`లవ్ స్టోరీ`, `బంగార్రాజు` వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ఇటీవల `థాంక్యూ` మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ప్రస్తుతం ఈయన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 22వ సినిమాను ప్రారంభించాడు.
ఇటీవలె ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను సైతం షురూ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతుండగా.. ఆయనకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది.
అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ చిత్రంతో `కార్తీకదీపం` సీరియల్ ద్వారా బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటి ప్రేమి విశ్వనాథ్ అదేనండీ.. మన వంటలక్క సినీ రంగ ప్రవేశం చేయబోతోంది. ఈ మేరకు ప్రేమి విశ్వనాథ్ పోస్టర్ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేసి ఆమెకు ఆహ్వానం పలికారు.
అలాగే ఇందులో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరన్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మొత్తానికి భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
https://twitter.com/srinivasaaoffl/status/1580830773036216320?s=20