Prabhas: ప్ర‌భాస్‌కు ఈ రోజు ఎంత స్పెష‌లో తెలుసా?

Share

Prabhas: ప్ర‌భాస్‌.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `బాహుబ‌లి` చిత్రంతో దేశ‌వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్ర‌స్తుతం వ‌రుస భారీ ప్రాజెక్ట్‌ల‌తో దూసుకుపోతున్న ప్ర‌భాస్‌కు.. ఈ రోజు(జూన్ 28) ఎంతో స్పెష‌ల్ అని చెప్పాలి.

ప్రభాస్‌ హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో 20ఏళ్లు పూర్తైంది. ఆయ‌న డెబ్యూ చిత్రం `ఈశ్వ‌ర్‌` 2002 జులై 28 న రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. ప్రభాస్‌పై ఆయన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు స్వ‌యంగా క్లాప్ కొట్టి ఆశీర్వదించారు.

జయంత్ సి పరాంజి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా న‌టించింది. కోళ్ళ అశోక్ కుమార్ నిర్మించిన ఈ మూవీ 11 నవంబర్ 2002న రిలీజ్ అయింది. అయితే ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికీ 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు సెల‌బ్రేష‌న్స్‌లో మునిగిపోయారు. మ‌రోవైపు హైద్రాబాద్‌లోని రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు ఇంట్లో కూడా ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి.

దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ఆయ‌న స‌తీమ‌ణి శ్యామల దేవిలు పాల్గొని కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. `ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయంటే న‌మ్మ‌లేక‌పోతున్నా. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ.. ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్‌ని చుస్తే చాలా ఆనందంగా, గ‌ర్వంది ఉంది.` ఉంది అంటూ చెప్పుకొచ్చారు.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

34 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

43 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago