Pawan Kalyan: తెలుగు తెర వెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అక్కర్లేదు. తెలుగునాట ఏ ఏంటి గడపను అడిగినా అతని అడ్రెస్స్ చెబుతుంది. మెగాస్టార్ తమ్ముడు అయినప్పటికీ ఆ ఇంపాక్ట్ తనపై పడకుండా, తనకంటూ ఓ స్టార్ డంని ఏర్పరచుకున్న నటుడు పవన్ కళ్యాణ్. బేసిగ్గా ఎలాంటి ఫంక్షన్స్ కి వెళ్లడం ఇష్టం లేని కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చిన తరువాత బయట కనబడుతున్నాడు. ఆయన స్థాపించిన ‘జనసేన’ గురుంచి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయితే ఈయన ఓ యంగ్ హీరో సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ లో మెరిశారు. దాంతో మీడియా ఫోకస్ మొత్తం ఆయనపై పడింది.
ఈమధ్య తెలుగునాట ఓ యంగ్ హీరో తనదైన మార్క్ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నాడు. అతడే విశ్వక్ సేన్. ‘ఫలక్నుమా దాస్’తో హీరోగానే కాకుండా, తానే సొంతంగా దర్శకత్వం వహించి హిట్ కొట్టాడు. ఇక తాజాగా ‘అర్జున కళ్యాణం’ అనే సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇతని సినిమా ఓపెనింగ్ లో మన పవర్ స్టార్ మెరిశారు. అంతటితో ఆగకుండా ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ ని సంబరాలు చేసుకొనేలా చేసాడు.
తమిళ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. తనదైన మార్క్ ఫైట్స్ తో 90sలో తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసాడు. కాగా ఇపుడు తన కుమార్తె ఐశ్వర్యని తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయాలని ఈ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయనే దర్శకుడిగా శ్రీరామ్ ఇండర్నేషనల్ బ్యానర్ పై గురువారం ఓ మూవీని ప్రారంభించారు. ఇందులో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ఇక హీరో అర్జున్ కు అత్యంత సన్నిహితుడు స్నేహితుడు అయిన జగపతిబాబు ఈ మూవీలోని కీలక పాత్రలో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా యాక్షన్ కింగ్ అర్జున్ తెరక్కించనున్న ఈ మూవీ ముహూర్తానికి పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందడంతో సదరు టీమ్ కి క్లాప్ కొట్టి ఆశీర్వదించారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…