29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Oscars 2023: భారతీయులు గర్విస్తున్న క్షణాలు అంటూ RRR కీ ఆస్కార్ రావటంపై పవన్ ప్రశంసలు..!!

Share

Oscars 2023: “RRR” సినిమాకి ఆస్కార్ రావటం పట్ల చాలామంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ చేసేలా రాజమౌళి దిశా నిర్దేశం చేసారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి, గీత రచయిత శ్రీ చంద్రబోస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంలో ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది.

Pawan praises RRR's Oscar win saying it is a moment Indians are proud of

ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు శ్రీ ఎస్.ఎస్.రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన శ్రీ ఎన్.టి.ఆర్., శ్రీ రాంచరణ్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, నృత్య దర్శకులు శ్రీ ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్యలకు అభినందనలు. ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది.. అని పవన్ కళ్యాణ్ RRR సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది.

Pawan praises RRR's Oscar win saying it is a moment Indians are proud of

ఇదే సమయంలో చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “RRR” భారతీయ చలనచిత్రా రంగం యొక్క స్థాయిని మరో మెట్టుకు చేర్చింది..అని ఆస్కార్ అవార్డు రావడంపై నెటిజెన్లు ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ కామెంట్లు పెడుతున్నారు.


Share

Related posts

nithin : నితిన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు..ఫుల్ హ్యాపీ అంటున్నాడు.

GRK

పవన్ కళ్యాణ్ 29 కి ఆ దర్శకుడంటే షాకవ్వాల్సిందే ..?

GRK

Kriti Shetty Latest Stills

Gallery Desk