స్టార్ సెలబ్రెటీల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వారి లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది. కాళ్లకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి కళ్లకు పెట్టుకునే అద్దాల వరకు అన్నీ ఎంతో కాస్ట్లీగా ఉంటాయి. అవి ఒక్కోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా కూడా మారుతుంటాయి. తాజాగా స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హ్యాండ్ బ్యాగ్ విషయంలోనూ అదే జరిగింది.
ఓవైపు వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బుట్టబొమ్మ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్‌గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్లతో నెటిజన్లను ఆగమాగం చేస్తుంటుంది. అలాగే ఈ అమ్మడు బయట ఎక్కడ కనిపించినా కెమెరా కళ్లు ఆమె ఫోటోలను క్లిక్ అనిపించకుండా ఉండలేదు.
ఈ క్రమంలోనే తాజాగా కూడా పూజా హెగ్డేకు సంబంధించి కొన్ని పిక్స్ బయటకు వచ్చింది. వాటిలో పూజా హెగ్డే చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ధర ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎంతో సింపుల్‌గా ఉన్న ఆ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ధర దాదాపుగా లక్షన్నర పైనే ఉంటుందట. ఈ విషయం తెలిసి నెటిజన్లు కళ్లు తేలేస్తున్నారు.
కాగా, పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్బీ 28`, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన `జనగణమన` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్ట్స్‌లో భాగం అయింది.