టాలీవుడ్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. సోషల్ మీడియాలో చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తుంటారు. సినిమాకు సంబంధించిన పోస్ట్‌లు తప్పితే.. ఎలా నుండి ఎలాంటి అప్డేట్స్ ఉండవు. అటువంటి ఆయన ఓ బాలీవుడ్ బ్యూటీపై ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు కృతి సనన్.
`1 – నేనొక్కడినే` అనే తెలుగు చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్‌కు మఖాం మర్చి అక్కడ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం నార్త్‌తో పాటు సౌత్‌లోనూ సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. నేడు బర్త్‌డే జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఆమెకు విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టాడు.
ఇంస్టాగ్రామ్ స్టోరీలో కృతి సనన్ పిక్‌ను షేర్ చేస్తూ.. `హ్యాపీ బర్త్ డే కృతి సనన్. నీవు ఎప్పుడూ చిరునవ్వులతోనే కనిపించాలి. ఆదిపురుష్ లో నీ మ్యాజిక్‌ని ప్రపంచం చూసేంతవరకు వెయిట్ చేయలేను` అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈయన పోస్ట్ వైరల్‌గా మారగా.. కృతి సనన్ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది.
కాగా, వీరిద్దరూ కలిసి `ఆదిపురుష్` చిత్రంతో జంటగా నటించారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీ ఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!