Subscribe for notification

Pawan Kalyan: పవ‌న్ కొత్త టార్గెట్‌.. ఇంత త‌క్కువ టైమ్‌లో అది సాధ్య‌మేనా?

Share

Pawan Kalyan: రీఎంట్రీ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెట్టి దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో ఉన్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు` ఒక‌టి. ప‌వ‌న్ కెరీర్‌లో తెర‌కెక్కుతున్న తొలి పీరియాడికల్ చిత్ర‌మిది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. రెండు కాలాల మధ్య ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇక‌పోతే గ‌త ఏడాదే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌గా.. కరోనా కారణంగా కొన్నాళ్లు .. పవన్ నిర్ణయాల కారణంగా కొన్నాళ్లు వీరమల్లు షూటింగ్ డిలే అవుతూ వచ్చింది.

లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ను రీ స్టార్ట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు యాబై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. మిగతా యాబై శాతం షూటింగ్ పూర్తి చేసుకోవల్సి ఉంది. అయితే ఇంత‌లోనే షూటింగ్‌కు మ‌రోసారి బ్రేక్ ప‌డ‌నుందంటూ వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, ప‌వ‌న్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణ‌యించుకున్నార‌ట‌. పవన్ రాజకీయాల కారణంగా అక్టోబర్ నుంచి చాలా బిజీగా ఉంటాడు. ఈ నేప‌థ్యంలోనే ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఆగస్టు నెల ఆఖ‌రిలోపు వీర‌మ‌ల్లు షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని కొత్త టార్గెట్‌ను పెట్టుకున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే ఇంత త‌క్కువ టైమ్‌లో యాబై శాతం షూటింగ్‌ను కంప్లీట్ చేయ‌డం సాధ్య‌మేనా అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది.


Share
kavya N

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

37 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

37 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

50 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago