Prema Entha Madhuram november 13 2023 episode 1098: ఇంతలో అను ఆర్య కి ఫోన్ చేస్తుంది. పిల్లలు మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు మాట్లాడండి అని అంటాడు. అభయ్ ఫోన్ తీసుకొని హలో అమ్మ మేము బాగానే ఉన్నాము రౌడీలు వచ్చి మమ్మల్ని తీసుకు వెళ్తుంటే మా ఫ్రెండు వచ్చి వాల్లని కొట్టి మమ్మల్ని కాపాడాడు మేము బాగానే ఉన్నాం అమ్మ అని అభయ్ అంటాడు. సరే నాన్న మీ ఫ్రెండ్ కి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటుంది అను. హలో చెప్పండి అని ఆర్య అంటాడు. సమయానికి వెళ్లి పిల్లల్ని కాపాడినందుకు మీకు థాంక్స్ అండి అని అను అంటుంది. మరేం పర్వాలేదండి కానీ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్తారా పిల్లల్ని కిడ్నాప్ చేయాలని ఎవరు అనుకున్నారు వాళ్ళు ఎవరో చెప్పండి నేను చూసుకుంటాను అని ఆర్య అంటాడు. అను చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. సరేనండి నేను పిల్లలను తీసుకుని వస్తాను కదా అప్పుడు మాట్లాడుకుందాం అని ఆర్య ఫోన్ కట్ చేస్తాడు.

అయ్యో సార్ ఇక్కడికి వస్తే నన్ను చూస్తారు ఎలా అని అను టెన్షన్ పడుతూ ఉండగా, ఇంతలో సుగుణ వచ్చి అను ఈరోజు అట్లతద్ది కదా అమ్మ వారి గుడిలో పూజ ఉంది మా ఇంటి దగ్గర కూడా పూజ ఉంది రా మా ఇంటికి వెళ్దామని అంటుంది. ఆంటీ ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు నేను రాలేను వాళ్లు వచ్చాక స్నాక్స్ అంటారు లేటవుతుంది నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని అను అంటుంది. ఏం పర్వాలేదండి అను గారు పిల్లలు వచ్చాకే వాళ్లకు స్నాక్స్ పెట్టి ఫ్రెష్ అయ్యాక తీసుకొని వెళ్దా నాక్కూడా ఆకలి వేస్తుంది అమ్మ నువ్వు స్నాక్స్ చెయ్యి అని ఉష అంటుంది. అను నువ్వు ఇంకేం చెప్పకు నేను వెళ్లి స్నాక్స్ చేస్తాను నువ్వేమన్నా పరాయి దానివా మా ఇంట్లో మనిషివి అనుకుంటున్నా మమ్మా అని సుగుణ పెళ్లి స్నాక్స్ చేస్తుంది. ఆర్య పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు. సార్ ఇంట్లోకి వస్తే వీళ్ళు ఇక్కడ ఉన్న సంగతి తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అని గబగబా డోర్ దగ్గరికి వచ్చి ముసుగు వేసుకొని నిలబడుతుంది.

పిల్లలు బయటనుంచి అమ్మ అనుకుంటూ అను దగ్గరికి వెళ్తారు. పిల్లలు తీసుకొచ్చినందుకు మీకు చాలా థాంక్స్ అండి అని అను అంటుంది. పర్వాలేదండి పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారో చెప్పండి వాళ్ల సంగతి నేను చూసుకుంటాను అని ఆర్య అంటాడు. ఇప్పుడు సార్ కి ఈ విషయం చెప్తే ప్రాబ్లం అయిపోతుంది అని అను చెప్పకుండా, ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో నీకు ఏమీ చెప్పలేనండి నన్ను క్షమించండి అని అను అంటుంది.పిల్లలు వెళ్లి బ్యాగులు లోపల వేసి ఫ్రెష్ అవుతూ ఉంటారు. అమ్మ పిల్లలు వచ్చి ఫ్రెష్ అప్ అవుతున్నారనుకుంటా నేను వెళ్లి పలకరిస్తాను అని ఉష గుమ్మం దగ్గర ముసుగు వేసుకొని ఉన్న అనుని చూసి అను దగ్గరికి వస్తుంది, ఇంతలో ఆర్య పర్వాలేదండి మీరు దేనికో ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు నాకు ఆ విషయం అర్థమైంది ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి పిల్లలు జాగ్రత్త అని ఆర్య వెళ్ళిపోతాడు. సరేనండి అని అను ఆర్య కి నమస్కారం పెడుతుంది.

అను గారు కార్లో వచ్చింది ఎవరు అని ఉష అడుగుతుంది. అక్కి వాళ్ళ ఫ్రెండ్ అంట తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు అని అను అంటుంది. అది సరే అను గారు మీరెందుకు ఇందాక మూసుకు వేసుకున్నారు అని ఉషా అడుగుతుంది. కొత్త వాళ్లు కదా ఇబ్బంది పడతానని వేసుకున్నాను అని అను అంటుంది. ఏమిటో నండి మీ తీరు నాకేమీ అర్థం కావట్లేదు అని ఉష అంటుంది. ఇంతలో సుగుణ వేడివేడి పకోడి తెచ్చి పిల్లలకు పెడుతుంది. నాయనమ్మ నువ్వెప్పుడొచ్చావు అని ఆభయ్ అంటాడు. ఇప్పుడే వచ్చాను నాన్న మనం మా ఇంటికి వెళ్తున్నాము అని సుగుణ అంటుంది. నాయనమ్మ ఇందాక స్కూల్ దగ్గర మమ్ముల ఎవరో బ్యాడ్ అంకుల్స్ కిడ్నాప్ చేయబోతే మా ఫ్రెండ్ వచ్చి వాళ్ళని కొట్టి మమ్మల్ని కాపాడి తీసుకువచ్చాడు అని ఆకాంక్ష చెప్తుంది. అక్కి ఇవన్నీ ఇప్పుడు ఆంటీకి ఎందుకు చెప్తున్నావు ఆంటీ పిల్లలు ఏదో కథ చెప్తున్నారు అని అను అంటుంది. లేదు అనుగారు పిల్లలు ఎందుకు అబద్దం చెప్తారు ఏం జరిగిందో చెప్పండి అని ఉష అడుగుతుంది. ఏమీ లేదు ఉషా నిజంగా ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా అని అను అంటుంది.

చూడు అను నువ్వు ఏదో దాస్తున్నావు నిజం ఏంటో మాకు చెప్పు అని సుగుణ గట్టిగా నిలదీస్తుంది. పిల్లలు మీరు వెళ్లి బయట తినండి అని పిల్లల్ని పంపిస్తుంది అను. ఇప్పుడు చెప్పు అను ఏం జరిగింది అని సుగుణ అడుగుతుంది. అను స్కూల్లో జరిగిందంతా చెప్తుంది. అయ్యో మావల్ల నీకు ఇబ్బందులు వస్తున్నాయా అమ్మ ఈ విషయం మా అబ్బాయికి చెప్పి వాళ్ళ సంగతి చూడమంటాను అని సుగుణ అంటుంది. ఆంటీ ఇప్పుడు ఏమీ లేదు కదా బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఆ విషయం మీ అబ్బాయికి ఏమి చెప్పొద్దులేండి అని అను అంటుంది. అయితే అను కొన్నాళ్లు నువ్వు మా ఇంట్లో ఉండు ఇక్కడే ఉంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇబ్బంది పెడతారు అని సుగుణ అంటుంది. ఆంటీ నేను ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు ఏం పర్వాలేదు నేను రాలేను అని అను అంటుంది. నువ్వు దేనికి ఇబ్బంది పడుతున్నావు నాకు అర్థమైంది అను గారు అని ఉష అంటుంది.చూడమ్మా అను నువ్వు ఇంక నాకేం చెప్పేది ఏమీ లేదు నేను వినేది లేదు నువ్వు మా ఇంటికి వస్తున్నావు అంతే ఉష వెళ్లి బట్టలు సర్దు తీసుకు వెళ్దామని పిల్లల దగ్గరికి వెళ్లి, పిల్లలు కొన్నాళ్లు మా ఇంట్లోనే ఉంటారు మీరు తొందరగా మీ బట్టలు సర్దుకోండి అని సుగుణ అంటుంది.

ఆంటీ నేను చెప్పేది వినండి అర్థం చేసుకోండి ఆంటీ అని అను అంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ కొన్నాళ్లు నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉందా మామ నాయనమ్మ మంచి మంచి కథలు చెప్తుంది ఉషాకు తో మేము ఆడుకుంటాము అని పిల్లలు ఆడుతారు. అభయ్ నీకు ఏమీ తెలియదు అక్కడికి మనం ఏమి అవసరం లేదు అని అను అంటుంది. అను ఒక్కసారి నేను చెప్పేది కూడా అర్థం చేసుకో అమ్మ అని సుగుణ అంటుంది. అయ్యో ఆంటీ ఎంత చెప్పినా వినట్లేదే ఇప్పుడేం చేయాలి సార్ కూడా అక్కడే ఉంటాడు అని అను టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే ఆర్య నీరజ్ వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఉష ఫోన్ చేసి అన్నయ్య ఈరోజు అట్లతద్ది అందరం ఉపవాసం ఉన్నాము నువ్వు కూడా పొద్దుట్నుంచి ఏమి తినకుండా వెళ్ళిపోయావు కదా త్వరగా వచ్చేయ్ అన్నయ్య అని ఉష అంటుంది. అలాగే అమ్మ అని ఆర్య ఫోన్ కట్ చేస్తాడు.
మీరు ఏమీ తినలేదు కథ దాదా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేద్దామా అని నీరజ్ అంటాడు. ఈరోజు అట్లతద్ది అంట అను నాకోసం ఎక్కడున్నా ఉపవాసం ఉంటుంది తను ఉపవాసం ఉంటే నేను ఎలా తింటాను అని ఆర్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మానస హాస్పిటల్ కి వెళుతుంది అక్కడ నీరజ్ డాక్టర్ తో మాట్లాడుతుండగా నిలబడి చూస్తుంది. డాక్టర్ ఈ బ్లడ్ షాంపూల్ త్వరగా టెస్ట్ చేసి వాళ్ళ డాడీ ఎవరో చెప్పండి అబ్బాయి పేరు అభయ్ అమ్మాయి పేరు ఆకాంక్ష అని నీరజ్ అంటాడు. వీళ్ళిద్దరూ కమల పిల్లల అని డాక్టర్ అడుగుతాడు. లేదు డాక్టర్ గారు అని నీరజ్ అంటాడు. కమల పిల్లలని చెప్తే ప్రాబ్లం అవుతుందని చెప్పట్లేదు నీరజ్ అని అక్కడే ఉన్న మానస అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది