Subscribe for notification

Pawan Kalyan: ఆ రెండు వేరు.. టాలీవుడ్ పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Share

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలతో పాటు.. మరోవైపు పాలిటిక్స్‌లోనూ స్పీడ్ పెంచారు. రాజకీయంగా జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. జనసేన తరపున వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఏపీతో పాటు ఇటీవల తెలంగాణలో కూడా పవన్ పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఏపీలో పొత్తులపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో రాజకీయం మొత్తం ఆయన చుట్టూనే తిరిగుతోంది.

Pawan Kalyan’s key remarks on Tollywood

హాట్‌టాపిక్‌గా మారిన పవన్ కామెంట్స్

సినిమాలు, రాజకీయాలు వేరని, సినిమాలకు, రాజకీయానికి సంబంధం పెట్టవద్దని పవన్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. సినిమా అంటే వినోదం మాత్రమేనని, రాజకీయం అంటే ప్రజాసేవ అని చెబుతూ ఉంటారు. రెండింటికి ముడిపెట్టి ఇండస్ట్రీలో రాజకీయాలు చేయవద్దని సూచిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి పవన్ అలాంటి వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan’s key remarks on Tollywood

నానిపై పవన్ ప్రశంసల వర్షం

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘అంటే సుందరానికి’ ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ మాట్లాడుతూ.. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదని, ఒక కుటుంబానికి కాదని వ్యాఖ్యానించారు. ఇది మనందరిదని, ఎవరి సినిమా హిట్ కావాలని వారు కోరుకోవడంలో తప్పు లేదని, అది సహజమన్నారు. కానీ ఎదుటివారి సినిమా ఫ్లాఫ్ అవ్వాలని కోరుకోకూడదన్నారు. రాజకీయంగా ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు, విభిన్న ఆలోచనలు ఉండవచ్చని, కానీ సినిమా వేరు.. రాజకీయం వేరు అని పవన్ తెలిపారు. దానిపై తనకు పూర్తి స్పష్టత ఉందన్నారు.

ఈ సందర్భంగా నానిపై పవన్ ప్రశంసలు కురిపించారు. నాని మంచి నటుడని, నాని వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. నానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని, తమ కుటుంబంలో కూడా నాని ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకొచ్చారు.

డైరెక్టర్‌పై నమ్మకం ఉందన్న పవర్ స్టార్

ఇక అంటే సుందరానికి డైరెక్టర్ గా వ్యవహరించిన వివేక్ ఆత్రేయ గురించి పవన్ మాట్లాడారు. ఈ సినిమాను అద్భుతంగా తీశారనే నమ్మకం తనకు ఉందన్నారు.కాగా ఈ సినిమాలో నాని సరసన నజ్రియా హీరోయిన్‌గా నటించగా.. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను మేకర్స్ విడుదల చేయనున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.


Share
Ram

Recent Posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

9 seconds ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

30 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

60 mins ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

1 hour ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago