HBD Prabhas: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోల పుట్టినరోజులకు ఆ హీరోకి సంబంధించి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను లేటెస్ట్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వరవడిని సూపర్ స్టార్ మహేష్ అభిమానులు స్టార్ట్ చేశారు. ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టిన రోజు కావడంతో పోకిరి, అతడు, ఒకడు సినిమాలని రీ రిలీజ్ చేయటం జరిగింది. భారీ ఎత్తున కలెక్షన్స్ రావడంతో వాటిని అనాధ పిల్లల చదువులకు ఉపయోగించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు “జల్సా” సినిమా రిలీజ్ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో లేటెస్ట్ టెక్నాలజీతో “బిల్లా” సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో దివంగత కృష్ణంరాజు కూడా నటించడంతో ఆయనను స్మరించుకుని ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను ఈ రీతిలో ఫాన్స్ చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో “బిల్లా” సినిమాల స్పెషల్ షోలు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మూసేసిన వెంకట్రామ థియేటర్ లో “బిల్లా” సినిమా వేయడం జరిగింది. అయితే థియేటర్ లో ఫ్యాన్స్ అత్యుత్సాహంగా … బాణా సంచాలు కాల్చడంతో ఒక్కసారిగా సీట్లకు మంటలు అలముకున్నాయి.
దాదాపు థియేటర్లో కొన్ని సీట్లు దగ్ధమయ్యాయి. వెంటనే థియేటర్ యాజమాన్యంతో పాటు అభిమానులు అప్రమత్తమయి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే షో మధ్యలో ఆపేయడంతో అభిమానులు ఏ రీతిగా సీట్లను తగలబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదృష్టం కొద్దీ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. సకాలంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు సమాచారం.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!