Prabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఎఫెక్టా?

Share

Prabhas: పాన్ ఇండియా స్థార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీని టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న చిత్ర‌మిది.

ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి సనన్, లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్, హేమా మాలిని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి పండ‌గ కానుక‌గా భారీ లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది.

ఇక‌పోతే ఈ సినిమాకు సంబంధించి ఓ ఎపిసోడ్‌ను చిత్రీక‌రించారు. తండ్రి జనకమహారాజుతో సీతకి ఉండే అనుబంధాన్ని ఈ ఎపిసోడ్‌లో చూపించ‌బోతున్నార‌ట‌. అయితే సీత పాత్రకి కృతి ఎలాగో ఉంది కానుక‌.. జనకమహారాజు పాత్ర కోసం ఓం రౌత్ అనేక మందిని సెర్చ్ చేసి ఫైన‌ల్‌గా ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్టంరాజును సెలెక్ట్ చేసుకున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ కూడా కంప్లీట్ అయింద‌ని, మిథిలాధిపతి జనకుడిగా మన రెబల్ స్టార్ కృష్ణంరాజు కనిపించనున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ మాత్రం తెగ‌ టెన్ష‌న్ ప‌డుతున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు.. ప్ర‌భాస్‌, కృష్ణంరాజు క‌లిసి న‌టిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంద‌నే బ్యాడ్ సెంటిమెంట్ ఇండ‌స్ట్రీలో ఉంది. రెబ‌ల్‌, రాధేశ్యామ్ చిత్రాలే ఉదాహ‌ర‌ణ‌. అందుకే ఆదిపురుష్ విష‌యంలో డార్లింగ్ ఫ్యాన్స్ క‌ల‌వ‌ర ప‌డుతున్నారు.


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

20 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

21 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

1 hour ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago