Prema Entha Madhuram October 12th: ఏంటి జెండి ఇంత లేటు రాత్రి చెప్పాను కదా గుడికి వెళ్లాలని అని ఆర్య అంటాడు. సారీ ఆర్య వేరే కంట్రీస్ కి వెళ్ళిన మనవాళ్ళందర్నీ గవర్నమెంట్ విడిపించడంలో సక్సెస్ అయ్యింది అది పేపర్లో పడింది చూడలేదా అని జెండి అంటాడు.ఇన్నాళ్ల తర్వాత వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు అని అంజలి అంటుంది. ఈ విషయం గురించి మినిస్టర్ గారితో మాట్లాడదామని వెళ్లాను అందుకే లేట్ అయింది అని జెండి అంటాడు. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగి అను ఈరోజు కనపడితే అమ్మవారికి పూజ ఘనంగా చేయిస్తాను ఇక బయలుదేరుదామా అని ఆర్య అంటాడు. సార్ మీరు అనుకున్నట్టే అను దొరకాలని నేను మొక్కుతున్నాను ఈరోజు అష్టమి కూడా అమ్మవారు అనుగ్రహించి అను దొరికేలా చేయాలి సార్ అని అంజలి అంటుది.

మన చేతుల్లో ఏముందమ్మా అంత అమ్మవారి దయ నేను కూడా అదే జరగాలని అనుకుంటున్నాను అని జెండి అంటాడు.కట్ చేస్తే అను గుడికి వచ్చి స్వామి ఈరోజు నా పుట్టినరోజు అని నిన్ను అడగడానికి రాలేదు నా ఆశీస్సులు కూడా ఆర్య సార్ కి ఇచ్చి తను క్షేమంగా ఉండేలా చూడు ఈ సౌభాగ్యం కోసమే నేను బ్రతుకుతున్నాను స్వామి ఎలాగైనా ఈరోజు ఆర్య ని కలర చూసే భాగ్యాన్ని నాకు కల్పించు అలాగని తనకి ఎదురు పడను దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను అని అను అంటుంది. ఇంతలో గుడికి వేరే కంట్రీస్ కి వెళ్లే నా కొడుకు తల్లి ఒక ఆవిడ గుడికి వచ్చి ఇన్నాళ్లకు నా కొడుకు తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నీకు కృతజ్ఞత చెబుదామని వచ్చాను నా కొడుకు క్షేమంగా ఇంటికి వచ్చేలా చేయి అని ఆ పెద్దావిడ భగవంతుడికి నమస్కారం పెట్టుకుంటుంది.

అను గుడి చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఉండగా ఒక పెద్ద ఆవిడ కాలికి తగులుతుంది అయ్యయ్యో చూసుకోలేదమ్మా ఏంటి ఇలా పొర్లు దండాలు పెడుతున్నా చాలా అలసిపోయినట్టున్నావ్ ఇదంతా అవసరమా అని అను అంటుంది. పరవాలేదు అమ్మ ఇది నాకు అవసరమే కుటుంబ బాధ్యత కోసం నా కొడుకు పరాయి దేశం వెళ్లాడు అక్కడ వాడి మీద ఏవో కేసులు పెట్టి ఇన్నాళ్లు వాడిని జైల్లో ఉంచారు ఇన్నాళ్లకు భగవంతుడు కరుణించి మళ్లీ వాడు విడుదల అయ్యి ఇంటికి తిరిగి వస్తున్నాడు అందుకని స్వామికి మ్మొక్కు తీర్చుకుంటున్నాను ఆని పెద్ద ఆవిడ అంటుంది.మిమ్మల్ని చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నారు ఇప్పుడు పొర్లు దండాలు పెట్టడం అవసరమంటావా భగవంతుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు నీ కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడు అని అను అంటుంది.

నీ మాట ఫలించాలమ్మ అని ఆ పెద్ద ఆవిడ పొర్లు దండాలు పెడుతూ ఉండగా అను సహాయం చేస్తుంది. నీ కొడుకు కోసం నువ్వు మొక్కు తీర్చుకుంటున్నావు నా భర్త కోసం నేను ఆరాటపడుతున్నాను మన ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు అని అను తన మనసులో అనుకుంటుంది.కట్ చేస్తే అన్నయ్య మనం కబ్జా చేసిన ఆ స్థలంలో ఇల్లు కట్టడం ఎప్పుడు మొదలు పెడదాం అని ఛాయా అంటుంది. దాని గురించే మాట్లాడుతున్నాను అమ్మ బ్రోకర్ వస్తానన్నాడు అని వాళ్ళ అన్నయ్య అంటాడు. ఇంతలో రోహిత్ అక్కడికి వచ్చి ఛాయా మనకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నాను అని అంటాడు. ఎందుకు నువ్వు వెళ్తున్నావా అని ఛాయా అంటుంది. ఎన్ని రోజులని మనం ఇక్కడే ఉంటాము మన ఇంటికి మనం వెళ్లొద్దా అని రోహిత్ అంటాడు. చూడు రోహిత్ నేను మా అన్నయ్య కోసం ఇక్కడికి వచ్చాను ఆర్య వర్ధన్ మీద మా అన్నయ్య గెలవలేక పోతున్నాడు నేను ఇక్కడే ఉండి మా అన్నయ్యని గెలిపించాలి నీకు ఇష్టమైతే ఉండు లేదంటే వెళ్ళిపో అది కూడా ఇల్లరికపు అల్లుడుగా ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో అని ఛాయా అంటుంది.

ఫ్యామిలీ ఎమోషన్ తెలియని మీలాంటి వాళ్లతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ చి అని రోహిత్ వెళ్ళిపోతాడు. ఏంటి మీ ఆయన ఒప్పుకున్నాడు అనుకుంటా అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఒప్పుకోక చస్తాడా నేనంటే అతనికి ఇష్టం అని ఛాయా అంటుంది. ఇంతలో శర్మ గారు అక్కడికి వచ్చి నమస్తే జలంధర్ గారు ఆ 35 ఎకరాల్లో ఐదు ఎకరాలు సుగుణ పేరిట రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పాను కదా అది 30 ఎకరాల మధ్యలో అటు ఇటు కాకుండా ఉండిపోయింది ఆవిడేమో అసలు అమ్మానాన్న అంటుంది అని అంటాడు. ఎంత డబ్బైనా ఇచ్చి దాన్ని మనం తీసుకోవాలి అని జలంధర్ అంటాడు.ఆవిడ డబ్బుకు లొంగదండి ఆస్తి అలా ఆయన సంపాదించoడట వాళ్ళ కొడుకు కె దక్కాలని అనుకుంటుంది అని శర్మ అంటాడు.డబ్బుకు లొంగకపోతే లాకో వడమే అని ఛాయా అంటుంది. ఇన్ని రోజులు ఒకే తమ్మ ఇప్పుడు ఆవిడ కొడుకు తిరిగి వస్తున్నాడు వేరే కంట్రీస్ కి వెళ్ళిన వాళ్ళందరినీ గవర్నమెంట్ విడిపించింది ఆర్య వర్ధన్ వాళ్ళందరికీ జాబ్ ఇస్తానని మాటిచ్చాడు మీరు పేపర్ చూడలేదా అని శర్మ అంటాడు.

ఎక్కడికి వెళ్ళినా ఆ ఆర్యవర్ధన్ మనకు అడ్డు తగులుతున్నాడు ఏదో ఒకటి చేసే అ తల్లి కొడుకుని చంపేసి మనం ఆ ల్యాండ్ ని సొంతం చేసుకోవాలి అన్నయ్య అని ఛాయా అంటుంది. అలాగే అమ్మ అది నేను చూసుకుంటాను వాళ్ళ అన్నయ్య అంటాడు. కట్ చేస్తే ఈరోజు స్కూల్ లేదని ముందే తెలిస్తే మనం వచ్చే వాళ్ళమే కాదు కదా అన్నయ్య అని ఆకాంక్ష అంటుంది. పోనీలే ఇలాగైనా మనాకు అమ్మ బర్త్డే ని సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది ఆని అబి అంటాడు. ఇంతలో ఆర్య వాళ్ళు పిల్లల్ని చూసి కారు ఆపుతారు ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్ బంకు కొట్టారా అని జెండి అంటాడు. నేను నీలాగా కాదు చాలా సెన్సిటివ్ ఒక్కరోజు కూడా స్కూల్ కి బంకు కొట్టాను ఈరోజు స్ట్రైక్ అన్ని హాలిడే ఇచ్చారు అని ఆకాంక్ష అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది