NewsOrbit
Entertainment News సినిమా

`కాంతార`ను రెండు సార్లు వీక్షించి రివ్యూ ఇచ్చిన‌ ప్ర‌భాస్‌..!

Share

`కాంతార`.. ఇప్పుడీ సినిమా పేరు మార్మోగిపోతుంది. కన్నడ యంగ్ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించ‌డ‌మే కాకుండా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలై కన్నడలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

అలాగే వసూళ్ల పరంగా ఎన్నో రికార్డును సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. అక్టోబర్ 14న హిందీలో, అక్టోబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది‌. అయితే `కేజీఎఫ్‌`, ప్రభాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న‌ `సలార్‌`ని నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్‌ బ్యాన‌ర్‌పైనే ఈ `కాంతార` సినిమా నిర్మిత‌మైంది.

prabhas Kantara movie
prabhas Kantara movie

ఈ నేప‌థ్యంలోనే ప్రభాస్ `కాంతార` ప్రమోషన్‌లో భాగమయ్యారు. తాజాగా ఈ సినిమాను రెండు సార్లు వీక్షించిన ప్రభాస్ తనదైన శైలిలో సోష‌ల్ మీడియా వేదిక‌గా రివ్యూ ఇచ్చారు. ఇంత‌కీ ఆయ‌న ఏం అన్నారంటే.. `కాంతార ని రెండోసారి చూశాను. అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది.

గొప్ప కథ, థ్రిల్లింగ్ క్లైమాక్స్. ఖ‌చ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిన చిత్రం ఇది` అంటూ ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ పేజ్ లో పేర్కొన్నారు. ఈయ‌న‌ రివ్యూ తో సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. మ‌రి ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

https://www.instagram.com/p/CjsezlXvd0M/?utm_source=ig_web_copy_link


Share

Related posts

Kumkuma Puvvu November 24 2023 Episode 2035: అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మ సాగర్ చెప్పినట్లుగా స్ట్రాంగ్ టీ తీసుకువచ్చి సాగర్ కు ఇస్తుందా లేదా..

siddhu

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాపై ఈ డౌట్లేంటి!

Muraliak

నయనతార పెళ్ళి అంత సింపుల్ గా చేసుకోబోతుందా ..?

GRK