Prema Entha Madhuram November 20 2023 Episode 1104: పిల్లలు త్వరగా రండి స్కూల్ కి రెడీ అవ్వాలి అని అను అంటుంది. అమ్మ ఈరోజు మమ్మల్ని సూర్య ఫ్రెండ్ డ్రాప్ చేస్తానన్నాడు అని అభయ్ అంటాడు. అవునా అయితే తొందరగా వెళ్ళండి అని అను అంటుంది. పిల్లలు త్వరగా రెడీ అయిపోయి బయటికి వెళ్తారు. కట్ చేస్తే, జెన్డీ ఆర్య కి ఫోన్ చేసి ఆ ఫోటో పంపించింది ఎవరో తెలిసిపోయింది ఆర్య అని అంటాడు. ఎవరు అని ఆర్య అడుగుతాడు. ఇంకెవరూ మన బద్ధ శత్రువు అయిన జలంధర్ అని జెండి అంటాడు. ఈ విషయం అతనికి ఎలా తెలిసింది అని ఆర్య అంటాడు. సుగుణమ్మ ల్యాండ్ విషయంలో గొడవ జరుగుతుందని చెప్పావు కదా అది జలంధర్ తోటి ఆ ప్రయత్నంలో నిన్ను చూసి ఉంటారు అని జెండి అంటాడు.అంతే జెండి పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను అలా వెళ్లి మన శత్రువుని గట్టిగా పలకరించి వద్దాము అని ఆర్య అంటాడు.

అలాగే ఆర్య అని జెండి అంటాడు. కట్ చేస్తే, హాస్పటల్లో నర్సు అన్నకి ఫోన్ చేసి మీ అమ్మ నాన్న ఇప్పుడే వచ్చారు మేడం రండి అని ఫోన్ చేస్తుంది. అయితే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అను వెళ్ళిపోతుంది. అను అలా వెళ్తూ ఉండగా ఒక కారు రాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుంది. ఎవరు ఇంత రాష్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నారు వాళ్ళ సంగతి చెప్తాను అంటూ అను ఆ కార్ వెనకాల వెళుతుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి మానస జలంధర్ ఛాయా కనిపిస్తారు. ఏంటి అను ఇలా వచ్చావు దారి తప్పవా అని ఛాయా అంటుంది. మీలాంటి బుద్ధి తక్కువ వాళ్లతో మాట్లాడాలనుకోవడం నాదే పొరపాటు మీరు అనుకుంటే నేను వచ్చే దాన్ని కాదు అని అను అంటుంది. రా అను మనం మంచి మాటలు మాట్లాడుకుందాం అని జలంధర్ అంటాడు. మీలాంటి వాళ్ళకి మంచి మాటలు కూడా వస్తాయా అని అను అంటుంది. మాకు మంచి మాట నీకు చెడు మాట మాట్లాడుకుందాం అను అని ఛాయా అంటుంది.

చూడు అను నువ్వు ఆ ల్యాండ్ రిజిస్టర్ సుగుణమ్మతో చేయించకపోతే పిల్లల్ని కిడ్నాప్ చేస్తాం అని జలంధర్ అంటాడు. మీకు ఆ ల్యాండ్ దక్కదు నా పిల్లల జోలికి వస్తే నేను ఎంతకైనా తెగిస్తాను అని అను కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలో ఆర్య అక్కడికి వస్తాడు. ఆర్య ని చూసిన అను దాక్కుంటుంది. కట్ చేస్తే, ఆర్య జలంధర్ వాళ్ళ ఇంటికి వచ్చి సోఫాలో కాలు మీద కాలేవేసుకొని కూర్చుంటాడు. ఏంటి ఆర్య ఇంటి అల్లుడు వచ్చినట్టు వచ్చి దర్జాగా కూర్చున్నావు అని జలంధర్ అంటాడు.అదే నేను అడుగుతున్నాను ఏంటి మీ ప్రాబ్లం అని ఆర్య అంటాడు. బిజినెస్ లో మాకు నువ్వు అడ్డొస్తున్నావు అని ఛాయా అంటుంది. అయితే డేరుగా నాతో ఢీ కొట్టాలి కానీ దొంగతనంగా ఈ ఫోటోలు పంపడానికి ఇన్ని రోజులు ల్యాండ్ విషయంలో ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మీరే అని తెలిసింది నేను అక్కడ ఉన్నానని తెలిసినా మీరు బెదిరిస్తున్నారు అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు నాకు అర్థమైంది కానీ మీ ప్రయత్నాలు ఆపేయండి,సూర్య ప్లేస్ లో నన్ను మీరు ఇబ్బంది పెట్టిన ఆ ల్యాండ్ విషయంలో ఇంటికొచ్చి గోడ చేసిన ఏ రేంజ్ లో ఉంటుందో నీకు అర్థమై ఉంటుంది కదా అని ఆర్య అంటాడు. ఏంటి భయపడుతున్నారా అని ఛాయా అంటుంది.

మీరు ముగ్గురూ కలిసి ఆర్యని భయపెట్టాలి అనుకుంటే అతని వెనుక సైన్యమే ఉంది మీరు అది గుర్తుపెట్టుకోండి అని నీరజ్ అంటాడు. ఇంత చెప్పినా మేము అలాగే చేస్తాము అంటే ఈ ఆర్యవర్ధన్ చూస్తూ ఊరుకోడు అలాగే అలాంటి విషయంలో పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని ఆర్య బెదిరిస్తాడు . ఇంతలో హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. దాదా నేను హాస్పిటల్ కి వెళ్ళాలి అని నీరజ్ అంటాడు. సరే వెళ్ళు నీరజ్ పైగా పిల్లలకిచ్చిన మాట ప్రకారం వాళ్ళ తండ్రిని వాళ్ళ ముందు నిలబెట్టాలి అని అంటాడు. కట్ చేస్తే, సార్ ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటాడు అని అనుకోలేదు, కానీ ఆ జలంధర్ వాళ్లు సూర్య విషయంలో సార్ ని ఎక్కడ ఇరికిస్తారో ఏమో, సార్ పిల్లల తండ్రిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని అను టెన్షన్ పడుతుంది. ఇంతలో సుగుణ వచ్చి ఏంటి రాధ టెన్షన్ పడుతున్నావ్ ఏమైంది నాకు చెప్పు నీ బాధ నేను అర్థం చేసుకుంటాను అని సుగుణ అంటుంది.

అయ్యో ఆంటీ అదేమీ లేదు అని అను అంటుంది. మీకున్న టెన్షన్ పోవాలంటే ఈ టీ తాగండి చిటికెలో మాయమైపోతుంది అని ఉష అంటుంది. ఇదేంటి అను మీరు షాప్ కు వెళ్లలేదా మీరు అక్కడ ఉన్నారని నేను ఈరోజు లీవ్ పెట్టుకున్నాను అని దివ్య అంటుంది. కొంచెం మనసు బాగోలేదని వచ్చాను దివ్య ఇప్పుడు సెట్ అయింది వెళ్తాను అని అను అంటుంది. రాధ ఎలాగో సెలవా పెట్టుకున్నావు కదా ఇంటి దగ్గరే ఉండు అని సుగుణమ్మ అంటుంది. పర్వాలేదు ఆంటీ ఈరోజు పిల్లలకి హాఫ్ డే స్కూల్ కాబట్టి వాళ్లని తీసుకొని వెళ్తాను అని అను అంటుంది. పిల్లలు మిమ్మల్ని పని చేసుకొనివ్వరు కదా అను గారు అని ఉష అంటుంది. పర్వాలేదు ఉష నేను చూసుకుంటాను అని చెప్తుంది. సరే అను త్వరగా బయలుదేరు అని సుగుణమ్మ అంటుంది.