Prabhas: బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రభాస్ కు కలిసి రాలేదు. సాహో హిందీలో సూపర్ హిట్ అవ్వగా.. తెలుగులో పరాజయం పాలైంది. తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వగా.. అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో వచ్చిన ఆది పురుష్ తో పాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాతో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. ఇద్దరు పెద్ద డైరెక్టర్లు కావడంతో ఈ సినిమాల కోసం ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే వచ్చే ఏడాది జవనరి 12న సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది. ఇక దీనితో పాటు సలార్ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు. అయితే ప్రభాస్ తాజాగా ముంబై బాంద్రాలో ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ప్రభాస్ స్లిమ్ లుక్ లో కనిపించాడు. దీనిని చూసిన నెటిజన్లు ప్రభాస్ స్లిమ్ లుక్ కోసం ప్రభాస్ ఇలా తయారయ్యాడని కామెంట్స్ పెడుతున్నారు.
ఈ ఫోటోలో ప్రభాస్ బాగా బరువు తగ్గాడు. దీంతో సలార్ లో రెండు పాత్రలు ఉంటాయని, ఆ పాత్ర కోసం ప్రభాస్ ఇలా మేకవర్ అయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ అలా స్లిమ్ గా కావడం వెనుక కారణం ఏంటి.. స్లిమ్ గా ఎందుకు అయ్యాడనే విషయం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.