NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Pooja Hegde: ప్రియుడితో అడ్డంగా దొరికేసిన పూజా హెగ్డే.. అస‌లెవ‌రీ రోహన్ మెహ్రా, అత‌ని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..?

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ అనగానే గుర్తుకు వచ్చే పేరు పూజా హెగ్డే. ముంబైలో తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించిన పూజా హెగ్డే.. కాలేజీ రోజుల్లో మోడలింగ్ లోకి ప్రవేశించింది. మిస్ ఇండియా 2009 పోటీలో పూజా హెగ్డే పాల్గొన‌గా.. తొలి రౌండ్ లోనే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత ఏడాది మిస్ యూనివ‌ర్స్ ఇండియాలో పోటీ చేయగా.. రన్నరప్ గా నిలిచింది 2012లో మూగమూడి అనే తమిళ చిత్రంతో పూజా హెగ్డే సినీ రంగ ప్రవేశం చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. రెండేళ్లు గ్యాప్ తీసుకుని 2014లో ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. నాగ చైత‌న్య హీరోగా న‌టించిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

కెరీర్ ఆరంభంలో వరుస పరాజయాలను చవిచూసిన పూజా హెగ్డే.. 2017లో డీజే దువ్వాడ జగన్నాథం మూవీతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్‌ చేసుకుంటూ అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. దాంతో పూజా హెగ్డే కు బాలీవుడ్ మరియు కోలీవుడ్ లో సైతం జోరుగా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. కానీ 2022 నుంచి పూజా హెగ్డే బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. రాధేశ్యామ్‌, ఆచార్య‌, స‌ర్క‌స్‌, బీస్ట్‌, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి ఫ్లాప్ చిత్రాల‌తో పూజా హెగ్డే గ్రాఫ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది.

Mahesh Babu's Trivikram Srinivas actress is 33 years old...yet her age does not show in her birthday photos in Maldives

వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం సెల‌క్టివ్ గా సినిమాల‌ను ఎంపిక చేసుకునే ప‌నిలో ప‌డింది. ప్రొఫెష‌న్ గురించి ప‌క్క‌న పెడితే.. పూజా హెగ్డే ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలో ప్రియుడితో అడ్డంగా దొరికేసింది. ఓ రెస్టారెంట్ నుంచి పూజా హెగ్డే కారులో వెళ్తుండ‌గా.. అక్క‌డే ఉన్న కొంద‌రు ఫోటోగ్రాఫ‌ర్స్ వీడియో తీశారు. అయితే ఈ వీడియోలో పూజా హెగ్డేతో పాటు మ‌రొక వ్య‌క్తి కూడా ఉన్నాడు. ఒకే కారులో ఇద్ద‌రు స‌న్నిహితంగా క‌నిపించారు.

దాంతో ఆ వ్య‌క్తి గురించి ఆరాలు తీయ‌గా.. అత‌ను రోహన్ మెహ్రా అని తెలిసింది. రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉందని గత కొంతకాలం నుంచి బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. గతంలో వీరిద్దరూ పలుమార్లు రెస్టారెంట్స్ లో జంటగా కనిపించారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ తాజాగా మరోసారి పూజా హెగ్డే రోహన్ మెహ్రా తో కనిపించింది. రోహ‌న్ మెహ్రా విష‌యానికి వ‌స్తే.. ఇత‌ను ఒక బాలీవుడ్ న‌టుడు.

ఉత్తరాంచల్ కు చెందిన రోహన్ మెహ్రా.. 2009లో మోడలింగ్ వృత్తిని ప్రారంభించాడు. 200 కంటే ఎక్కువ టీవీ వాణిజ్య ప్రకటనలు మరియు ప్రింట్ యాడ్స్ లో రోహాన్ యాక్ట్ చేశాడు. అనేక మ్యూజిక్ వీడియోస్‌లో మ‌రియు ప‌లు టీవీ సీరియ‌ల్స్ లో ప‌ని చేశారు. రియాలిటీ షోస్‌లో సంద‌డి చేశాడు. బాలీవుడ్ బిగ్ బాస్ సీజ‌న్ 10లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న రోహ‌న్ మెహ్రా.. టాప్‌-5లో నిలిచి ఎలిమినేట్ అయ్యాడు. అలాగే బాలీవుడ్ లో రెండు, మూడు సినిమాల్లో న‌టించాడు. కానీ అవి ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. వెండితెర‌పై స‌క్సెస్ కాలేక‌పోయినా.. బుల్లితెర ద్వారా నార్త్ ప్రేక్ష‌కుల‌కు రోహ‌న్ మెహ్రా చేరువ‌య్యాడు. ఇప్పుడు అత‌నితో పూజా హెగ్డే డేటింగ్ చేస్తుంద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే పూజా హెగ్డే నోరు విప్పాల్సిందే.

author avatar
kavya N

Related posts

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella