NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

Prabhas: ప్రాంతీయ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఎంత గొప్ప నటుడో అంతే గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఇతరులకు సాయం చేయడంలో ప్రభాస్ ఎప్పుడు ముందే ఉంటాడు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితం అయింది. తాజాగా ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ కోసం భారీ విరాళం ప్రకటించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దాసరి నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది మే 4న దర్శకుల‌ దినోత్సవ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది కూడా డైరెక్టర్స్ డేను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక కోసం భారీ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. ఇప్ప‌టికే ఈ వేడుక‌కు సంబంధించిన ఇన్విటేష‌న్లు అగ్ర హీరోల‌కు అందాయి. తాజాగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కు టీఎఫ్‌డీఏ(తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్) ఆహ్వానం అందించ‌గా.. ఆయ‌న త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు. అలాగే ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ డే ఘ‌నంగా జ‌రిపించ‌మ‌ని చెబుతూ రూ. 35 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

ఈ విష‌యాన్ని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ స్వ‌యంగా ధృవీక‌రించింది. హైదరాబాద్‌లో సోమ‌వారం సాయంత్రం డైరెక్టర్‌ అసోసియేషన్‌ కర్టెన్‌ రైజర్‌ మీటింగ్‌ జరిగింది. ఈ మీటింగ్ లో అసోసియేషన్ సభ్యులతో పాటు చాలా మంది డైరెక్ట‌ర్స్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. `మన డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం ప్రభాస్ గారు రూ. 35 లక్షలు విరాళం ఇస్తున్న‌ట్లు ప్రకటించారు. ఇందాకే ఆయ‌న నుంచి కాల్ వ‌చ్చింది. దర్శకుల సంఘం త‌ర‌పున ఆయ‌న‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద‌ర్శ‌కుల బాగు కోసం మ‌రికొంత మంది స్టార్స్ కూడా ముందుకు వ‌స్తూ విరాళాలు ఇస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది` అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో ప్ర‌భాస్ గొప్ప మ‌న‌సుపై అభిమానులు మ‌రియు సినీ ప్రియులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లోనూ ప్ర‌భాస్ హీరోనే అంటూ ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం ప్ర‌భాస్ వ‌రుస చిత్రాల‌తో ఎంత బిజిగా ఉన్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఏడాది స‌లార్ పార్ట్ 1తో బిగ్ హిట్ అందుకున్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో క‌ల్కి 2898 ఏడీ అనే సినిమా చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వని దత్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంద‌రో స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు.

అలాగే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఒక చిత్రం చేస్తున్నాడు. అదే ది రాజా సాబ్. రొమాంటిక్ హార‌ర్ మూవీగా రూపుదిద్దుకుంటున్న రాజ్ సాబ్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై టీ.జె. విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ మరియు మాళవిక మోహనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక ఈ రెండు ప్రాజెక్ట్‌ల‌తో పాటు ప్ర‌భాస్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మ‌రియు ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ 2కు క‌మిటై ఉన్నాడు.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N