Prema Entha Madhuram October 17 ఎపిసోడ్ 1075: ఎవరు నువ్వు నా గొంతు ఎందుకు పట్టుకున్నావ్ వదులు అని జలంధర్ అంటాడు. అను వదిలిపెట్టకుండా గొంతు గట్టిగా పట్టుకుని అటు ఇటు తిప్పి నేలకేసి కొడుతుంది జలందర్నీ. జలంధర్ ప్రాణభయంతో వణికిపోతు పరిగెత్తుకుని బయటికి వెళ్లిపోతాడు. ఇంతలో ఉష వస్తుంది అమ్మవారి దర్శనం బాగా జరిగింది కొబ్బరికాయ కొట్టాను అని అంటూ ఉండగా. సుగుణ కళ్ళు తెరుస్తుంది. ఉష మీ అమ్మ కళ్ళు తెరిచింది వెళ్లి డాక్టర్ని పిలుచుకురా నేను ఇక్కడే ఉంటాను అని అను అంటుంది. ఉషా వెళ్లి డాక్టర్ని పిలుసుకు వస్తుంది. డాక్టర్ గారు సుగుణాన్ని చూసి ఇప్పుడు మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు బాగానే ఉన్నారు అని అంటుంది. అమ్మ అను నువ్వు చల్లగా ఉండాలమ్మా అని సుగుణ అంటుంది.

ఆంటీ లేట్ అయింది పిల్లలు ఇంటికి వస్తారు నేను వెళ్తాను అని అను అంటుంది. ఇంతలో దివ్య జ్యోతి అక్కడికి వచ్చి నీకు థాంక్స్ అండి మా అమ్మను కాపాడినందుకు మీ రుణం తీర్చుకోలేము అని అంటారు. పర్వాలేదండి తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే మనo మనుషులమే కాదు అని అను అంటుంది. అమ్మ మనం ఇంటికి వెళదామా అని జ్యోతి అంటుది ఆంటీ నేను వెళ్లి వస్తాను మళ్ళీ నైట్ ఫోన్ చేస్తాను అని అను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మినిస్టర్ గారు ఆర్య వర్ధన్ కంపెనీ దగ్గరికి వస్తాడు. నమస్తే మినిస్టర్ గారు బాగున్నారా అని ఆర్య అంటాడు. నేను బాగానే ఉన్నాను ఆర్య కానీ నువ్వు చేస్తున్న పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఎందుకు అంటే వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చిన మన వాళ్ళకి నువ్వు జాబ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలనే కాదు వాళ్ళని కూడా ఉద్ధరిస్తున్నావు నీలాంటి గొప్పోళ్ళు ఉండబట్టే కదయ్యా ఇంకా మంచితనం మిగిలింది లేదంటే ఎవరికి వారే స్వార్థం చూసుకునే ఈ రోజుల్లో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నావు నువ్వు చాలా గ్రేట్ ఆర్య వర్ధన్ అని మినిస్టర్ గారు అంటాడు.

నాదేముంది సార్ మిలాంటి వాళ్ళు ఉండబట్టే వాళ్లు అక్కడి నుంచి ఇక్కడి దాకా రాగలిగారు నేను ఏదో చిన్న సహాయం మాత్రమే చేస్తున్నాను దానికే ఇంతలా పొగుడుతారు ఏంటి అని ఆర్యవర్ధన్ అంటాడు. ఆర్య వాళ్లకి ఆర్డర్ కాపీ ఇవ్వు అని మినిస్టర్ గారు అంటాడు. నేను కాదు సార్ మీరు గెస్ట్ గా వచ్చారు కదా మీరు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు అని ఆర్య అంటాడు లేదు ఆర్య జాబ్ ఎవరిస్తున్నారు వాళ్లే వాళ్లకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు అని మినిస్టర్ గారు అంటాడు. వాళ్లకి ఆర్డర్ కాపీ ఇచ్చాక భోజనం చేసి వెళ్ళండి మీకు ఏర్పాట్లు చేశారు అని జెండి అంటాడు.సార్ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్ మా వాళ్ళకి మొహం ఎలా చూపించుకోవాలని బాధపడుతున్న మాకు ఈ జాబు ఇచ్చికుటుంబాన్ని పోషించుకోవడానికి దారిని చూపించారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము సార్ అని సురేష్ ఆర్య వర్ధన్ కాళ్ళ మీద పడి అంటాడు. సురేష్ ఏంటి ఏడవకు నువ్వు ఉద్యోగం చేసి మీ వాళ్లను బాగా చూసుకో అదే నాకు మీరిచ్చే గిఫ్ట్ అని ఆర్యవర్ధన్ అంటాడు.

కట్ చేస్తే నువ్వు నా కొడుకు తిరిగి వస్తున్నాడని పాయసం చేస్తుంది. అమ్మ ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చావు ఏంటి ఈ పిచ్చి పనులు వాడు వస్తున్నాడని సంబరంతో నీ ఆరోగ్యం పాడు చేసుకోకు వాడు రాకపోతేనే బాగుంటుంది వాడు వచ్చి మాత్రం ఏం లాభం అని దివ్య అంటుంది. అదేంటమ్మా అలా అంటావు అన్నయ్య ఇన్నాళ్ళకి తిరిగి వస్తున్నాడు మీకు సంతోషంగా లేదా అని సుగుణ అంటుంది. ఇన్నాళ్లు మోగ తోడు లేకుండానే మనం ఎన్నో కష్టాలు పడ్డాము వాడు ఉద్యోగానికి వెళ్లి అక్కడ దొంగతనాలు చేసి కేసుల పాలయ్యాడు నీ కష్టం చూడలేక దివ్య సేల్స్ గల్ పని చేస్తుంది ఎవడో దారిన పోయే వాడికి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే వాడు కట్నం కోసమని నన్ను కొట్టి తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడు ఇప్పుడు తిరిగి వచ్చి నిన్ను చూసుకుంటాడని అనుకుంటున్నావా వాడి కోసం నువ్వు కష్టపడి పాయసం వండాలని ప్రయత్నించకు నీకేమైనా జరిగితే నా దగ్గర డబ్బులు కూడా లేవు అని దివ్య అంటుంది.

వాడు మాత్రం ఏం చేస్తాడమ్మా వాడు కావాలని చేయలేదు కదా వాడికి గ్రహ స్థితులు బాగా లేవు అలా జరిగింది దానికి వాడేం చేస్తాడు చెప్పు మీరు అలా మాట్లాడకండి అని సుగుణ అంటుంది. అవునక్కా అన్నయ్య కావాలని తప్పులు చేసి జైల్లో పడలేదు కదా ఇప్పుడు తిరిగి వస్తున్నాడు కదా అని ఉష అంటుంది. నువ్వు చిన్న దానివి నీకేం తెలియదు నువ్వు ఊరుకో అని జ్యోతి అంటుంది. సుగుణ మాత్రం వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని పాయసం వండుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే భోజనాలు అందరూ చేశారు కదా ఇక మీరు మీ ఇళ్లల్లోకి వెళ్ళండి రేపటి నుంచి ఆఫీస్ కి రండి అని ఆర్య వర్ధన్ వాళ్ళని పంపించేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది