Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారి చేస్తున్న పౌరాణిక చిత్రం `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే లంకేశుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ చేస్తున్నారు. హేమా మాలిని, కృష్ణం రాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుండగా.. సాచేత్ తాండన్- పరంపరా ఠాకూర్ సంగీతం అందిస్తున్నారు.
కొద్ది నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2023 జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి ప్రభాస్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బాహుబలి తర్వాత నుంచీ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్న ప్రభాస్.. `ఆదిపురుష్` సినిమాకు మాత్రం ఏకంగా రూ. 120 కోట్లు అందుకుంటున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రభాస్ అందుకుంటున్న రెమ్యునరేషన్‌పై బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో ప్రభాస్‌కే తెలియాలి.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…