించడం జరిగింది. నిజం మధ్యలో గ్యాప్ రావడం తో ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత అర్జున్ తన కూతురు ఐశ్వర్య కోసం మెగాఫోన్ పట్టుకోవడం తో.. ఈ ప్రాజెక్టు సౌత్ ఇండియా లోనే సెన్సేషనల్ గా మారింది. ఈ సినిమాకి అర్జున్ యే నిర్మాత, రచయిత, దర్శకుడు. మరి ముఖ్యంగా అర్జున్ కి అత్యంత సన్నిహితుడు స్నేహితుడు సీనియర్ హీరో జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేజిఎఫ్ సినిమాకి సంగీతం అందించిన రవి బశ్రూర్ మ్యూజిక్ డైరెక్టర్.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!