Pragathi Aunty Star Maa Serial October 24: దూకుడు సినిమా లో సమంత వాళ్ళ అమ్మ పాత్ర లో నటించిన ప్రగతి చేసిన కామెడీ మనం మర్చి పోలేం . మీరు మోడరన్ డ్రెస్ వేసుకోండని మహేష్ బాబు అంటే సిగ్గు పడటం అందరినీ నవ్విస్తుంది. తెలుగు లో ఆమె నటన పాత్రకి అతికి నట్లు ఉంటుంది. ఆమె తరుచు జిం లో వర్క్ అవుట్ లు చేస్తూ పెట్టె ఫోటో లను అంటా చూసే ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమ లో హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి కి పరిచయం అక్కర లేదు. తన నటనతో, వాక్చాతుర్యంతో ఎంతోమంది ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈమె కరోనా తర్వాత సినిమాలలో అవకాశాలు లేక సోషల్ మీడియాకే పరిమితమై.. తనకు సంబంధించిన అనేక ఫోటోలను, విశేషాలను నెట్టింట షేర్ చేస్తూ వచ్చింది.

ఏజ్ కారణం గా బాడీ ని ఫిట్ గా ఉంచుకునే ఆమె వర్కౌట్లు చేస్తూ.. జిమ్ములో విన్యాసాలు చేస్తూ ఆశ్చర్య పరచిన ప్రగతి..తన గ్లామరస్ ఫోటోషూట్లతో కూడా యువతను కిర్రెక్కిస్తోంది . అంతేకాక అభిమానుల మధ్య కోలాహాలంగా తీన్మార్ డాన్స్ వేసి మరి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనితో ఆమె కి బాగా పాపులారిటీ కూడా వచ్చింది. సిటీమార్ సినిమాలో తన పాత్ర తో అదరగొట్టిన ప్రగతి ఆంటీ ఇప్పుడు మంచి సినిమా అవకాశాల కోసం చూస్తోంది .

సినిమాలలో అవకాశాలు సన్నగిల్లుతూ తగ్గుతున్ననేపధ్యం లో నెమ్మదిగా సీరియల్స్ వైపు అడుగులు వేస్తోందని సమాచారం. సినిమాల్లో అవకాశాలు తగ్గిన వారు సీరియల్ లో నటిచడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది అలా సినిమాలలో అవకాశాలు లేక సీరియల్స్ లో నటిస్తూ సత్తా చాటుతున్నారు కదా. ఇప్పటికే ఇంద్రజ, రాశీ ఇలా ఎంతోమంది సీనియర్ నటీమణులు సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తుండగా.. ఇప్పుడు ప్రగతి కూడా కొత్త సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అవ్వడానికి రెడీ అవుతున్నారు. జాగా స్టార్ మా లో ప్రసారం కానున్న ఒక సీరియల్ లో ప్రగతి నటిస్తున్న కొత్త సీరియల్ కి సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో హీరోయిన్ కి అత్త గారి పాత్రలో ప్రగతి నటిచనుంది. ఈమెది అహంకారం ఉన్న అత్తగారి పాత్ర అనీ ఆ అహం ను కోడలు ఎలా దించి వేసింది అన్నది కథలో తెలుస్తుందని అంటున్నారు. ఈ ప్రోమో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన చాలామంది ప్రగతి కూడా సీరియల్స్ లోకి వచ్చేసావా అనుకుంటున్నారు. సీరియల్స్ లో ప్రగతికి మంచి డిమాండ్ ఉంటుందంటున్నారు. ఈమె ను తట్టుకోవడం ఇతర నటీమణులకు కష్టమే..ప్రగతి సీరియల్ నటిగా కూడా మంచి ప్రగతి సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆవిధం గా అభిమానులు ఆమెకు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ప్రగతి ఇప్పుడు సీరియల్స్ తో కూడా దరగొడుతుందని ఆశిద్దాం.