Prema Entha Madhuram November 02 Episode 1089:అయ్యో సార్ మీరు నాకు థాంక్స్ చెప్పడం ఏంటి సార్ పర్వాలేదు అని అను అంటుంది. అమ్మ అను పొద్దున గొడవ జరగడంతో మేము అందరికీ భోజనాలు పెట్టలేకపోయాము అందరికీ భోజనాలు సరిపోయయా అమ్మ అని సుగుణ అంటుంది. అందరికీ భోజనాలు సరిపోయాయి ఆంటీ వంటలు బాగా రుచిగా ఉన్నాయి అందరూ తింటూ చాలా మెచ్చుకున్నారు అని అను అంటుంది. భోజనాలు వండింది మావాడేనమ్మా అని సుగుణ అంటుంది. అవునా ఆంటీ అందుకే అంత బాగున్నాయి ఈరోజు కడుపునిండా తృప్తిగా తిన్నాను అలా తిని ఎన్ని రోజులు అయ్యిందో అని అను అంటుంది. సరే అను ఒకసారి వీలు చూసుకొని ఇంటికి రా అని సుగుణ అంటుంది. అలాగే ఆంటీ ఉంటాను అని అను అంటుంది. సూర్య చూశావా అందరూ మెచ్చుకున్నారు అంట ఆ ప్రశంసలన్ని నీకే దక్కాలి నాన్న అని సుగుణ అంటుంది.

ఆర్య సార్ సుగుణ అమ్మ వాళ్ళ ఇంటికి సూర్య గా ఎందుకు వెళ్ళాడు అస్సలు ఏం జరిగి ఉంటుంది కారణం లేకుండా సార్ అలా చేయడు కదా అని అను ఆలోచిస్తుంది. కట్ చేస్తే,అక్కి అభయ్ చాలా పొద్దుపోయింది పడుకోండి అని అంటుంది. అలాగే అమ్మ అని ఆకాంక్ష అంటుంది. పడుకోబోయే ముందు మా ఫ్రెండ్ కి ఒకసారి ఫోన్ చేస్తాను అని ఆకాంక్ష ఆర్య కి ఫోన్ చేసి ఏంటి ఫ్రెండ్ ఈరోజు నన్ను కలవడానికి రాలేదు నువ్వు కూడా మా ఫ్రెండు లాగే అయిపోయావు స్కూల్లో వాడికి ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ పరిచయమైతే నాతో వాడు మాట్లాడడు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అని ఆకాంక్ష అంటుంది. అదేమీ లేదు అక్కి పనిలో కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను అని ఆర్య అంటాడు. అయితే రేపు నన్ను కలవడానికి స్కూల్ దగ్గరికి వస్తావా అని ఆకాంక్ష అంటుంది. అలాగే వస్తానమ్మా అని ఆర్య ఫోన్ కట్ చేస్తాడు. అక్కి అమ్మ పడుకోమని చెప్పింది కదా ఎవరికి ఫోన్ చేస్తున్నావ్ అని అభయ్ అంటాడు.

ఏమీ లేదన్నయ్యా మా ఫ్రెండ్ ని స్కూల్ దగ్గరికి రమ్మన్నాను అని ఆకాంక్ష అంటుంది. అక్కి అమ్మ వచ్చేస్తుంది పడుకో అని ఆభయ్ అంటాడు. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది అక్కి అభయ్ రెడీ అయ్యారా స్కూల్ కి లేట్ అవుతుంది పదండి నేను స్కూల్ కి టిఫిన్ తెస్తాను అని అను అంటుంది. అలాగే అమ్మ అని ఆకాంక్ష అంటుంది. అక్కి ఆ చైన్ నీ మెడలో ఎందుకు ఉంది ఎప్పుడు తీసావు అని అను అంటుంది. అంటే అమ్మ నిన్న డిజైన్ పేపర్ల కోసం వెతికినప్పుడు దొరికింది ఇది నాకు చాలా నచ్చింది అందుకే మెడలో వేసుకున్నాను అని ఆకాంక్ష అంటుంది. అక్కి అది నీ మెడలో ఉంటే ఎక్కడైనా పోతుంది తీసేయమ్మా అని అను అంటుంది. అమ్మ నేను ఎక్కడా పోగొట్టను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆకాంక్ష అంటుంది.ఆ దండ ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది కదమ్మా అది మన ఫ్యామిలీకి సంబంధించింది ఎవరికీ చూపించనని నాకు ప్రామిస్ చెయ్ అని అను అంటుంది. అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టు ఈ దండని ఎవరికి చూపించను అని ఆకాంక్ష వాళ్ళ అమ్మకి మాట ఇస్తుంది. కట్ చేస్తే,ఆకాంక్ష ఆర్య కోసం స్కూల్లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి అక్కీ మీ ఫ్రెండ్ కోసం చూస్తున్నావా అని అభయ్ అంటాడు.

అవును అన్నయ్య మా ఫ్రెండ్ వస్తే ఈ చైన్ చూపించి అందులో డాడీ ఉన్నాడు కదా డాడీ ఎక్కడున్నాడో తెలుసుకోమని చెబుదాం అనుకున్నాను కానీ అమ్మ ఎవరికీ చూపించోద్దని ప్రామిస్ చేయించుకుంది కదా ఇప్పుడు ఎలా అన్నయ్య అని ఆకాంక్ష అంటుంది. అక్కి అమ్మ చెప్పినట్టు అది మన ఫ్యామిలీ మ్యాటర్ కదా ఇంకెవరికి చూపించకు లేదంటే అమ్మ బాధపడుతుంది అని అభయ్ అంటాడు. ఇంతలో ఆర్యా స్కూల్ దగ్గరికి వస్తాడు. రా ఫ్రెండ్ ఏంటి ఇంత లేట్ అయింది అని ఆకాంక్ష అంటుంది. కొంచెం వర్క్ ఉండి లేటుగా వచ్చానమ్మా మీరు అన్నం తిన్నారా అని ఆర్య అంటాడు. లేదు ఫ్రెండ్ అమ్మ బాక్స్ తీసుకొస్తానని చెప్పింది అని ఆకాంక్ష అంటుంది. మీ అమ్మ వచ్చే దాకా అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుందాం పదండి అని ఆర్య పిల్లల్ని తీసుకొని వెళ్లి చెట్టు దగ్గర కూర్చొని వాళ్లతో ముచ్చట్లు ఆడుతూ ఉంటాడు. ఇంతలో బాక్స్ పట్టుకొని అను స్కూల్ దగ్గరికి వచ్చి ఆర్య ఆ పిల్లలతో ఉన్నది చూసి అక్కడే ఆగిపోతుంది.

ఫ్రెండ్ మా నాన్నని వెతికి పెడతాను అన్నావు కదా ఏమైనా జాడ తెలిసిందా మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ డాడీలతో హ్యాపీగా ఆడుకుంటుంటే నాకు చాలా బాధేస్తుంది ఫ్రెండ్ మా డాడీని పేరెంట్స్ మీటింగ్ కి తీసుకొచ్చి ఇతనే మా డాడీ అని చెప్పాలి అనిపిస్తుంది ఫ్రెండ్ అని ఆకాంక్ష అంటుంది. అక్కి ఎప్పుడూ ఒకరితో పోల్చుకోకూడదమ్మా మీ డాడీ త్వరలోనే వస్తాడులే అని ఆర్య అంటాడు. నీకు తెలియదు ఫ్రెండ్ మా ఫ్రెండ్సు వాళ్ళ డాడీలు బర్త్ డే కు గిఫ్ట్ లు ఇస్తారు పిక్నిక్ తీసుకెళ్లి వాళ్లతో ఆడుకుంటారు కానీ ఎప్పుడూ మేము అమ్మతోటే ఉండాలి అన్ని అమ్మే చూసుకుంటుంది ఫ్రెండ్ ఎలాగైనా సరే మా డాడీ నాకు కావాలి ఫ్రెండ్ అని ఆకాంక్ష ఏడుస్తుంది. అక్కి నువ్వు మీ ఫ్రెండ్ కి చెప్పావు కదా వెతికి పెడతాడు అలా ఏడవకు అక్కి ఊరుకో అని అభయ్ అంటాడు. అక్కి కొంచెం వర్క్ లో బిజీగా ఉండి మీ డాడీని వెతకలేకపోయాను మీ డాడీని వెతికి తెచ్చే బాధ్యత నాదమ్మ అని ఆర్య అంటాడు.ఇంతలో జెండి ఆర్య కి ఫోన్ చేసి ఆఫీస్ కి రండి సార్ అని అంటాడు. అక్కి నాకు కొంచెం వర్క్ ఉంది వెళ్లి వస్తాను అని ఆర్య వెళ్ళిపోతాడు.

వాళ్లని పక్కనే ఉండి వాళ్ల మాటలు అన్నీ వింటున్న అను,ఆర్య సార్ మీ భార్య బిడ్డలు నీకు దూరమైపోయారని బాధలో ఉండి కూడా వేరే వాళ్ళ బాధ చూడలేక వాళ్లకు సహాయం చేసి వాళ్ళ డాడీని వెతికి పెడతానని అంటున్నారు మిమ్మల్ని మీరే వెతుక్కుంటారా సార్ ఈ లోకంలో ఎక్కడైనా ఈ విడ్డూరం ఉంటుందా అని తన మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా ఇంత లేట్ అయింది కొంచెం ముందు వస్తే మా ఫ్రెండ్ కూడా తినేవాడు కదా అని ఆకాంక్ష అంటుంది. ఏంటి స్కూల్ కి మీ ఫ్రెండ్ వచ్చాడా అని అను తెలియనట్టు అడుగుతుంది. అవునమ్మా అక్కి చూడాలనిపిస్తే వచ్చాడు అని అభయ్ అంటాడు. మీ బాధ నాకు తెలియకూడదు అని మాట మార్చి చెప్తున్నావా అభయ్ నీ తండ్రిని వెతకమని మీ తండ్రికే చెప్పారు అని అను తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే, కొంచెం లో ఆర్య మిస్ అయిపోయాడు అని మానస అంటుంది. అన్నయ్య అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆ షూటర్ కి ఫోన్ చేసి అడుగు అని ఛాయా అంటుంది. జలంధర్ షూటర్ కి ఫోన్ చేసి అసలు ఆరోజు సూర్యను షూట్ చేయమని చెప్పాను కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకు మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పు అని జలంధర్ అంటాడు.

ఏమీ లేదు సార్ నేను సూర్యనే షూట్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంతలో మానస మేడం ఫోన్ చేసి కోటి రూపాయలు ఇస్తాను ఆర్యని షూట్ చేయమని చెప్పింది నేను కోటి రూపాయల కోసం ఆశపడి ఆర్యని షూట్ చేస్తే ఆ సూర్య గాడు వచ్చి అడ్డం పడి వాడు అక్కడికక్కడే చనిపోయాడు వాళ్లు అంబులెన్స్ లో సూర్య అని హాస్పిటల్ కూడా తీసుకువెళ్దామని చూశారు అని షూటర్ అంటాడు. ఓకే ఇంకా ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తాను అని జలంధర్ ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు మానస అని జలంధర్ అంటాడు. అంటే ప్రాబ్లం అంతా ఆర్య తోటే కదా అతన్ని షూట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చేశాను దీని వెనకాల ఎలాంటి కుట్రలు లేవు అని మానస అంటుంది. అది సరే ఆర్యని జెండిని ఫాలో చేయమని నీ మనిషిని పెట్టానన్నావు కదా అతనికి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అడుగు అని ఛాయా అంటుంది. అలాగే అని మానస అతనికి ఫోన్ చేస్తుంది. హలో మేడం నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను మీరే ఫోన్ చేశారు ఆర్యా సార్ ఒక హాస్పటల్ కి డెడ్ బాడీ ని తీసుకెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు కట్టారు మేడం అని అతను అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.