Entertainment News సినిమా

రెండు భాగాలుగా `ప్రాజెక్ట్ కె`.. పండ‌గ చేసుకుంటున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

Share

ప్ర‌భాస్  పాన్ ఇండియా స్టార్ట్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో `ప్రాజెక్ట్ కె` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే న‌టిస్తుంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దిశా పటానీ కీల‌క పాత్ర‌ల్లో అల‌రించ‌బోతున్నారు.వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో సైన్ ఫిక్ష‌నల్ మూవీగా పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యాబై శాతానికిపైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. మిగతా భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇక‌పోతే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంద‌ట‌. థ పరంగా చూసుకుంటే ఈ సినిమా స్పాన్ చాలా ఎక్కువగా ఉంటుంద‌ట‌. అందుకే పార్ట్ 2 తీయాలని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. ఈ న్యూస్ విన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్ మాత్రం పండ‌గ చేసుకుంటున్నారు. కాగా, శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18, 2023న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయలేని పక్షంలో 2024 సంక్రాంతికి `ప్రాజెక్ట్ కె` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Share

Related posts

27 ఏళ్ల తర్వాత ఆ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్… విశేషాలివే!

sowmya

వివాదాస్పదంగా మన్మోహన్ సింగ్ సినిమా

Siva Prasad

Bigg Boss Ott Telugu: బిగ్‏బాస్ ఇంటిని చూపించిన నాగార్జున.. వీడియో అదిరిందిగా!

kavya N