Prabhas: `బాహుబలి` తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుని పాన్ ఇండియా స్థార్‌గా అవతరించాడు ప్రభాస్. చివరిగా ఈయన `సాహో`, `రాధేశ్యామ్` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు సౌత్‌తో పాటు నార్త్ దర్శకనిర్మాతలు సైతం పోటీ పడుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆఫీషియల్ గా నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిలో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నారు.
వీటితో పాటు సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేసేందుకు సైన్ చేశాడు. వరుస ప్రాజెక్ట్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్.. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతోందట. అదేంటో కాదు హోటల్ బిజినెస్ అట. అది కూడా విదేశాల్లో అని తెలుస్తోంది. ప్రభాస్ కు విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌నే ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట.
ఇందులోనే భాగంగానే తన స్నేహితులతో కలిసి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం మొదలు పెట్టబోతున్నట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. దుబాయి, స్పెయిన్ లో ఈ హోటల్స్ నిర్మించబోతున్నారట. ఇక్కడ నుంచి వెళ్లే మన వాళ్ల అవసరాలకు అనుగుణంగా ఈ హోటల్స్ ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…