Priyanka Jawalkar: క్రికెట‌ర్‌తో ప్రేమాయ‌ణం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రియాంక!

Share

Priyanka Jawalkar: ప్రియాంక జ‌వాల్క‌ర్.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కలవరం ఆయే` మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ప్రియాంక‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `టాక్సీవాలా`లో న‌టించి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత గమనం, ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మ‌రుసు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజుల నుంచీ ఈ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌, యంగ్‌ క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ప్రేమలో ఉన్నారంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రియాంక `అతడే..` అంటూ హార్ట్‌ ఎమోజీ పెట్టి షేర్ చేసిన ఓ ఫొటో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

ఈ పిక్‌లో ప్రియాంక ఒక వ్యక్తి ఎదుట కూర్చిని క‌నిపిస్తోంది. అయితే అందులో స‌ద‌రు వ్య‌క్తి ముఖం మాత్రం క‌నిపించ‌లేదు. కానీ, ఆ వ్య‌క్తి వెంక‌టేశ్ అయ్య‌ర్ అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో తాజాగా ఆ ప్ర‌చారంపై ప్రియాంక ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

`ఫోటోలో నా ఎదురుగా కూర్చున్న అబ్బాయి ఆ రోజు ఫోటో షూట్ పనుల్లో సహాయం చేయడానికి వచ్చాడు. తన బాయ్‌ ఫ్రెండ్ అంటూ వ‌చ్చిన ఆర్టికల్స్ గురించి అమ్మ అడుగుతోంది. ఇక దీని గురించి మాట్లాడటం మానేస్తే బావుంటుంది` అంటూ ప్రియాంక సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొంది.


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

44 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

48 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

3 గంటలు ago