ప్రగ్యా జైస్వాల్.. ఈ అందాల భామ ఇటీవల సోషల్ మీడియా వేదికగా అరాచకం సృష్టిస్తోంది. తరచూ మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. అందాల ఆరబోతలో ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా రచ్చ చేస్తోంది.

తాజాగా కూడా మోకాళ్ళకు పైకుండే తళుకుబెళుకుల డ్రెస్ ను ధరించి చేతిలో చిన్ని హ్యాండ్ బ్యాగ్ మరియు హై హీల్స్ వేసుకుని రెచ్చగొట్టే విధంగా ప్రగ్యా సోకుల విందు చేసింది. ఈ బ్యూటీ తాజా పిక్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి.

అయితే ఇంతలా అందాలు అరబోసినా ఏం లాభం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఆకట్టుకునే అందం, అంతకుమించి టాలెంట్ ఉన్నా ఈ అమ్మడి కెరీర్ అనుకున్నంత సజావుగా సాగడం లేదు.

కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో నటసింహం నందమూరి బాలకృష్ణ కు జోడిగా `అఖండ` సినిమాలో నటించే అవకాశం దక్కింది. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత ప్రగ్యా దశ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా జరుగుతోంది. ఆమెకు పెద్దగా ఆఫర్లు ఏమీ రావడం లేదు.

అఖండ తర్వాత ప్రగ్యా నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. మరి ఈ బ్యూటీ కెరీర్ ఎప్పటికి ఊపందుకుంటుందో చూడాలి.

https://newsorbit.com/cinema/pragya-jaiswal-latest-glamorous-photos.html