పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం `హరి హర వీరమల్లు` వర్క్ షాప్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంటే షూటింగ్ కి వెళ్లబోయే ముందు చేసే రిహార్సల్స్. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
ఇందులోలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. గత ఏడాదే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. కానీ, వరుస అడ్డంకుల నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్‌ను రీస్టార్ట్ చేసేందుకు యూనిట్ అంతా సన్నద్దంగా ఉంది.
నిన్న వర్క్ షాప్ ఫోటోలను సైతం చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ పిక్స్‌లో రెడ్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ మరియు షూస్ ధరించి సూపర్ హ్యాండ్సమ్గా పవన్ దర్శనమిచ్చారు. ఆయన లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆయన ధరించిన షూస్ ధర హాట్ టాపిక్‌గా మారింది.
కోపెన్ హాగన్ బ్రాండ్ కి చెందిన షూస్‌ను పవన్ ధరించారు. వారి ధర 119,94 యూరోలుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 10 లక్షలు. దీంతో పవన్ షూస్ ఖరీదు పది లక్షలంటూ అభిమానులు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కానీ, ట్విస్ట్ ఏంటంటే.. డచ్ లాంగ్వేజ్ ప్రకారం ఫుల్ స్టాప్‌ను కామాగా రాస్తుంటారు. నిజానికి ఆ షూ ధర దాదాపు 119 యూరోస్. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.9,600 అన్నమాట.
https://twitter.com/MegaSuryaProd/status/1575827727935946754?s=20&t=e_aFiQpSQ7hXABEW5xtGrQ
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!