కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు నేడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరోవైపు వారి నివాసంలో సినీ ప్రముకులు, రాజకీయ నాయకులు కృష్ణంరాజు పార్థివ దేహానికి పూలమాలతో నివాళి అర్పిస్తున్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి తలసాని కృష్ణం రాజు కూడా కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభాస్ ని పలకరించి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. అయితే ఆయన ముందు ప్రభాస్ కన్నీరు ఆపుకోలేకపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కనిపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడతాయి.. అభిమానాలు మరింతగా బాధపడుతున్నారు. ప్రభాస్‌కు ఇలా చూడలేకపోతున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, సోదరుడి కొడకైనా ప్రభాస్ అంటే కృష్ణంరాజుకు అమితమైన ప్రేమ. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే పెదనాన్న ఇక లేరన్న విషయాన్ని ప్రభాస్ జీర్ణించుకోలేకపోతున్నాడు.
Never in my wildest dreams, I thought I would see him like this 😭
This feels so personal 💔Stay strong #Prabhas anna 🥺😭 pic.twitter.com/k1Jgy82947
— SALAAR 🏹 (@bhanurockz45) September 11, 2022