Prema Entha Madhuram November 21 2023 Episode 1105: పిల్లల్ని తీసుకొని అను షాప్ కు వెళ్తుంది. అను పని చేస్తూ ఉండగా పిల్లలు వచ్చి అమ్మ షాప్ అంత ఒకసారి చూసి వస్తాము అని అంటారు. పిల్లలు అందుకే మిమ్మల్ని తీసుకురాను మీరు ఒక దగ్గర కూర్చోండి అలా అల్లరి చేయకూడదు అని అను అంటుంది. అమ్మ అల్లరి చేయకుండా ఎలా కూర్చుంటాం అమ్మ మేము పిల్లలం కదా అని అక్కి అంటుంది. ఇంతలో నీరజ్ అక్కడికి వచ్చి మేనేజర్ తో మాట్లాడుతూ ఉంటాడు. మా రాజనందిని చీరలు ఎలా సేల్ అవుతున్నాయి అని అడుగుతాడు. సార్ బాగా సేల్ అవుతున్నాయి సార్ మొన్ననే ఒక ఫ్లోర్ ఇంచార్జి చెప్పిన సలహా మేరకు మీ చీరలు బాగా అమ్ముడుపోతున్నాయి అని మేనేజర్ అంటాడు. అవునా ఆవిడని ఒకసారి పిలిచి కంగ్రాట్స్ చెప్తాను పిలిపించండి అని నీరజ్ అంటాడు. పిల్లల్ని నేను తీసుకు వెళ్తాను అని దివ్య పిల్లల్ని తీసుకు వెళ్తూ ఉండగా అభయ్ రాజనందిని చీరలు చూసి ఈ చీరలు చాలా బాగున్నాయి మా అమ్మకి బాగా నచ్చుతాయి అని అంటాడు.

అన్నయ్య నువ్వు పెద్దయ్యాక ఇలాంటి చీరలు నాకు కొనిపెట్టాలి అని అక్కి అంటుంది. అలాగే అక్కి అని అభయ్ అంటాడు. ఈ చీర నీకు కావాలా అని దివ్య తీసుకువెళ్లి అక్కకి చీర కట్టిస్తుంది. రాజనందిని చీర కట్టుకున్న అక్కి వెళ్లి అను దగ్గర నిలబడి అమ్మ ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది. చాలా అందంగా ఉన్నావమ్మా అని అను ఆకాంక్షను దగ్గరికి తీసుకొని, రాజనందిని ఇండస్ట్రీకి రాజనందిని లాగా ఉన్నావ్ అమ్మా అని అనుకుంటుంది మనసులో. ఇంతలో సేల్స్ బాయ్ వచ్చి అను గారు మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని అంటాడు. అలాగే అని అను పిల్లల్ని తీసుకొని వెళుతూ ఉండగా అక్కడ నీరజ్ కనపడగానే దాసుకుంటుంది అను. పిల్లలు వాళ్ళ అమ్మని చూసుకోకుండా నీరజ్ దగ్గరికి వెళ్లి హాయ్ మా ఫ్రెండ్ కు తమ్ముడు గారు ఎలా ఉన్నారు ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఏమీ లేదమ్మా మీ అమ్మని కలిసి కంగ్రాట్స్ చెప్పుదామని వచ్చాను అలాగే ఈ గిఫ్ట్ కూడా ఇద్దామనుకున్నాను అని నీరజ్ అంటాడు. మా అమ్మకి ఇలాంటివి అంటే నచ్చవు ఫ్రెండ్ మా అమ్మ తీసుకోదు అని అభయ్ అంటాడు.

అయితే మీ అమ్మకు మీరు తీసుకువెళ్లి ఇవ్వండి అని నీరజ్ ఆ గిఫ్ట్ పిల్లలకి ఇచ్చి చూడు ఆకాంక్ష మీ నాన్నని త్వరలోనే నీ ముందు నిలబెడతాను అని నీరజ్ అంటాడు. గిఫ్ట్ ఇచ్చావు ఫ్రెండ్ మరి నీకు తిరిగి గిఫ్ట్ ఇవ్వొద్దా వంగు అని నీరజ్ కు పిల్లలు ఇద్దరు ముద్దు పెడతారు. దూరం నుంచి వాళ్ళనే గమనిస్తున్నాను సార్ సీరియస్గా విషయాన్ని తీసుకొని ఆయనని ఆయనే వెతుక్కుంటున్నారా ఇప్పుడు ఎలా అని కంగారు పడుతుంది అను. కట్ చేస్తే, సూర్య సుగుణమ్మ ఉష బజారుకు వెళ్తారు. అక్కడ ఆర్య కూరగాయలు తీసుకుంటూ ఉండగా, ఉష వాళ్ళ అన్నయ్య రాసిన కథను తీసుకెళ్లి పోస్ట్ చేసి దేవుడా మా అన్నయ్య రాసిన కథ మ్యాగజైన్ లో వచ్చేలా చేయి అనుకుంటుంది.కూరగాయలు తీసుకొని వాళ్ళు ముగ్గురు వెళ్లిపోతారు.కట్ చేస్తే,అను ఇంటికి వెళుతూ ఉండగా సోది చెప్పే ఒక ఆవిడ కలిసి నువ్వు తప్పు చేస్తున్నావ్

నీ భర్తకి పిల్లలు దగ్గర అయితే ప్రాణగండం అని తెలిసిన నువ్వు పిల్లల్ని దగ్గర చేస్తున్నావు, నీ సౌభాగ్యం నీకు దక్కాలి అంటే జీవితంలో ఆయనకి నువ్వు కనిపించకు, లేద నువ్వు ఆయనకి దగ్గర అయితే ప్రమాదం ముంచుకొస్తుంది అని ఆ సోది చెప్పే ఆవిడ అంటుంది. నేను కావాలని ఏదీ చేయట్లేదు ఆ భగవంతుడే మా ఇద్దరినీ కలుపుతున్నాడు నేను ఆయనకి కంటపడడం లేదు అని అను అంటుంది.నువ్వు ఆయనకి ఎదురుపడకపోతే ఏంటి ఆయన చుట్టే తిరుగుతున్నావు కదా మీ ఆయనకి ఏమైనా అయిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు అని ఆవిడ అంటుంది.

ఆ సోది అమ్మ చెప్పిన మాటలు విని ఏడుస్తూంది.తనని దూరం నుంచి చూస్తున్న మానస ఈ దెబ్బతో నువ్వు మళ్ళీ బ్రో మొహం చూడవు, ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు మీ ఆయనను చూసుకొని మెడిసి పడతావా ఇప్పుడు ఎవరు కాపాడుతారో చూస్తాను అని అనుకుంటుంది మానస. భగవంతుడా ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్లాలి ఎక్కడికి వెళ్లినా ఆయన మా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడే అని అను ఏడుస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.