Prema Entha Madhuram October 13th Episode 1072: అవును మీరందరూ ఆఫీస్ కి బంకు కొట్టి ఇలా వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆకాంక్ష అంటుంది. ఏమీ లేదమ్మా మేము అందరం గుడికి వెళ్దామని వెళ్తున్నాం దారిలో మీరు కనిపించారు మీరు గుడికి రండి వెళ్దాం అని ఆర్య అంటాడు. మీరు వెళ్లండి ఈరోజు మా అమ్మ కూడా గుడి దగ్గరే ఉంది అని ఆకాంక్ష అంటుంది. అక్కి వాళ్ళకి గుడికి వెళ్లడానికి లేటవుతుంది వాళ్ళని వెళ్ళని మనo ఇంటికి వెళ్దాం అని అభయ్ అంటాడు. అన్నయ్య ప్లీజ్ రా మనము వెళ్దాము అని ఆకాంక్ష అంటుంది. సరే పద అని అభయ్ అంటాడు. హలో నా ఫ్రెండ్ కు ఫ్రెండ్ నా బ్యాగు తీసి జాగ్రత్తగా కారులో పెట్టు అని ఆకాంక్ష అంటుంది. తప్పుతుందా ఒప్పుకున్న పెళ్ళికి బ్యాండ్ మేళం వాయించాలి కదా నీ బ్యాగ్ కూడా ఇవ్వు అభయ్ అని జెండి అంటాడు. అందరూ కలిసి కారులో గుడి దగ్గరికి వెళ్తారు.

అక్కి ఇవి అమ్మ చెప్పుల ఉన్నా ఏంటి అమ్మ కూడా ఇదే గుడికి వచ్చిందా అని అభయ్ అంటాడు. అన్నయ్య ఇలాంటి చెప్పులు అమ్మకు ఒక్కదానికే ఉంటాయా ఏంటి షాపులలో ఎన్నో జతలు ఉంటాయి ఇవి అమ్మవి కాదేమో అని ఆకాంక్ష అంటుంది. అంతే అంటావా అని అభయ్ అంటాడు. అది సరే అన్నయ్య ఇందాక ఫ్రెండ్ వాళ్ళకి అమ్మ బర్త్డే గురించి చెప్పనివ్వలేదు ఎందుకు అని ఆకాంక్ష అంటుంది. అది మన ఫ్యామిలీ సెలబ్రేషన్ చెల్లి సార్ వాళ్లకు చెబితే గిఫ్ట్ తీసి ఇస్తాడు అలాంటివి అమ్మకు నచ్చవు కదా అందుకే చెప్పనివ్వలేదు అని అభయ్ అంటాడు. అంజలి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తే సరిపో అని అంజలి వాళ్ళ ఆయన అంటాడు. సరిపోదండి మూడు ప్రదక్షిణ చేయాల్సిందే అని అంజలి అంటుంది.

ఏంటి సార్ భయపడుతున్నారా ప్రదక్షణ చేయడానికి అని అభయ్ అంటాడు.రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రోజు ఐదు కిలోమీటర్ల జాగింగ్ కి వెళ్లి వస్తాను అని అంజలి వాళ్ళ ఆయన అంటాడు. ఏమో ఎవడికి తెలుసు జాగింగ్ కి కానీ చెప్పి వెళ్లి కారులో పడుకుంటున్నారేమో అని అభయ్ అంటాడు. సరే రా ముందు ఎవరు ప్రదక్షిణ కంప్లీట్ చేస్తారు చూద్దామా అని అంజలి వాళ్ళ ఆయన అంటాడు. సరే పోటీలో మేమే గెలుస్తాం అని ఆకాంక్ష అంటుంది. ఆర్య వర్ధన్ శివుడికి ఎదురుంగా నిలబడి అను ఎక్కడున్నావను ఈరోజు ఒక్కసారి కనబడు ఇక ఎప్పుడు జీవితంలో నిన్ను దూరం చేసుకోను ఎక్కడున్నావు అను అని ఆర్య తన మనసులో అనుకుంటాడు.

సుగుణ పొర్లు దండాలు పెట్టడం అయిపోయాక పరమేశ్వరుడికి దండం పెట్టి ఈశ్వర నా కొడుకు త్వరగా తిరిగి రావాలి అని అంటుంది.అమ్మ మీరు చాలా అలసిపోయారు ఇలా కూర్చోండి నేను వెళ్లి మంచి నీళ్లు తీసుకొస్తాను అని అను వెళ్లి మంచి నీళ్లు తెచ్చి సుగుణకి తాగిస్తుంది. థాంక్స్ అమ్మా నీ వల్లే ఈ మొక్కు తీర్చుకోగలిగాను అన్ని సుగుణ అంటుంది. మీరు ఉపవాసం చేసరు కదా మీ అబ్బాయి తిరిగి వస్తాడులే అని అను అంటుంది. నీ మాట సత్యం అమ్మ సుగుణ అంటుంది.కట్ చేస్తే ఫ్రెండ్ పూజ మీరు కంటిన్యూ చేయండి నేను అన్నయ్య ఇక్కడ ఆడుకుంటాము అని ఆకాంక్ష అంటుంది. పూజారి గారు పూజ చేస్తూ ఆర్య వర్ధన్ పేరు చదువుతాడు.

ఆ పేరు వినగానే అను ఆయన ఇక్కడికి వచ్చారు అనుకుంటా అని పరిగెత్తుకొచ్చి చాటుగా ఉండి ఆర్య వర్ధన్ చూసి నాకు తెలుసు సార్ మీరు వస్తారని నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టిన నేను మీకు దొరకాలని మీరు అనుకుంటున్నారు నేనంటే మీకు ఎంత ప్రేమ కానీ రాలేనండి నన్ను క్షమించండి అని అను కిందికి వంగి దూరం నుంచి ఆర్య వర్ధన్ పాదాలకి నమస్కరించుకుంటుంది. అంజలి మీరు అన్నదానం దగ్గరికి వెళ్లి అక్కడ ఏర్పాటు ఎలా జరుగుతున్నాయో చూడండి అని ఆర్య అంటాడు. సరే దాదా అని వాళ్ళ తమ్ముడు అంజలి వెళ్తారు.ఇంతలో రౌడీలు సుగుణ కోసం వచ్చి అన్న ఆ ముసలిది కనిపించగానే చంపేసి నీకు ఫోన్ చేస్తామన్న అని రౌడీలు అంటారు. కట్ చేస్తే వేరే దేశానికి వెళ్లిన వాళ్లందరూ మన దేశానికి వస్తారు.

ఒరేయ్ మన దేశంలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు అయింది మళ్ళీ వస్తాము అని నేను అనుకోలేదు ఇన్నాళ్ళకి మళ్లీ తిరిగి వచ్చాము అని సూర్య అంటాడు.అవున్రా బతుకుదెరువు కోసమని పరాయి దేశం వెళ్ళాము కలో గంజు తాగి ఇక్కడే ఉంటే మనకి నీ కష్టాలు ఉండేవి కాదు కదా అని వాళ్లలో ఒకడు అంటాడు. విమానాశ్రయం నుంచి అందరూ వచ్చినట్టేనా మీ పేర్లు అందరివి చదువుతాను ఎవరి పేరు ఎవరిదో నాకు చెప్పండి అని మేనేజర్ అంటాడు.అలాగేనండి అని వాళ్ళందరూ అంటారు. ఒక్కొక్కరి పేరు చదివి మీరందరూ చాలా అదృష్టవంతులు ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్లందరికీ ఆర్య వర్ధన్ గారు జాబ్ ఇస్తారు మీరందరూ ఆఫీసుకి పదండి అని వాళ్ళ మేనేజర్ తీసుకెళ్తాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది