Prema Entha Madhuram November 16 2023 Episode 1101: అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి అని అను ఆర్య ని అడుగుతుంది.చెప్తానండి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్లలో సూర్య ఒకడు అతనికి నా ఆఫీసులో ఉద్యోగం ఇచ్చాను ఉద్యోగం పొంది అందరూ తిరిగి వెళుతూ ఉండగా, షూటర్ నన్ను షూట్ చేస్తాడు సూర్య వచ్చి నా ప్రాణానికి తన ప్రాణం అడ్డం వేసి నన్ను కాపాడాడు,సూర్యకిచ్చిన మాట కోసం ఈ ఇంటికి వచ్చి సూర్యాగా బ్రతుకుతున్నాను అని ఆర్య అనుకి జరిగినదంతా చెప్తాడు. మీది చాలా గొప్ప మనసు అండి మీ స్థానంలో వేరొకరు ఉంటే డబ్బులు ఇచ్చి వదిలించుకునేవారు కానీ మీరు అలా చేయకుండా ఈ ఇంటికి కొడుకుగా చెల్లెళ్లకి అన్నగా నిలబడి మంచి పని చేస్తున్నారు మీకు మేలు జరుగుతుంది అని అను అంటుంది. చాలా థాంక్స్ అండి మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు కానీ పిల్లలు అమ్మకి నిజం చెప్పేస్తారేమో అని ఆర్య అంటాడు. నేను చూసుకుంటానండి మీరేం టెన్షన్ పడకండి అని అను అంటుంది. కట్ చేస్తే నాయనమ్మ మా ఫ్రెండ్ కి కార్లు ఉన్నాయి ఆయనను చూస్తే అందరూ భయపడతారు అని అక్కి చెప్తుంది.

మీ ఫ్రెండ్ పేరేంటి అని సుగుణ అడుగుతుంది. మా ఫ్రెండ్ పేరు గుర్తుకు రావట్లేదు నాయనమ్మ చెప్తాను ఉండు అని ఆభయ్ అంటాడు. మా ఫ్రెండ్ పేరు అని ఆకాంక్ష చెప్పబోతుండగా, ఇంతలో అను వచ్చి పిల్లలు మీరు ఇక్కడ ఉన్నారా ఏం చేస్తున్నారు నాయనమ్మ తో కబుర్లు చెప్తున్నారా అని అంటుంది. లేదమ్మా వీళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చాడని అతనికి కార్లు ఉన్నాయంట బిజినెస్ మ్యాన్ అంట అని చెప్తున్నారు అని సుగుణ అంటుంది.లేదు నాయనమ్మ మా ఫ్రెండ్ మా అమ్మ కూడా తెలుసు అని అభయ్ అంటాడు. ఆంటీ వీళ్ళు ఏదో కథలు చెప్తున్నారు మీరేమీ పట్టించుకోకండి అని అను అంటుంది. అమ్మ ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని ఆకాంక్ష అడుగుతుంది. చెప్తాను పదండి అని పిల్లలును తీసుకుని అను వెళ్తుంది.అమ్మ ఎందుకు నాయనమ్మకు మా ఫ్రెండ్ గురించి చెప్పనివ్వలేదు అని ఆకాంక్ష అంటుంది.

మీ ఫ్రెండ్ చాలా మంచివాడు కదా అమ్మ మిమ్మల్ని కాపాడినట్టే వీళ్లను కూడా కాపాడడానికి ఇక్కడికి వచ్చాడు, కానీ మీరు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు మీరు ఆయనని సూర్య అనే పిలవండి అని అను వాళ్ళ దగ్గర మాట తీసుకుంటుంది. అలాగే అమ్మ మేము ఎవరికీ చెప్పము కానీ మా ఫ్రెండ్ తో ఆడుకోవచ్చా అని అభయ్ అంటాడు. ఆడుకోండి కానీ సూర్య ఫ్రెండ్ అని మాత్రమే పిలవండి అని అను అంటుంది. కట్ చేస్తే అను అంతా నీ వల్లనే నేను నీరజ్ కి దూరమై బాధపడుతున్నాను, కానీ నువ్వు మాత్రం ఆర్యకి దగ్గరగా ఉండి సంతోష పడుతున్నావా అలా జరగనివ్వను, అని మానస హరీష్ కు ఫోన్ చేసి ఇప్పుడు అక్కడికి ఒక పార్సల్ వస్తుంది అది అందరి ముందు ఓపెన్ చెయ్ అని మానస అంటుంది. ఏంటది మేడం అని హరీష్ అడుగుతాడు. అది నీకు అనవసరం కానీ అను సూర్య ఒకరినొకరు చూసుకోకుండా చూడు అని మానస అంటుంది. ఓకే మేడం అని హరీష్ ఫోన్ కట్ చేస్తాడు. ఫ్రెండ్ నీ గురించి మా అమ్మ అంతా చెప్పింది మేము ఎవరికీ చెప్పము నువ్వు చాలా మంచి వాడివి ఫ్రెండ్ అని అభయ్ అక్కి ఆర్య కి ముద్దు పెడతారు. కట్ చేస్తే, దివ్య నాకు మీ అన్నయ్యకు ఒక కాఫీ తీసుకురా అని అంటాడు హరీష్. నేను ఇప్పుడు ఏమీ తినను హరీష్ కావాలంటే నువ్వు తాగు అని ఆర్య అంటాడు.

అదేంటి బావగారు ఈ రోజు ఆడవాళ్లు చేసే పూజ కథ మరి మీరెందుకు ఏమి తినట్లేదు అని హరీష్ అంటాడు. ఏది చేసినా ఆడవాళ్లే కాదు హరీష్ చేసేది మగవాళ్ళు కూడా చేయొచ్చు అందరూ ఇంట్లో ఆనందంగా ఉండాలని చేస్తున్నాను అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, అందరూ పూజ దగ్గర కూర్చుంటారు.అమ్మ అను పూజ మొదలు పెట్టు అని సుగుణ అంటుంది. అసలు ఈ అట్లతద్ది పండుగ ఎందుకు చేసుకుంటారమ్మా అని ఉషా అడుగుతుంది. అట్లతద్ది పూజ ఎందుకు చేసుకుంటారు అంటే పెళ్లి అయినా ఆడవాళ్లు భర్త కోసం సౌభాగ్యం కోసం చేస్తారు, పెళ్లి కానీ ఆడపిల్ల మంచి భర్త దొరకాలని చేస్తుంది అలా అమ్మవారికి పూజ చేసి అట్లు నైవేద్యం పెట్టి చంద్రుని చూస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం అని సుగుణ అంటుంది. మరి అట్లు మాత్రమే ఎందుకు నైవేద్యం పెడతారు అని ఉషా అడుగుతుంది. అట్లు కుజునికి ఇష్టం ఆయనకు అట్లు నైవేద్యం పెడితే ఆయన కుజదోషాలు తీసేసి భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూస్తాడు అందుకని అట్లు నైవేద్యం పెడతారు అని సుగుణ చెప్తుంది.

సరే అమ్మ నెలవంక వచ్చే టైం అయ్యింది పూజ మొదలు పెట్టండి అని ముత్తైదువులు అంటారు. అమ్మ అను హారతిని ప్లేటును అక్కడి నుంచి తీసుకువచ్చి అమ్మవారి ముందు పెట్టు అని సుగుణ అంటుంది. అక్కడే ఆర్య ఉన్నాడు తను ఎక్కడ చూస్తాడొ అని మొహం మీద మూసుకు వేసుకొని హారతి ప్లేటు తీసుకువచ్చి అమ్మవారి దగ్గర అను పెడుతూ ఉండగా,ఎక్కడి నుంచో ఒక రౌడీ పరిగెత్తుకొచ్చి అను మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని పారిపోతాడు. దొంగ దొంగ అని అందరూ అరుస్తారు. ఆ దొంగ వెనకాల ఆర్య పరిగెడతాడు. ఏంటమ్మా శుభమని అట్లతద్ది పూజ చేసుకుంటుంటే ఈ అమ్మాయి మంగళసూత్రం పోయింది ఏదైనా అరిష్టం జరుగుతుందేమో అని ముత్తయిదువుల్లో ఒక ఆవిడ అంటుంది. నేను పిల్లలు ఆయనకు దగ్గరగా ఉండడం వల్ల ఇలా జరిగి ఉంటుందా అని అను భయపడుతుంది. అమ్మ అను మళ్లీ పూజ మొదలు పెట్టమ్మా అని సుగుణ అంటుంది. సరే అని అను అమ్మవారికి పూజ చేస్తుంది.

లక్ష్మీదేవి పూజ అయిపోయింది చంద్రుడికి హారతి ఇచ్చి వాళ్ళ భర్తల మొహాలు చూడండి అని సుగుణ చెప్తుంది. జ్యోతి దివ్య అను చంద్రుడికి హారతి ఇస్తారు. దివ్య చంద్రుడికి హారతి ఇచ్చి హరీష్ ముఖం చూస్తుంది. జ్యోతి ఫోన్ లో వాళ్ళ ఆయన ఫోటో చూస్తుంది. అను ఎవరి మొఖం చూడాలని ఇబ్బంది పడుతూ ఉండగా ఇంతలో దొంగ వెనకాల పరిగెత్తికెళ్ళిన ఆర్య మంగళసూత్రాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు అను ఆర్య మొఖం చూసి భగవంతుడా మా ఆయనకి ఏమి కాకుండా చూసుకో అని అను తన మనసులో చంద్రుడికి నమస్కారం చేసుకుంటుంది. సూర్య దొంగ దొరికాడా అని సుగుణ అడుగుతుంది. దొంగ దొరకలేదు కానీ మంగళసూత్రం దొరికిందమ్మా అని వాళ్ళ అమ్మకి ఇస్తాడు ఆర్య.మంగళసూత్రం చూసిన సుగుణ అయ్యో ఈ పుస్తెలతాడు పేరుకుపోయిందే అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ నువ్వు వస్తుంది