Prema Entha Madhuram november 11 episode1097: ఏంట్రా సూర్య వాళ్లు అలా ఇద్దరు కోపంగా వెళ్ళిపోయారు అని సుగుణ అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు అమ్మ నేను చూసుకుంటాను అని ఆర్య అంటాడు. నువ్వు ఉన్నావనే రా నా ధైర్యం అంతా ఇక మీదట అన్ని నువ్వే చూసుకో సూర్య అని వాళ్ళ అమ్మ అంటుంది. ఉష అమ్మని లోపలికి తీసుకువెళ్ళు అని ఆర్య అంటాడు. అలాగే అన్నయ్య అని ఉష వాళ్ళ అమ్మని తీసుకొని లోపలికి వెళుతుంది. ఆర్య నీరజ్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. ఇక్కడే పక్కనే ఉన్నాను దాదా అని నీరజ్ అంటాడు. అక్కడే ఉండు నేను వస్తున్నాను అంటూ ఆర్య నేరజ్ దగ్గరికి వెళ్తాడు. ఆర్య ఎక్కడికో వెళుతున్నాడని దివ్య తన వెనకాల ఫాలో అయ్యి అక్కడికి వస్తుంది. ఎవరు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అతని ఎందుకు కలుస్తున్నావు అతను నీకెందుకు చెక్ ఇస్తున్నాడు అసలు నిజంగానే నువ్వు మా సూర్య అన్న వేనా అని దివ్య ప్రశ్నిస్తుంది.

అంటే దివ్య నేను ఇతని కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను ఇతను ఆర్య వర్ధన్ ఇండస్ట్రీకి మేనేజర్ నేను ఏదైనా బిజినెస్ చేస్తానంటే హెల్ప్ చేస్తానన్నారు అమ్మ అందుకే ఇలా వచ్చాడు అని ఆర్య అంటాడు. అవునండి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ జాబ్ ఇచ్చి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాం అంటే కూడా హెల్ప్ చేస్తున్నాం అలాగే మీ అన్నయ్య కూడా హెల్ప్ చేస్తున్నాను అని రాజ్ అంటాడు. ఓ అవునా సారీ అండి ఇంకెవరో అనుకొని అలా అడిగేసాను ఏమీ అనుకోకండి అని దివ్య అంటుంది. సార్, మీ చేతుల మీదుగానే మా చెల్లెలికి చెక్ ఇవ్వండి సార్ అని ఆర్య అంటాడు. అలాగే అని నీరజ్ దివ్యకి చెక్కు ఇస్తాడు. చెక్కు తీసుకొని దివ్య థాంక్స్ అండి అని వెళ్ళిపోతుంది. దాదా అయిదు నిమిషాలకే నేను ఇంతలా టెన్షన్ పడిపోతున్నాను నువ్వు రోజంతా ఎలా మేనేజ్ చేస్తున్నావు అని నీరజ్ అంటాడు. మేనేజ్ చేయాలి నీ రాజు ఎందుకంటే మాట ఇచ్చాను కదా సూర్య వాళ్ళ చెల్లెలకి పెళ్లి లై వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయ్యేదాకా ఎలాగో అలా మేనేజ్ చేయాలి అని ఆర్య అంటాడు.

ఓకే దాదా నేను బయలుదేరుతాను అని నీరజ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అను ఇంట్లోకి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా సామాన్లు పడి ఉంటాయి. ఏంటి అను ఇల్లంతా చిందర వందరగా ఉంది ఎవరు వచ్చారు దొంగతనం ఎవరు చేశారు అని అనుకుంటున్నావా అని ఛాయా అంటుంది. ఓ ఈ దొంగ పని మీదేనా అని అను అంటుంది. మేము దొంగలం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అను అని ఛాయా అంటుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి ఇల్లంతా ఇలా చిందరవందలుగా చేస్తే దొంగలు అనక ఏమంటారు అని అను అంటుంది. నువ్వు ఈ పేపర్ల మీద సుగుణతో సంతకం పెట్టించాలి అని ఛాయా అంటుంది. నేనెందుకు పెట్టించాలి అని అను అంటుంది. ఎందుకంటే నువ్వు సుగుణకి చాలా క్లోజ్ కాబట్టి ఆర్య కూడా సూర్యా పేరుతో ఆ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఆ విషయం నీకు కూడా తెలుసు కాబట్టి నువ్వు సంతకం పెట్టించాలి అని మానస అంటుంది. ఆర్య వర్ధన్ భార్య ఒకరికి సహాయం చేస్తుంది కాని కీడు తలపెట్టదు నేను అలాంటి పని చేయను అని అను అంటుంది.

అయితే నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే పెట్టిస్తావా అని మానస వీడియో కాల్ చేసి రౌడీలను చూపెడుతుంది. ఛాయా నా పిల్లలని ఏమీ చేయదు మీరు చెప్పినట్టే చేస్తాను అని అను అంటుంది. అయితే వెంటనే సుగుణని మీ ఇంటికి రమ్మని చెప్పు వచ్చాక ఈ పేపర్ల మీద సంతకం పెట్టించి మాకు ఇవ్వు అని చాయ్ అంటుంది. అలాగే అని సుగుణకి అను ఫోన్ చేసి ఆంటీ మీరు అర్జెంటుగా మా ఇంటికి ఒకసారి రండి ఆంటీ వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకురండి ఎందుకంటే బయట సేఫ్టీగా లేదు అని అను ఫోన్లో అంటుంది. కొద్దిసేపటి తరువాత రౌడీలు ఫోన్ చేసి మేడం పిల్లలని మేము కిడ్నాప్ చేద్దామనుకునే లోపు ఎవడో ఒక అతను తుఫాను లాగా వచ్చి మమ్మల్ని కొట్టి పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు మేడం ఆ దెబ్బలకు తట్టుకోలేక మేము పారిపోయి వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాము మేడం అని రౌడీలు అంటారు. ఇదంతా ఎలా జరిగింది అని ఛాయా అడుగుతుంది.

అప్పుడు అను ఫోన్లో మాట్లాడింది ఎవరితోటో ఛాయా కి చెప్తుంది. అంటే తెలివిగా మీ ఆయనకు ఫోన్ చేసి ఆంటీ లాగా మాట్లాడావా నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని ఛాయా అంటుంది. కట్ చేస్తే, ఏంటి అక్కి వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు పిల్లలని తీసుకు రమ్మంటుంది అంటే పిల్లలకు ఏదో జరగబోతుంది అని ఆర్య అక్కడే ఉండి పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండగా.రౌడీలు పిల్లలు స్కూల్లో నుంచి బయటికి రాగానే కిడ్నాప్ చేస్తారు. వెంటనే కారుకి అడ్డంగా నిలబడి వాళ్ళని చితక్క కొట్టి పిల్లల్ని కాపాడుతాడు ఆర్య. పిల్లలు ఇంకెప్పుడైనా స్కూల్ వదిలిపెట్టగానే లోపలే ఉండండి మీ అమ్మ వచ్చేదాకా బయటికి రాకండి అని ఆర్య అంటాడు. రోజు అలాగే లోపల ఉంటాం ఫ్రెండ్ కానీ ఈరోజు అక్కి ఐస్క్రీమ్ అడిగిందని ఇలా బయటికి వచ్చాము ఇలా జరుగుతుందని మాకు మాత్రం ఏం తెలుసు ఫ్రెండ్ అని అభయ్ అంటాడు. సరే సరే ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి మీ అమ్మ వస్తేనే బయటికి రండి అని ఆర్య అంటాడు. నువ్వు హీరో లాగా వాళ్ళని భలేగా కొట్టావు ఫ్రెండ్ అని ఆకాంక్ష అంటుంది. కట్ చేస్తే, నా భర్త దూరంగా ఉన్న నాకు అండగానే ఉంటాడు ఆర్య వర్ధన్ ఫ్యామిలీ జోలికి వస్తే ఏం జరుగుతుందో చూశారు కదా అని అను అంటుంది.

వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే. అను కుర్చీలో కూర్చొని చిటిక వేసి మరీ పిలిచి ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళండి అని అను అంటుంది. మేమెందుకు చెయ్యాలి పిచ్చిపిచ్చిగా ఉందా అని ఛాయా అంటుంది. మీరే చెయ్యాలి లేదంటే కిడ్నాప్ చేశారని దొంగతనం కేసు కింద మిమ్మల్ని అరెస్టు చేయిస్తాను అని అను వాళ్ళని బెదిరిస్తుంది. ఛాయా మనం చేసి వెళ్లాల్సిందే లేదంటే పరిస్థితి చేయి జరి పోతుంది తెగే దాక లాగకు అని మనసా అంటుంది. నావల్ల కాదు నేను చెయ్యను అని ఛాయా అంటుంది.అయితే పోలీసులకు ఫోన్ చేస్తాను అని అను అంటుంది. వద్దు వద్దు అను చేస్తాము అని వాళ్ళిద్దరూ టకటక సామాన్ ఎక్కడి ఎక్కడ సదిరి వెళ్ళిపోతారు. చూడండి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి ఈసారి వదిలిపెట్టాను గాని ఇంకొకసారి ఇలా జరిగితే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది అను.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది