22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
Entertainment News సినిమా

`స‌లార్‌` రిలీజ్ డేట్‌పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆందోళ‌న‌.. కార‌ణం అదేన‌ట‌!

Share

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో `స‌లార్‌` అనే మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ కిరాగందుర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. జ‌గ‌ప‌తి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

హై బ‌డ్జెట్ తో అండ‌ర్ వ‌ర‌ల్డ్ యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ 28న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ గా విడుద‌ల కానుంది. ఇటీవ‌లె మేక‌ర్స్ రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ అధికంగా అనౌన్స్ చేశారు.

అప్ప‌టి నుంచీ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌లో అందోళ‌న మొద‌లైంది. అందుకు కార‌ణం లేక‌పోలేదు.. దశాబ్దం క్రితం సెప్టెంబ‌ర్ 28నే `రెబల్` సినిమా రిలీజ్ అయ్యింది. రాఘవ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న త‌మ‌న్నా, దీక్షాసేథ్ హీరోయిన్లుగా న‌టించారు.

అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఇక ఇప్పుడు `రెబ‌ల్‌` విడుద‌లైన రోజే `స‌లార్‌`ను రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడు `రెబ‌ల్‌` ఫ్లాప్ ఎఫెక్ట్ `స‌లార్‌` పై ఎక్క‌డ ప‌డుతుందో అని ఆందోళ‌న చెందుతున్నారు.

 


Share

Related posts

రాశీఖన్నా ని ఇకపై బాలీవుడ్ హీరోయిన్ అనాలట ..!

GRK

Jathi Ratnalu : ప్రీ రిలీజ్ బిజినెస్ తో దుమ్ము రేపిన జాతి రత్నాలు..! రేపు రిలీజ్ అవ్వబోయే సినిమాలు ఇవే..!!

bharani jella

ఆ హీరోయిన్‌ వ‌ద్దు బాబోయ్ అంటున్న బాల‌య్య ఫ్యాన్స్‌?!

kavya N