Prema Entha Madhuram Today Episode 1081: నువ్వేమీ బాధపడకు ఆర్య, స్టాఫ్ ని ఇంటికే రమ్మన్నాను మీటింగ్ అక్కడే జరుగుతుంది పదా అని ఆర్య ని తీసుకొని జెడి వెళ్ళిపోతాడు. ఏదో జరుగుతుంది మానసి నేను ఇటు నుంచి ట్రై చేస్తాను నువ్వు నేరుగా వెళ్లి ఆర్య ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది గమనించు అని ఛాయా అంటుంది. మా బ్రో ఇలా ఏది చేసినా డైరెక్ట్ గా చేస్తాడు కానీ ఇలా దాక్కొని చెయ్యడు సరే నేను ఇదే కార్లో ఫాలో అయితే డౌట్ వస్తుంది నేను వేరే ఆటోలో నుంచి ఫాలో అవుతాను అని మానసా దిగి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే అభయ్ అక్కి మీ హోం మార్కు అన్ని పూర్తి అయిపోయాయా అని అను అడుగుతుంది.

అక్కి ఏమి రాయట్లేదమ్మా అని అభయ్ అంటాడు. ఎందుకు ఏం జరిగింది అడుగుదాం పద అని వాళ్ళ అమ్మ అక్కి దగ్గరికి వచ్చి ఏమైందమ్మా ఎందుకు హోంవర్క్ రాయట్లేదు డల్ గా ఉన్నావ్ ఏంటి అని అడుగుతుంది అను. నేను చెప్తానమ్మా పొద్దున మేము స్కూల్ కి వెళ్తుంటే అక్కడ పేరెంట్స్ పిల్లల్ని ఎత్తుకొని ఆడించడం చూసి అక్కి అలాగే నాన్న కావాలి మనము కూడా నాన్నతో ఆడుకోవాలి పేరెంట్స్ మీటింగ్కి తీసుకురావాలి మనం డాడీ తో ఆనందంగా ఉండాలి అని అడిగింది. తనకే కాదమ్మా నాకు కూడా అలాగే అనిపిస్తుంది నాన్నతో ఆడుకోవాలి నాన్నతో బయటికి వెళ్లాలి నాన్న మనతో ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం నువ్వేమో చెప్పవు అని అభయ్ బాధపడుతూ వాళ్ళ అమ్మతో అంటాడు.

అవునమ్మా డాడీ మాకు కావాలి మాతో ఉండాలి ఎందుకమ్మా డాడీ మనతో ఉండడు మేమంటే ఇష్టం లేదా డాడీ కి అని అభయ్ అంటాడు.పిల్లలు అలా అనగానే అను ఏమీ మాట్లాడకుండా వెళ్లి రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య ఏమి అడగకు అమ్మ ఏడుస్తుంది నాన్న వేరే కంట్రీస్ లో ఉన్నాడని చెప్పింది కదా ఎక్కడ ఉన్నాడో మనమే తెలుసుకుందాం మా ఫ్రెండు ఆర్య ని అడిగితే తను వెతికి పెడతాడు మన డాడీని ఇంకెప్పుడూ అమ్మను బాధ పెట్టొద్దు అమ్మ ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య వెళ్లి ఓదారుదo పద అని ఆకాంక్ష అంటుంది.కట్ చేస్తే చాయా ఆర్య డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు వీడియో తీసిది అది తెచ్చి వాళ్ళ అన్నయ్యకు చూపెడుతుంది.

ఆ వీడియో చూసినా జలంధర్ ఏమిటమ్మా ఆర్య మాసిపోయిన బట్టలు వేసుకొని వచ్చి మళ్ళీ తన బట్టలు మార్చుకొని ఎక్కడికి వెళ్లాడు ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలి అంటే ఆర్యా ని ఫాలో అయితేనే తెలుస్తుంది అసలు సూర్య ఏమయ్యాడు ఎక్కడికి వెళ్లాడు తెలుసుకోవాలన్న వాళ్ళ ఇంటికి వెళితేనే తెలుస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్లి తెలుసుకుందామని జలంధర్ సూర్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు.కట్ చేస్తే పిల్లలు వాళ్ళ నాన్న కోసం ఎంత ఆరాటపడుతున్నారు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది కానీ ఏం లాభం వాళ్లకు నాన్నను చూపించలేను ఆయన దగ్గరికి వీళ్లను తీసుకువెళ్లలేను ఇప్పుడు ఏం చేయను అని అను ఏడుస్తుంది. అను అలా బాధపడుతూ ఉండగా పిల్లలిద్దరూ వచ్చి అమ్మ అంతా అక్కివల్లనే ఇంకెప్పుడూ నాన్న గురించి అడగము నువ్వు ఏడ వద్దమ్మా మమ్మల్ని క్షమించమ్మా అని అంటారు. అన్నయ్య నేనేం చేశాను ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ని చూసె సరికి అలా బాధేసి అడిగాను ఇంకెప్పుడు అడగను అని ఆకాంక్ష అంటుంది.

అయితే అక్కి అమ్మకి సారీ చెప్పు 50 గుంజీలు తీసి అని అభయ్ అంటాడు. అమ్మో 50 గుంజిల్లా అన్నయ్య దీనికంటే అమ్మకు గిలిగింతలు పెడితే నవ్వేస్తుంది కదా అని పిల్లలిద్దరూ కలిసి అనుకి చెక్కిలిగింతలు పెడతారు. పిల్లలు అలా చేసేసరికి బాధనంతా మరిచిపోయి అను నవ్వేస్తుంది హమ్మయ్య అన్నయ్య అమ్మ ఏడుపు ఆపేసి నవ్వేసింది క్షమించేసినట్టే అని ఆకాంక్ష అంటుంది. సరే మనం అందరం కలిసి నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి రేపు పూజ చేపిద్దామనుకుంటున్నాను అందరికీ భోజనాలు పెడదామనుకుంటున్నాను అందుకే నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆర్డర్ ఇద్దాము అని అను అంటుంది. అయితే నాకు ఇష్టమైన సీట్లు కూడా చేయిస్తావా అని ఆకాంక్ష అంటుంది. అలాగే చేస్తాను పద అని వాళ్ళందరూ కలిసిసుగుణ వాళ్ళ ఇంటికి వస్తారు.అరే ఎప్పుడొచ్చారు అని సుగుణ అంటుంది. నాయనమ్మ నీకు ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యం బాగుందా టాబ్లెట్ వేసుకున్నావా అని అభయ్ అంటాడు.
బాగానే ఉంది నాన్న నీకు ఏం కావాలో చెప్పండి చకచకా చేసి పెడతాను అని సుగుణ అంటుంది. ఆంటీ ఇప్పుడు అవన్నీ ఏమీ అక్కర్లేదు నీతో మాట్లాడదామని వచ్చాను నవరాత్రులు మొదలయ్యాయి కదా ఇంట్లో కుంకుమ పూజ జరిపిద్దామని అనుకుంటున్నాను అలాగే మా కాలనీ వాళ్ళందరికీ భోజనాలు పెడదామని అనుకుంటున్నాను అందుకని ఆర్డర్ ఇద్దామని వచ్చాను ఆంటీ సామాన్లకి సరిపోయే అంత ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి డబ్బులు ఇస్తాను అని అను అంటుంది. అయ్యో నీ దగ్గర డబ్బులు ఎందుకు అమ్మ నువ్వు ఏమైనా పరాయి దానివా అని సుగుణ అంటుంది. ఇప్పుడు డబ్బులు తీసుకోకపోతే సామాన్లకు డబ్బులు ఎలా వస్తాయి వంట ఎలా చేసి పెడతావు అని జ్యోతి అంటుంది. ఆంటీ నేను వెళ్తున్నాను అని అను అంటుంది.

సరేలేమ్మా ఎంతో కొంత ఇవ్వు నువ్వు అంతలా బాధపడుతున్నావ్ కాబట్టి ఎంత ఇచ్చిన తీసుకుంటాను అని సుగుణ అంటుంది. అలా అన్నారు బాగుంది అని అను డబ్బులు సుగుణ కి ఇస్తుంది.కట్ చేస్తే జలంధర్ రౌడీలకు ఫోన్ చేసి రేయ్ నేను ఆ ముసలి దాని ఇంటికి వెళ్తున్నాను ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తాను మీరు అందుబాటులో ఉండండి అని అంటాడు. సరే ఆంటీ ఇక లేటవుతుంది మేం బయలుదేరుతాం పొద్దుగాల చాలా పనులు ఉన్నాయి అని అను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అను ఆటో ఎక్కి అలా వెళ్ళిపోగానే జలంధర్ కార్లో నుంచి దిగుతాడు. వచ్చింది ఎవరా అని సుగుణ వెనకకు తిరిగి చూస్తుంది.ఎవరండీ మీరు ఏం కావాలి ఎందుకు వచ్చారు అని సుగుణ అడుగుతుంది.

ఈ పేపర్ల మీద నీ సంతకం కావాలి పెడతావా అని జలంధర్ అంటాడు. ఓ నువ్వేనా ఇన్ని రోజులు రౌడీలను పంపించావు ఇప్పుడు నువ్వే డైరెక్ట్ గా వచ్చావా ఎవర్ని పంపించినా సరే నేను నా స్థలాన్ని అమ్మను అని సుగుణ అంటుంది. కాటికి పోయే కాలంలో నీకి పోయేకాలం ఏంటే ముసలిదానా నువ్వు కాదు కూడదు అని అరిస్తే నీ కుటుంబాన్ని నిన్ను చంపైనా సరే ఆ ల్యాండ్ సొంతం చేసుకుంటాను అని జలంధర్ బెదిరిస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది