Prabhas-Maruthi: ప్ర‌భాస్‌-మారుతి సినిమా ప‌ట్టాలెక్కేది ఎప్పుడో తెలుసా?

Share

Prabhas-Maruthi: `బాహుబ‌లి` మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్‌.. ప్రస్తుతం వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో ఎంత బిజీగా ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇటీవ‌లె `ఆదిపురుష్‌` చిత్రాన్ని కంప్లీట్ చ‌సిన ఈయ‌న‌.. ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` చిత్రాలు చేస్తున్నాడు.

అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్ష‌న్‌లో `స్పిరిట్‌` అనే మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇక వీటితో పాటే ప్ర‌భాస్‌, మారుతి కాంబినేష‌న్‌లో ఓ మూవీ తెర‌కెక్క‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంలో మారుతు మాట్లాడుతూ.. `ప్రభాస్ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. ఆయనుకు నేను పెద్ద అభిమానిని.

ఆయనతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలనుంది. డార్లింగ్ – బుజ్జిగాడు లాంటి యాక్టివ్ ప్రభాస్ ను మళ్లీ చూపించాలనేదే నా కోరిక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయను` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో వీరి కాంబో ప్రాజెక్ట్ దాదాపు క‌న్ఫామ్ అయింద‌నే టాక్ ఊపందుకుంది.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా పండ‌గ‌కి ప‌ట్టాలెక్కించే విధంగా మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. అలాగే ప్ర‌భాస్ ఈ మూవీకిగానూ వంద రోజుల కాల్షీట్స్ ఇచ్చాడ‌ని అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది. కాగా, మారుతి త్వ‌ర‌లోనే `పక్కా కమర్షియల్`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. గోపీచంద్‌, రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన ఈ చిత్రం జూలై 1న రిలీజ్ కాబోతోంది.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

28 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

2 hours ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago